రైల్వే ప్రయాణికులకు మఖ్య గమనిక
మనదేశంలో 1853 ఏప్రిల్ 16వ తేదీన మొదటి ప్యాసింజర్ రైలు ప్రారంభమైంది. ముంబయి-థానే మధ్య 33 కిలోమీటర్లు ప్రయాణం జరిగింది. క్రమంగా రైళ్లు తమ సేవలను దేశవ్యాప్తంగా విస్తరించాయి. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రైల్వే నెట్ వర్క్ ఇండియాదే. ప్యాసింజర్ రైళ్లతో మొదలైన ప్రయాణం ఇప్పటికీ సెమీ హైస్పీడ్ రైళ్లను నడిపే దశకు భారతీయ రైల్వే చేరుకుంది. త్వరలోనే దేశంలో బుల్లెట్ రైళ్లను నడిపించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంజన్లను కూడా మనదేశంలో భారీగా ఉత్పత్తి చేస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నారు.
మన రైల్వేలో ఉన్న మరికొన్ని విషయాలను తెలుసుకుందాం.
* మొదటి రైలు బోరి బందర్ - థానే మధ్య నడిచింది.
* తొలి రైల్వే వర్క్ షాప్ బీహార్ లోని జమాల్ పూర్ లో ఏర్పాటు చేశారు.
* రైల్వే మస్కట్ లో గార్డుగా దుస్తులు ధరించిన ఏనుగు ఉంటుంది. నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ దీన్ని రూపొందించింది.

* న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్య నడిచే వందేభారత్ స్పీడ్ 130 కిలోమీటర్లు.
* దేశంలోనే వేగంగా ప్రయాణించే రైలు గతిమాన్ ఎక్స్ ప్రెస్. నిజాముద్దీన్ నుంచి ఆగ్రా మధ్య 160 కిలోమీటర్ల వేగంతో నడుస్తోంది. ఈ క్రమంలోనే ఆగ్రా-ఝాన్సీ మధ్య 130 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
* డిబ్రూఘడ్ - కన్యాకుమారి మధ్య నడిచే వివేక్ ఎక్స్ ప్రెస్ 82 గంటల 30 నిముషాలు ప్రయాణం చేస్తుంది. మొత్తం 4286 కిలోమీటర్ల దూరం పయనిస్తుంది. మొత్తం 57 స్టేషన్లలో ఆగుతుంది.
* ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ 1,366 మీటర్ల పొడవుంటుంది. ప్రపంచంలోనే అతి పొడవైన ప్లాట్ ఫాం ఇది.
* మనదేశంలో అతి పెద్ద రైల్వే జంక్షన్ మధుర. ఇక్కడి నుంచి ఏడుమార్గాలున్నాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచి కనెక్టివిటీ ఉంటుంది.












Click it and Unblock the Notifications