వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ విషయంలో జ‌గ‌న్ ది ప‌చ్చి మోసం.! అందుకే వేరే దారి వెతుక్కున్నానంటున్న ఆది శేష‌గిరిరావు..!!

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, వైసీపి అద్య‌క్ష‌డు వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ్య‌క్తిగ‌త వ్య‌వ‌హార శైలి చాలా భిన్నంగా ఉంటుంద‌ని పార్టీలో ఎప్ప‌టినుంచో చ‌ర్చ జ‌రుగుతుంటుంది. ఆ వ్య‌వ‌హారం న‌చ్చ‌క చాలా మంది సీనియ‌ర్ నేత‌లు పార్టీని వీడి పోతున్న‌ప్ప‌టికి అధినేత డోంట్ కేర్ అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించే తీరుకూడా చాలా మంది నేత‌ల‌కు రుచించద‌నే భావ‌న కూడా వైసీపిలో ఉంది. తాజాగా పార్టీ సీనియ‌ర్ నేత ఆది శేష‌గిరిరావు అంశంలో కూడా జ‌గ‌న్ వ్య‌వ‌హారం అంటీమున్న‌ట్టు ఉండ‌డ‌మే ఆయ‌న నిష్క్ర‌మ‌ణ‌కు కార‌ణ‌మ‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత జ‌రుగుతున్న‌ప్ప‌టికి అమ‌రావ‌తిలో ఓ ఆస్థికి సంబందించి జ‌గ‌న్ పెట్టిన మెలిక ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబానికి దిమ్మ‌తిరిగేలా చేసింద‌నే వార్త కూడా షికారు చేస్తోంది.

 జ‌గ‌న్ చేసింది ముమ్మాటికీ త‌ప్పే..! అందుకే పార్టీకి రాంరాం అంటున్న ఆది..!!

జ‌గ‌న్ చేసింది ముమ్మాటికీ త‌ప్పే..! అందుకే పార్టీకి రాంరాం అంటున్న ఆది..!!

వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరి రావును నమ్మించి మోసం చేసిన‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. వైసీపి సీనియ‌ర్ నేత‌ ఆదిశేషగిరి రావు రాజీనామా వెనుక చాలా పెద్ద కథే ఉందని చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. దీంతో గత కొద్దిరోజులుగా పెద్ద యెత్తున చ‌ర్చ జ‌రుగుతున్న ఈ ఉదంతం కాస్త జనాల్లో వాడి వేడిగా మారింది. పార్టీలో క్రింద స్థాయి నుండి పై స్థాయి వ‌ర‌కు ఎవ‌రు చూసినా పార్టీ అదినేత వైఎస్ జగన్ నమ్మించి మోసం చేయటం కారణంగానే ఆదిశేషగిరి రావు పార్టీ వీడుతున్నారనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత‌కీ వారిద్ద‌రి మ‌ద్య జ‌రిగిన అంత పెద్ద త‌ప్పు ఏంటి..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!!

టికెట్ విష‌యంలో స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు..! కేర్ లెస్ నెస్ వ్య‌వ‌హారం బాదించిందంటున్న శేషు..!!

టికెట్ విష‌యంలో స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు..! కేర్ లెస్ నెస్ వ్య‌వ‌హారం బాదించిందంటున్న శేషు..!!

వ‌చ్చే ఫిబ్రవరి నెలలో జగన్ అమరావతిలో గృహప్రవేశం చేయబోతున్నారు. ఇదే అంశాన్ని స్వ‌యంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి నిర్దారించారు కూడా..! అయితే ఇప్పటికే జగన్ సొంత భ‌వంతుల వివరాలు తెలుసుకొని అవాక్క‌వుతున్న ఈ అంశం ప‌ట్ల కూడా బిత్తరపోతున్నార‌ట‌. ఇడుపులపాయ ఎస్టేట్ మొదలుకొని పులివెందుల, కడప, హైదరాబాద్, బెంగుళూరులో.. ఎకరాల కొద్దీ ఉన్న భవనాలు సామాన్యుల‌ను ఔరా అనిపిస్తుంటాయి. తాజాగా ఈ జాబితాలో కొత్తగా అమరావతి చేరుతోంది. తాడేపల్లి దగ్గర జగన్ ఇల్లు అంటూ ఓ భారీ ప్యాలెస్ ఒకటి సోషల్ మీడియాలో హ‌ల్ చ‌లం చేస్తోంది. అదే జగన్ నివ‌సించ‌బోయే ఇల్లు. ఇంతవరకు క‌థ బాగానే ఉన్న‌ప్ప‌టికి అస‌లు క‌థ ఇక్క‌డే మొద‌లౌతోంది.

తాడే ప‌ల్లిలో శేష‌గిరి రావు డ్రీమ్ హౌస్..! ఇప్పుడు జ‌గ‌న్ దే అంటే ఎలా అంటున్న ఘ‌ట్ట‌మ‌నేని ఆది..!

తాడే ప‌ల్లిలో శేష‌గిరి రావు డ్రీమ్ హౌస్..! ఇప్పుడు జ‌గ‌న్ దే అంటే ఎలా అంటున్న ఘ‌ట్ట‌మ‌నేని ఆది..!

అమ‌రావ‌తి న‌డిబొడ్డున తాడేప‌ల్లిలో ఆ ఇంటిని కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు నిర్మించుకున్న‌ట్టు తెలుస్తోంది. వైఎస్ పదవిలో ఉన్న సమయంలో అనేక విషయాల్లో లబ్ది పొందిన కారణంగా, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఆ ఇంటిని నిర్మించారని తెలుస్తోంది. ఈ విషయం అక్కడ ఉన్న పరిసర ప్రజలందరికీ కూడా సుప‌రిచిత‌మే..! నిర్మాణం పూర్తౌతున్న త‌రుణంలో ఇప్పుడది జగన్ నూతన గృహం అని ప్రచారం మొదలవడంతో ఘ‌ట్ట‌మ‌నేని కుటుంబంతో పాటు స్థానికి ప్ర‌జానికం ఆశ్చ‌ర్యాన్ని వ్య‌క్తం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. తెరవెనుక ఆది శేష‌గిరి రావుపై ఎంత ఒత్తిడి వ‌చ్చి ఉంటుందోన‌నే చ‌ర్చ కూడా పెద్ద యెత్తున జ‌రుగుతోంది.

 జ‌గ‌న్ కు ఎవ‌రి మ‌నోభావాలూ ప‌ట్ట‌వు..! అంతా వ‌న్ మాన్ షో అంటున్న శేష‌గిరిరావు..!!

జ‌గ‌న్ కు ఎవ‌రి మ‌నోభావాలూ ప‌ట్ట‌వు..! అంతా వ‌న్ మాన్ షో అంటున్న శేష‌గిరిరావు..!!

ఆది శేషగిరిరావుకు సొంత ఇంటి అంశంలోనే కాకుండా పార్టీ ప‌రంగా కూడా జ‌గ‌న్ ఎన్నో హామీలు ఇచ్చిన‌ట్టు స‌మాచారం. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్ ఇస్తాన‌ని ఆశ చూపి ఇంత‌వ‌ర‌కూ ఆ అంశంపై జగన్ స్ప‌ష్టత ఇవ్వ‌లేద‌ని ఆది శేష‌గిరి రావు వ‌ర్గం చెప్పుకొస్తోంది. సాధార‌ణంగా జ‌గ‌న్ వ్యవహారం నాన్చుడు ధోర‌ణి ఉంటుంద‌ని పార్టీలో చ‌ర్చ జ‌రుగుతోంది. చివరికి ఆదిశేషగిరిరావుకు టిక్కెట్ లేదని తేల్చి చెప్ప‌డంతో ఆయన పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవటం జరిగిందని స‌మాచారం. ఆది శేష‌గిరి రావు వైసీపి నిష్క్ర‌మ‌ణ వెనుక ఉన్న అసలు సంగతి ఇదే న‌నే చ‌ర్చ స‌ర్వ‌త్రా సాగుతోంది. అటు నివాసం విష‌యంలో ఇటు టికెట్ అంశంలో జ‌రిగిన ప‌రాభవానికి నిర‌శ‌న‌గా ఆది శేష‌గిరి రావు పార్టీకి రాజీనామా చేసిన‌ట్టు విశ్వ‌స‌నీయంగా అందుతున్న‌ స‌మాచారం.

English summary
Many senior leaders are dropping the party because they do not like personal opinion of YSR Congress chief YS Jagan Mohan Reddy. The YCP cadre also feels that the manner in which the head of the department shows carelessness about the leaders. The latest issue of the party's senior leader Aadi Seshagiri Rao is that the Jagan's affair is uncertain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X