వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్ డౌన్ లో ప్రాణభయం- గూగుల్ లో వాటి కోసం సెర్చ్- ఏకంగా 190 శాతం ఎక్కువగా...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ లాక్ డౌన్ సందర్భంగా భారతీయులు ఇళ్లకే పరిమిత మయ్యారు. ఉద్యోగులు, రాజకీయ నేతలు, సాధారణ ప్రజలు కూడా బయటకు వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. అందరిలోనూ ఒకటే భయం కరోనా వైరస్. బయటికి వెళితే చాలు ఎక్కడ వైరస్ అంటుకుంటుదో అని భయపడని మనిషి లేడు. ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్ధితి ఉన్నా అత్యధిక జనాభా కలిగిన భారత్ లో ఈ భయం మరింత ఎక్కువగా ఉందని తాజాగా గూగుల్ విడుదల చేసిన సెర్చ్ ఇంజిన్ రిజల్ట్ స్పష్టం చేస్తోంది.

 ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం .. ఇక ఎస్ఎంఎస్ ద్వారా కరోనా టెస్ట్ రిపోర్ట్ నేరుగా వారికే .. రీజన్ ఇదే ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం .. ఇక ఎస్ఎంఎస్ ద్వారా కరోనా టెస్ట్ రిపోర్ట్ నేరుగా వారికే .. రీజన్ ఇదే

 భారతీయులకు కరోనా భయం...

భారతీయులకు కరోనా భయం...

ప్రపంచ వ్యాప్తంగా కల్లోలం రేపిన కరోనా వైరస్ మహమ్మారి పేరు చెబితే చాలు భారతీయుల్లో ఎక్కడ లేని భయం కనిపిస్తోంది. దేశంలో ఉండే వాతావరణ పరిస్ధితులు, వైద్య సదుపాయాలు, ప్రభుత్వాల పనితీరు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుంటే కరోనా వ్యాప్తి భయాలు భారతీయుల్లో ఎక్కువగా కనిపించాయి. మార్చి 24న కరోనా ప్రభావంతో లాక్ డౌన్ ప్రారంభం కాగా... మే నెల నాటికి ఈ ప్రభావం మరింత పెరిగింది. భారీగా నమోదవుతున్న కేసులతో జనం మే నెల నాటికి పూర్తిగా ఇళ్లకే పరిమితమయ్యారు. వేసవి కావడంతో ఎండల ప్రభావం కూడా అత్యధికంగా ఉండటంతో ఇళ్లలోనే ఉన్న జనం... ఎక్కువగా ఇంటర్నెట్ వాడకానికే పరిమితమయ్యారు.

 గూగుల్ లో అత్యధికంగా సెర్చ్....

గూగుల్ లో అత్యధికంగా సెర్చ్....

లాక్ డౌన్ సందర్భంగా ఇళ్లకే పరిమితం అయిన జనం ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాల్లో కరోనా వ్యాక్సిన్ కూడా టాప్ లో నిలిచింది. ముఖ్యంగా మే నెలలో కరోనా వ్యాక్సిన్ గురించి భారతీయులు గతంతో పోలిస్తే ఎక్కువగా సెర్చ్ చేసినట్లు గూగుల్ తాజాగా ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్, దాని ప్రభావం, ప్రయోజనాలు, పరిశోధనలకు సంబంధించి భారతీయులు గతంలో కంటే 190 శాతం అధికంగా మే నెలలో సెర్చ్ చేసినట్లు తాజాగా తేలింది. వ్యాక్సిన్ కు సంబంధించిన సెర్చ్ ధాటికి కరోనా వైరస్ అన్న పేరు కూడా సెర్చింజన్ ఫలితాల్లో 12వ స్ధానానికి వెళ్లిపోయింది.

Recommended Video

Arvind Kejriwal Takes Coronavirus Test, Reports Expected Tonight
 టాప్ సెర్చ్ లాక్ డౌన్ 4.0

టాప్ సెర్చ్ లాక్ డౌన్ 4.0

మే నెలలో గూగుల్ టాప్ సెర్చ్ విభాగంలో లాక్ డౌన్ 4.0 పదం అగ్రభాగంలో నిలిచింది. గతంతో పోలిస్తే లాక్ డౌన్ 4.0 పదాన్ని మే నెలలో భారతీయులు ఏకంగా 3250 శాతం అధికంగా సెర్చ్ చేశారు. ఆ తర్వాత రంజాన్ సందర్భంగా ఈద్ ముబారక్ పదాన్ని అత్యధికంగా 2650 శాతం ఎక్కువగా సెర్చ్ చేసినట్లు తేలింది. ఢిల్లీలో కరోనా వైరస్ లాక్ డౌన్ జోన్స్ పదాన్ని 1800 శాతం అదికంగా సెర్చ్ చేశారు. ఇటలీ కరోనా వైరస్ వ్యాక్సిన్ ను కూడా 750 శాతం ఎక్కువగా నెటిజన్లు సెర్చ్ చేశారు. కరోనా వైరస్ పదం సెర్చ్ ఏప్రిల్ తో పోలిస్తే మే నెలలో సగానికి తగ్గిపోగా.. క్రికెట్ కంటే ఐదురెట్లు ఎక్కువగా మే నెలలో సెర్చ్ అయినట్లు గూగుల్ తెలిపింది.

English summary
Google revealed that vaccine-related searches reached a new record high and increased by over 190 per cent in India during the month of May
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X