పొగ పెట్టిన కొట్లాట : బీరు బాటిళ్లతో దాడి చేసుకున్న రెండు గ్రూపులు, నలుగురికి గాయాలు
టెక్కలి : సిగరేట్ పొగ రెండు గ్యాంగుల మధ్య గొడవకు కారణమైంది. వైన్స్ షాపు వద్ద ఉన్న పర్మిట్ రూంలో రెండు గ్రూపులు మందు సేవిస్తున్నారు. ఇంతలో మరో గ్రూపుకు చెందిన ఒకరు సిగరేట్ తాగుతున్నారు. తమకు పొగ వస్తోందని మరో వర్గం అనడం, బయటకెళ్లి తాగమని చెప్పడంతో ఇరువర్గాలు తమ చేతిలో ఉన్న బీరుబాటిళ్లతో దాడిచేసుకునే వరకు వెళ్లింది.
గొడవకు కారణమిదే ?
శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల కేంద్రంలో గల సుదర్శన్ థియేటర్ సమీపంలో రాజా వైన్స్‌లో గొడవ జరిగింది. వైన్స్ షాపు పర్మిట్ రూంలో రెండు వర్గాలు మందు తాగుతున్నారు. ఇంతలో మరొ వర్గానికి చెందిన వారు సిగరేట్ తాగడం గొడవకు కారణమైంది. మాటలతో మొదలైన గొడవ చేతల వరకెళ్లింది. వీరిలో ఒక వర్గం స్థానికులు కాగా .. మరోకరు పక్కనేగల ఖైజోల గ్రామానికి చెందినవారు. వీరి గొడవలో నలుగురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరంతా ఖైజోల గ్రామానికి చెందినవారీగా గుర్తించారు.

పోలీసుల రంగప్రవేశం
ఇరువర్గాల గొడవ సమాచారం అందుకొన్న చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇరువర్గాలను పోలీసు స్టేషన్ కు తరలించారు. నలుగురు యువకులను ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications