రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజమండ్రి రహదారిపై యుద్దవిమానాలు?: ఫ్యూచర్‌లో అలా.. కసరత్తులు షురూ!

చర్చల ఫలితంగా దేశంలోని 12 జాతీయ రహదారుల్లో అత్యవసర ఎయిర్ స్ట్రిప్‌లు(ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్) ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రతికూల పరిస్థితులు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నపళంగా ల్యాండ్ అయేందుకు జాతీయ రహదారులనే అనువైన మార్గంగా ఎంచుకుంటోంది భారత వాయుసేన. ఈ మేరకు దేశంలోని ఎయిర్ స్ట్రిప్ ల సంఖ్యను పెంచాలని ఏడాది కాలంగా కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతోంది.

చర్చల ఫలితంగా దేశంలోని 12 జాతీయ రహదారుల్లో అత్యవసర ఎయిర్ స్ట్రిప్‌లు(ఎమర్జెన్సీ ల్యాండింగ్ స్ట్రిప్) ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆమోదం లభించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీలోను ఒక ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత వాయుసేన ప్రతిపాదన మేరకు కేంద్రం కూడా దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

రాజమండ్రి అనువైన ప్రాంతం:

రాజమండ్రి అనువైన ప్రాంతం:

మావోయిస్టు, ఉగ్రవాద ప్రాబల్యం ఉన్న ప్రాంతాలతోపాటు ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశాలున్న రాష్ట్రాల్లో అత్యవసర ఎయిర్‌ స్ట్రిప్‌ లు అవసరమని వాయుసేన సూచించింది. వాయుసేన ప్రతిపాదనతో ఏపీలోని పలు ప్రాంతాలను పరిశీలించిన అధికారులు.. మన్యం, సముద్ర తీరాలకు దగ్గర్లో ఉండే రాజమహేంద్రవరాన్ని ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటుకు అనువైందిగా ఎంచుకున్నట్లు సమాచారం.

నేషనల్ హైవే-16

నేషనల్ హైవే-16

రాజమండ్రి మీదుగా వెళ్లే జాతీయ రహదారి-16ను ఇందుకోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే అనుకున్నంత సులువుగా ఎయిర్ స్ట్రిప్ ఏర్పాటు చేయడం అంత సామాన్యమేమి కాదు. నిజానికి యుద్ద విమానాలు లేదా సరుకు రవాణా విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అవాలంటే.. ఆరు లేన్ల రోడ్డు ఉండాల్సి ఉంటుంది.

ఇవీ చిక్కులు:

ఇవీ చిక్కులు:

రాజమండ్రి సమీపంలో ఆరు లేన్ల రోడ్డు సౌకర్యం ఉందా?.. లేక భవిష్యత్తులో అందుకు అనుగుణంగా రహదారిని తీర్చి దిద్దుతారా? అన్న దానిపై స్పష్టత లేదు. యుద్ద విమానాలు దిగే సమయంలో.. గంటల తరబడి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది కాబట్టి.. కచ్చితంగా బైపాస్ రోడ్ల అవసరం ఉంటుంది. ఈ విషయంపై అధికారులు మరింత లోతుగా అధ్యయనం చేసే అవకాశం ఉంది.

నిధులు వాయుసేనవే:

నిధులు వాయుసేనవే:

రహదారులపై ఎయిర్ స్ట్రిప్ ల ఏర్పాటుకు సంబంధించిన నిధులను వాయుసేన సమకూర్చనుంది. ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌ గఢ్‌, జార్ఖండ్‌, తమిళనాడు, అసోం, బిహార్‌, యూపీ, గుజరాత్‌ తదితర రాష్ట్రాల్లోని జాతీయ రహదారులను తొలుత ఇందుకోసం పరిశీలించనున్నారు.

English summary
The Indian Air Force (IAF) has cleared 12 national highways (NHs) as emergency landing airstrips that will enable rescue operation teams to reach affected areas easily, an official responsible for executing the project said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X