వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలవరం ప్రధాన రీటెండర్లో 628 కోట్ల ఆదా: 12.6 శాతం తక్కవకే కోట్ చేసిన మేఘా: ప్రభుత్వందే తుది నిర్ణయం

|
Google Oneindia TeluguNews

ప్రతిష్ఠాత్మకమైన పోలవరం రివర్స్ టెండరింగ్ లో ఒకే సంస్థ టెండర్ దాఖలు చేసింది. మేఘా ఇంజనీరింగ్ దాఖలు చేసిన టెండర్ గతం మొత్తం కంటే 12.6 శాతం తక్కువకే కోట్ చేసింది. దీని ద్వారా ఏపీ దాదానె 628 కోట్లు ఆదా అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ లో జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా ఆ పనికి మేఘా ఇంజనీరింగ్ ఒక్కటే 4358 మొత్తానికి టెండర్ దాఖలు చేసింది. ఈ పనులకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఒక్కటే బిడ్ దాఖులు చేసింది. అయితే దీని మీద ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని..కోర్టు అనుమతి లభిస్తే వెంటనే పనులు ప్రారంభిచేందుకు సిద్దంగా ఉన్నట్లు మేఘా సంస్థ ప్రభుత్వానికి నివేదించింది.

పోలవరం రివర్స్ టెండరింగ్ తో 628 కోట్లు ఆదా..
ప్రభుత్వం పట్టుదలతో నిర్వహించిన పోలవరం రివర్స్ టెండర్ల ద్వారా దాదాపు రూ 628 కోట్లు ఆదా అవుతాయని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. పోలవరంలో గత ప్రభుత్వ హాయంలో టెండర్లు దక్కించుకన్న వాటిలో అవినీతి జరిగిందని భావించిన వైసీపీ ప్రభుత్వం అక్కడ పనులను నిలిపివేసింది. కాంట్రాక్టర్ ను తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వ్యవహారం కోర్టుకు చేరింది. ఇక, ఇదే సమయంలో పోలవరం లో కీలక మైన జల విద్యుత్ కేంద్రంతో పాటు ప్రధాన కాంక్రీట్ నిర్మాణ పనికి రూ. 4987 కోట్లకు ప్రభుత్వం టెండర్ పిలవగా ఆ పనికి మేఘా ఇంజనీరింగ్ ఒక్కటే 4358 మొత్తానికి టెండర్ దాఖలు చేసింది. రివర్స్ టెండరింగ్ ద్వారా డబ్బు ఆదా అవుతుందని చెబుతూ వచ్చిన ప్రభుత్వ వాదనకు మద్దతుగా ఇప్పుడు మేఘా సంస్థ దాఖలు చేసిన టెండర్ ద్వారా నిరూపితం అవుతుందని అధికారులు చెబుతున్నారు. దీని ద్వారా మేఘా సంస్థ గతంలో వివిధ సంస్థలు చేపట్టిన ధర కంటే తక్కువకు శాతంకు -12.6% అంటే 4358 మొత్తానికి పనులు చేపట్టేందుకు ముందుకొచ్చినట్లుగా కనిపిస్తోంది. అయితే దీని పైన ఏపీ ప్రభుత్వం తో పాటుగా కోర్టు తుది ఆమోదం ఇవ్వాల్సి ఉంది.

in Reverse tendering MEGHA filed 628 cr less for polavaram

ప్రభుత్వం ఆచితూచి అడుగులు..
ఏపీ ప్రభుత్వం పోలవరం పనులు నిలిపివేసిన సమయం నుండి అనేక ఆరోపణలు చుట్టుముట్టాయి. అయినా ప్రభుత్వం దీని పైన రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయించింది. పోలవరం 65వ ప్యాకేజికి నిర్వహించిన రివర్స్ టెండర్లలో దాదాపు 58 కోట్లు ఆదా చేసామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక, ఇప్పుడు అక్కడి ఈ పనులను రద్దు చేసి రివర్స్ టెండర్కు వెళ్లి, పోలవరం హెడ్వర్క్స్తో తో పాటు జల విద్యుత్ కేంద్రాలను కలిపి ప్రభుత్వం రివర్స్ టెండర్ పిలిచింది. వాటి విలువ రూ 4987 కోట్లు. అయితే..ఏడు సంస్థలు తొలుత ఆసక్తి చూపినా.. ఈ పనులకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఒక్కటే బిడ్ దాఖులు చేసింది.
పోలవరం బిడ్ ఓపెన్ చేసిన ప్రభుత్వం అవసరమైన ప్రక్రియను పూర్తిచేసిన వెంటనే నిర్మాణ పనులు చేపట్టేందుకు మేఘా ఇంజనీరింగ్ సిద్దంగా ఉందని సంస్థ నిర్వాహకులు ప్రభుత్వానికి నివేదించారు. ఇక, నిర్దేశించిన సమయం లోగానే ఈ బహుళార్ధక ప్రాజెక్టు పూర్తి చేస్తామని సంస్థ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్దద్కెన కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా మేఘా సంస్థ పూర్తి చేసింది. ఇక..ఇప్పుడు మేఘా సంస్థకు పనులు అప్పగింత పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. కోర్టు అనుమతులు కీలకం కానున్నాయి.

English summary
MEGHA filed tender for Polavaram reverese tender with -12.6 percent less. It means nearly rs 628cr less compartive to previous tender. Agter Govt and court clearenece Megha ready to start wotks.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X