• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

పెరుగుతున్న కరోనా కేసులు... ఆ పని చెయ్ సుబ్బారావ్ అంటూ కేఏ పాల్ ని టార్గెట్ చేసిన వర్మ

|

కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరుగుతూ ప్రజలు ఆందోళన చెందుతుంటే కరోనా వైరస్ పై కాంట్రవర్సీలు కూడా కొనసాగుతున్నాయి. ఒకపక్క ప్రజల్లో అవగాహన కల్పించటం కోసం , కరోనా వ్యాప్తి చెందకుండా చూడటం కోసం చాలా మంది ప్రముఖులు తమ వంతు ప్రయత్నం చేస్తుంటే వివాదాస్పద దర్శకుడు రాం గోపాల్ వర్మ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కరోనా తగ్గటం కోసం ప్రేయర్ చెయ్యాలని, భగవంతుడిని ప్రార్ధించాలని చెప్పటంతో కేఏ పాల్ టార్గెట్ గా పోస్ట్ పెట్టారు .

సర్జరీలపై కరోనా వైరస్ ఎఫెక్ట్: నిమ్స్ సంచలన నిర్ణయం: సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా.. !

 సుత్తి సలహాలు ఇవ్వొద్దని కేఏ పాల్ కు పంచ్ ఇచ్చిన రాం గోపాల్ వర్మ

సుత్తి సలహాలు ఇవ్వొద్దని కేఏ పాల్ కు పంచ్ ఇచ్చిన రాం గోపాల్ వర్మ

సంచలనాలు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రామ్‌గోపాల్ వర్మ కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆయన తనదైన స్టైల్లో ట్వీట్లు పెడుతున్నారు. రకరకాల డౌట్లు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు . ఇక ఈ నేపధ్యంలో భాగంతుడిని ప్రార్ధిస్తే కరోనా తగ్గుతుందని చెప్పిన కేఏ పాల్ ని ఈసారి వర్మ టార్గెట్ చేశారు . అరే కేఏ పాలు..ఈ సుత్తి సలహాలు ఇచ్చే బదులు నీ దేవునితో చెప్పి కరోనాని తీసేయమని చెప్పొచ్చు కదరా సుబ్బారావ్.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

నీకు దేవుడి దగ్గర అంత సీన్ ఉంటె నాకు కరోనా వచ్చేలా చెయ్ అని వర్మ ట్వీట్

నీకు దేవుడి దగ్గర అంత సీన్ ఉంటె నాకు కరోనా వచ్చేలా చెయ్ అని వర్మ ట్వీట్

అంతేకాదు నీకు నిజంగా దేవుడి దగ్గర అంత సీన్ ఉంటే నేను తిట్టిన తిట్లకు నాకు కూడా కరోనా వచ్చేట్లు చేయి ఎంకమ్మ' అని కేఏ పాల్‌పై సెటైర్లు వేశారు . ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇక ప్రస్తుతం తానూ అమెరికాలో ఉన్నానని , కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో తాను ప్రభుత్వాలకు ఏ విధంగా సహాయపదగాల్నో చెప్తూ ప్రజలను ప్రేయర్స్ చెయ్యాలని చెప్పారు కేఏ పాల్ .

  కరోనా Thermal Scanning Center At TDP Central Office | Oneindia Telugu
   తన చారిటీ భవనాలను కరోనా కంట్రోల్ కోసం వాడుకోవాలని ప్రభుత్వాలను కోరిన కేఏ పాల్

  తన చారిటీ భవనాలను కరోనా కంట్రోల్ కోసం వాడుకోవాలని ప్రభుత్వాలను కోరిన కేఏ పాల్

  తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విస్తరిస్తోన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల సీఎంలు వైరస్ నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న వేళ ఏపీ, తెలంగాణకు క్వారంటైన్ సెంటర్ల అవసరం ఉందని అందుకే తన వంతుగా సహాయం చేస్తానని వీడియో ద్వారా వెల్లడించారు కేఏ పాల్ . ఏపీ, తెలంగాణలోని తమ సంస్థకు ఉన్న చారిటీ గదుల్ని క్వారంటైన్ సెంటర్లుగా వాడుకోమన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాటిని కూడా సంబంధిత ప్రభుత్వాలు అడిగితే తప్పక ఇస్తానని కేఏ పాల్ చెప్పారు.

  English summary
  Ramgopal Varma, sensational director and care of adress to controversies has been tweeting about his style following the outbreak of coronavirus. Various doubts are expressing themselves as a social media platform. This time, Varma targeted KA Paul, who said that praying a fraction of this background would reduce corona. Well ka paul Instead of giving this hammer advice, tell your God to remove the corona. and varma called sarcasically KA Paul as Subbarao ..
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more