వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Sabarimala: అయ్యప్పస్వామి ప్రసాదం డోర్ డెలవరి, ఎవరికి ఎంత లాభం, వచ్చిన ఆదాయం ఎన్ని కోట్లు !

|
Google Oneindia TeluguNews

శబరిమల/ హైదరాబాద్/ తిరుపతి: ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం శబరిమలకు వివిద కారణాలుగా వెళ్లడానికి వీలులేని భక్తులు కేరళలోని అయ్యప్పస్వామి సన్నిధానం నుంచి పవిత్రమైన ప్రసాదం తెప్పించుకుని స్వామియే శరణమయ్యప్ప అంటూ స్వామిని వేడుకుంటున్నారు. ఇండియా స్పీడ్ పోస్టు ద్వారా దేశంలోని అన్ని నగరాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని తపాలా కార్యాలయాల సిబ్బంది అయ్యప్పస్వామి భక్తులకు శబరిమల ప్రసాదం అందిస్తున్నారు. ఇప్పటి వరకు భక్తులు ఎక్కువ శాతం ప్రసాదం తెప్పించుకోవడంతో శబరిమలకు, తపాలా శాఖకు భారీగానే ఆదాయం వస్తోందని అధికారులు అంటున్నారు.

Sabarimala: నిన్న రోజుకు రూ. 3. 5 కోట్లు ఆధాయం, నేడు రూ. 10 లక్షలు, ప్రభుత్వం వింతనియమాలు!Sabarimala: నిన్న రోజుకు రూ. 3. 5 కోట్లు ఆధాయం, నేడు రూ. 10 లక్షలు, ప్రభుత్వం వింతనియమాలు!

 ఈసారి చాన్స్ మిస్

ఈసారి చాన్స్ మిస్

కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి దెబ్బ కారణంగా శబరిమలలోని అయ్యప్పస్వామి సన్నిధానంకు వెళ్లడానికి ఎక్కువ మంది భక్తులకు అవకాశం లేకుండా పోయింది. కరోనా వైరస్ వ్యాపిస్తుందనే భయంతో ఎప్పటిలాగా శబరిమలకు వెలుతున్న కొన్ని లక్ష్లల మంది భక్తులు ఈ సంవత్సరం శబరిమలకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది.

 శబరిమల ప్రసాదం పార్శిల్

శబరిమల ప్రసాదం పార్శిల్

శబరిమలలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది అయ్యప్పస్వామి ప్రసాదం వారి ఇళ్లకు తీసుకెళ్లి బంధువులు, స్నేహితులు, అయ్యప్ప భక్తులకు పంచిపెడుతుంటారు. కరోనా దెబ్బతో ఈ ఏడాది శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య దాదాపుగా తగ్గిపోవడంతో భక్తులు కొంచెం నిరాశ చెందారు. శబరిమలకు వెళ్లడానికి అవకాశం లేని అయ్యప్ప భక్తులకు అయ్యప్పస్వామి ప్రసాదం డోర్ డెలివరీ ఇవ్వాలని శబరిమల దేవస్వం బోర్డు నిర్ణయించింది.

 రూ. 450 కు అయ్యప్ప ప్రసాదం

రూ. 450 కు అయ్యప్ప ప్రసాదం

శబరిమలలో ప్రతి సంవత్సరం విక్రయించే పవిత్రమైన అయ్యప్పస్వామి ప్రసాదం ఇప్పుడు దేశంలోని నలుమూలల ఉన్న అయ్యప్పస్వామి భక్తులకు అందుతోంది. ఇండియా పోస్టు (తపాలా శాఖ) దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలకు అయ్యప్పస్వామి ప్రసాదం అందించే భాద్యతలు స్వీకరించింది. ఇప్పటి వరకు తపాలా శాఖ 24, 642 కిట్ ల అయ్యప్పస్వామి ప్రసాదం శబరిమల నుంచి స్పీడ్ పోస్టు ద్వారా భక్తులకు అందించింది.

 ఎవరికి ఎంత లాభం అంటే !

ఎవరికి ఎంత లాభం అంటే !

ఇప్పటి వరకు శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం భక్తులు కొనుగోలు చెయ్యడం వలన రూ. 1, 10, 88, 900 ఆధాయం వచ్చింది. శబరిమల దేవస్వం బోర్డు (ట్రావన్ కోర్ దేవస్వం బోర్డు)కు రూ. 61, 60, 500, ప్రసాదం అందిస్తున్న తపాలా శాఖకు రూ. 48, 28, 400 ఆధాయం వచ్చింది. అయ్యప్పస్వామి ప్రసాదం కిట్ లో నెయ్యి, కేసరి, కుంకుమ, విభూతి, అయ్యప్పస్వామికి పూజ చేసి అర్చన ప్రసాదం తదితర పవిత్రమైన వస్తువులు ఉన్నాయని, వచ్చే నెలలో ప్రసాదం విక్రయాల వలన మరింత ఆధాయం వచ్చే అవకాశం ఉందని శబరిమల దేవస్వం బోర్డు అధికారులు అంటున్నారు.

Recommended Video

Kerala Local Body Polls : NDA secures the Pandalam Municipality
 రూ. 450 అయ్యప్పస్వామి ప్రసాదం

రూ. 450 అయ్యప్పస్వామి ప్రసాదం

శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం విక్రయాల వలన శబరిమల దేవస్వం బోర్డుకు, తపాలా శాఖకు మంచి ఆధాయం వస్తోందని సంబంధిత అధికారులు అంటున్నారు. అయ్యప్పస్వామి ప్రసాదం ఒక్క కిట్ రూ. 450 అయితే అందులో రూ. 250 శబరిమల దేవస్వం బోర్డుకు, రూ. 200 తపాలా శాఖకు ఆదాయం వస్తోందని అధికారులు తెలిపారు.

English summary
Sabarimala: India post has collected Rs 1.10 crore so far from Sabarimala prasadam postal delivery scheme with Travancore Devaswam Board.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X