వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టీడీపీ ఓటమిపాలై మూడు వారాలే .. అప్పుడే 100 చోట్ల దాడులు అని చంద్రబాబు ఆవేదన

|
Google Oneindia TeluguNews

గుంటూరులో టీడీపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరుగుతుంది .చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ రాష్ట్రస్థాయి మీటింగ్ కు విజయవాడ ఏ 1 కన్వెన్షన్ సెంటర్ వేదికైంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు వర్క్ షాప్ కి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు అందరూ హాజరయ్యారు.ఈ సమావేశంలో ఎన్నికల్లో ఓటమికి గల కారణాలపై టీడీపీ నాయకత్వం సమీక్ష నిర్వహిస్తున్నారు .ఇక ఈ సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఓటమికి కారణాలు స్పష్టంగా తెలిసేవని ఈసారి తెలియటం లేదని పేర్కొన్నారు.

విద్యుత్ ఒప్పందాలపై విచారణకే మొగ్గు చూపుతున్న జగన్ .. టీడీపీకి షాక్ .. కేంద్రానికి ఝలక్ విద్యుత్ ఒప్పందాలపై విచారణకే మొగ్గు చూపుతున్న జగన్ .. టీడీపీకి షాక్ .. కేంద్రానికి ఝలక్

 ఓడిన 3 వారాల్లో రాష్ట్రంలోని 100 చోట్ల దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు

ఓడిన 3 వారాల్లో రాష్ట్రంలోని 100 చోట్ల దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు

ఇక రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని టీడీపీ ఓటమి పాలైన 3 వారాల్లో రాష్ట్రంలోని 100 చోట్ల దాడులు చోటు చేసుకొన్నాయని చంద్రబాబు ఆవేదన చెందారు.. గ్రామ స్థాయిలో కార్యకర్తలకు నేతలు అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యకర్తల కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీ ఐదు సార్లు విజయం సాధించినా ఏనాడూ ప్రత్యర్థులపై దాడులు చేయలేదని చంద్రబాబు పేర్కొన్నారు . కానీ, ప్రత్యర్థులు విజయం సాధించినప్పుడల్లా తమ పార్టీపై దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు గుర్తు చేశారు.

జిల్లాల వారీగా ఓటమి కారణాల విశ్లేషణ .. భవిష్యత్ కార్యాచరణ

జిల్లాల వారీగా ఓటమి కారణాల విశ్లేషణ .. భవిష్యత్ కార్యాచరణ

టీడీపీ కార్యకర్తలపై ఇంకా దాడులు జరుగుతున్నాయని, టీడీపీ ఓడిన 3 వారాల్లోనే 100 చోట్ల దాడులు జరిగాయని , సమస్య తీవ్రక ఎక్కువగా ఉందని ,ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని చంద్రబాబు చెప్పారు .టీడీపీ కార్యకర్తలపై దాడుల సమాచారాన్ని జిల్లాల వారీగా సేకరించి వాటిని ఎలా ఎదుర్కోవాలో చర్చ చేస్తుంది అధినాయకత్వం. శ్రేణులకు ధైర్యం చెప్పడంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై వర్క్ షాప్ లో చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా ఓటమికి గల కారణాలను చంద్రబాబు విశ్లేషిస్తున్నారు. జిల్లాల వారీగా పార్టీ శ్రేణులను బలోపేతం చేసి పార్టీని ముందుకు నడిపించాలని సూచిస్తున్నారు.

కార్యకర్తలకు అండగా ఉండాలని చంద్రబాబు సూచన .. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

కార్యకర్తలకు అండగా ఉండాలని చంద్రబాబు సూచన .. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

భవిష్యత్ కార్యాచరణ గురించి పార్టీలో చర్చిస్తున్నారు. అందరూ కార్యకర్తలకు అండగా ఉండాలని పేర్కొన్నారు . ప్రత్యర్థులు గెలిచినప్పుడు టీడీపీ కార్యకర్తలపై దాడులు చేయటం అలవాటుగా మారిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమిపై సమీక్ష చేసుకోవాలని నేతలకు సూచించిన చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో ఓటమికి కారణాలు కూడా తెలియలేదన్నారు.

English summary
Chandrababu said that there were worse conditions in the state and that in three weeks after the defeat of TDP, there were 100 attacks in the state. He said a toll free number would be set up for activists. Chandrababu said that even though the TDP won five times in the state, never attacked any of the opponents.However, Chandrababu reminded that the attacks on his party are happening when the opponents win.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X