వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలో ఊరు.. వాడ.. స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు: హైదరాబాద్‌లో వేడుకలు చేసుకున్న చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

అమరావతి : బ్రిటిష్ బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలుగడంతో ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేడుకకు సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. సీఎం జగన్ జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అంతకుముందు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్టేడియం పరిసరాల్లో భారీ భద్రతను మొహరించారు. జాగీలాలతో అణువణువూ పరిశీలిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే వేడుకలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.

Independence Day Celebrations in Andhra Pradesh: Live Updates

Newest First Oldest First
1:03 PM, 15 Aug

ప్రపంచంలోనే గర్వించదగ్గ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర మనది: చంద్రబాబు
1:02 PM, 15 Aug

భారత దేశ ప్రజలందరికీ 73వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు : చంద్రబాబు
1:01 PM, 15 Aug

తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బాబు
1:01 PM, 15 Aug

హైదరాబాద్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకున్న చంద్రబాబు
12:29 PM, 15 Aug

దేశం కోసం నిలబడే పార్టీ జనసేన : పవన్ కళ్యాణ్
12:29 PM, 15 Aug

స్వాతంత్ర దినోత్సవాలు వారం రోజుల పాటు నిర్వహించాలన్నది నా కల : పవన్ కళ్యాణ్
12:25 PM, 15 Aug

చిన్నారులతో కలిసి వందేమాతరం అంటు నినాదాలు చేసిన జన సేనాని
12:25 PM, 15 Aug

మంగళగిరి జనసేన కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పవన్ కళ్యాణ్.
11:09 AM, 15 Aug

జైహింద్‌తో స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ముగించిన సీఎం జగన్
11:04 AM, 15 Aug

ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు స్పందన కార్యక్రమంను అమలు చేస్తున్నాం: సీఎం జగన్
11:02 AM, 15 Aug

దేశంలో పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ:సీఎం జగన్
11:02 AM, 15 Aug

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీన ప్రక్రియపై కమిటీ వేశాం.. సూచనల కోసం ఎదురు చూస్తున్నాం: సీఎం జగన్
11:01 AM, 15 Aug

సీపీఎస్ రద్దుకు కేబినెట్ కమిటీ వేశాం: సీఎం జగన్
10:58 AM, 15 Aug

ఇళ్ల పట్టాల పంపిణీ తర్వాత రూ.6 లక్షలతో ఇళ్లు కడుతాం: సీఎం జగన్
10:58 AM, 15 Aug

ఉగాది నాటికి 25 లక్షల మందికి ఒకటిన్నర సెంటు ఇళ్ల స్థలం ఇవ్వబోతున్నాం: సీఎం జగన్
10:57 AM, 15 Aug

జనవరి నుంచి 1000 అంబులెన్స్‌లు అందుబాటులోకి వస్తాయి: సీఎం జగన్
10:56 AM, 15 Aug

104, 108 అంబులెన్స్‌లను గాడిలో పెట్టబోతున్నాం: సీఎం జగన్
10:56 AM, 15 Aug

రాబోయే రోజుల్లో మరిన్ని వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చుతాం: సీఎం జగన్
10:55 AM, 15 Aug

ఇతర రాష్ట్రాల్లో కూడా వైద్యం చేయించుకునేలా హాస్పిటల్స్ ఎంపానెల్‌మెంట్ చేస్తాం: సీఎం జగన్
10:54 AM, 15 Aug

రూ.1000 బిల్లు దాటితే చాలు ఏడాదికి రూ.5 లక్షలలోపు ఆదాయం ఉన్న వారికి ఆరోగ్య శ్రీని వర్తింపజేస్తున్నాం: సీఎం జగన్
10:53 AM, 15 Aug

పెన్షన్ వయస్సును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించాం: సీఎం జగన్
10:52 AM, 15 Aug

పెన్షన్‌ను రూ. 2250కి పెంచి ప్రతి అవ్వకు అక్కను ఆదుకుంటున్నాం: సీఎం జగన్
10:51 AM, 15 Aug

ప్రతి స్కూలును ఇంగ్లీషు మీడియంగా తీర్చబోతున్నాం: సీఎం జగన్
10:51 AM, 15 Aug

మూడేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో రూపురేఖలు మార్చబోతున్నాం: సీఎం జగన్
10:51 AM, 15 Aug

రాష్ట్రంలో చదువుల విప్లవం తీసుకురావాలని భావిస్తున్నాం: సీఎం జగన్
10:50 AM, 15 Aug

అమ్మ ఒడి పథకాన్ని జనవరి 26న ప్రారంభించనున్నాం: సీఎం జగన్
10:49 AM, 15 Aug

వాలంటీర్లకు ఈ రోజు నుంచే శ్రీకారం చుట్టబోతున్నాం: సీఎం జగన్
10:48 AM, 15 Aug

పారదర్శకత్వమైన పాలన అందించేందుకు పూనుకున్నాం: సీఎం జగన్
10:44 AM, 15 Aug

గోదావరి జలలాను నాగార్జున శ్రీశైలం తరలించడం ద్వారా జల స్థిరీకరణ చేస్తున్నాం: సీఎం జగన్
10:42 AM, 15 Aug

ప్రతి నియోజకవర్గంలో కోల్డ్ స్టోరేజీ, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు దశలవారీగా ఏర్పాటు చేస్తాం: సీఎం జగన్
READ MORE

English summary
celebrate Independence Day Indira Gandhi Municipal Stadium. prepares for celebration in AP The authorities have already completed the arrangements. CM jagan unveil the national flag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X