వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెసిపై ట్రావెల్‌బ్యాన్ ఎత్తివేత: ఆ ఇధ్దరే కీలకం?

విమానాయానసంస్థలకు క్షమాపణ చెప్పకున్నా అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డిపై ట్రావెల్‌బ్యాన్‌ను ఎత్తివేశారు.అయితే ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థలతో పాటు ఇతర విమానాయానసంస్థల ప్రతినిధులు టిడిపి ఎంపీ జెసి దివాకర

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి:విమానాయానసంస్థలకు క్షమాపణ చెప్పకున్నా అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డిపై ట్రావెల్‌బ్యాన్‌ను ఎత్తివేశారు.అయితే ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థలతో పాటు ఇతర విమానాయానసంస్థల ప్రతినిధులు టిడిపి ఎంపీ జెసి దివాకర్‌రెడ్డిల మధ్య ఢిల్లీలో జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. కేంద్రమంత్రులు ఆశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరిలు ఈ సమస్యను పరిష్కరించడంలో చొరవచూపారు.

జెసికి షాక్: 'దివాకర్ ట్రావెల్స్‌లో ఇలా జరిగితే అనుమతిస్తారా?'జెసికి షాక్: 'దివాకర్ ట్రావెల్స్‌లో ఇలా జరిగితే అనుమతిస్తారా?'

గత నెల 15వ, తేదిన అనంతపురం ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి విశాఖపట్టణం విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు.అంతేకాదు ప్రింటర్‌ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు.

ఆలస్యంగా వచ్చిన కారణంగానే బోర్డింగ్‌పాస్ ఇచ్చేందుకుగాను ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిరాకరించారు.దీంతో జెసి దివాకర్‌రెడ్డి తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలని ఏపీ సిఎం చంద్రబాబునాయుడు జెసికి సూచించారు.

జెసి దివాకర్‌రెడ్డికి బాబు షాక్: ఆ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిందేజెసి దివాకర్‌రెడ్డికి బాబు షాక్: ఆ వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిందే

ట్రావెల్‌బ్యాన్ కారణంగా విమానయానసంస్థలు ఆయనను విమానంలో ప్రయాణించకుండా అడ్డుకొన్నాయి. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకుగాను జెసి దివాకర్‌రెడ్డి తన స్నేహితుడి విమానంలో ఢిల్లీకి వెళ్ళాడు. ఇందుకోసం ఆయన రూ.7లక్షలను ఖర్చుచేయాల్సి వచ్చింది.

ఆర్థికమంత్రి జైట్లీతో మాట్లాడినా ప్రయోజనం లేదు

ఆర్థికమంత్రి జైట్లీతో మాట్లాడినా ప్రయోజనం లేదు


తనపై విధించిన ట్రావెల్‌బ్యాన్ విషయమై కేంద్రఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీతో చర్చించారు జెసి దివాకర్‌రెడ్డి .అయితే ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానాయానశాఖ మంత్రి ఆశోక్‌గజపతిరాజుతో చర్చించాలని ఆయన సూచించారు. కేంద్రమంత్రి సుజానాచౌదరిని పిలిపించి ఈ సమస్యను పరిష్కారమయ్యేలా అరుణ్‌జైట్లీ సలహ ఇచ్చారు.దీంతో రంగంలోకి దిగిన కేంద్రమంత్రులు సుజనాచౌదరి, ఆశోక్‌గజపతిరాజులు ఈ సమస్యను పరిష్కారమయ్యేలా చూశారు.

క్షమాపణకు పట్టుబట్టిన కేంద్రమంత్రి ఆశోక్‌గజపతిరాజు

క్షమాపణకు పట్టుబట్టిన కేంద్రమంత్రి ఆశోక్‌గజపతిరాజు

శివసేన ఎంపీ రవీంద్రగైక్వాడ్ క్షమాపణ చెప్పడంతో ఈ వివాదం పరిష్కారమైందని, జెసి దివాకర్‌రెడ్డి కూడ క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రి ఆశోక్‌గజపతిరాజు చెప్పారని తెలిసింది. అయితే ఈ విషయంలో కేంద్రమంత్రి సుజనాచౌదరి జోక్యంతో పరిష్కారమైంది.ఇండిగో‌తోపాటు ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థల ప్రతినిధులతో ఎంపీ జెసి దివాకర్‌రెడ్డితో మంత్రి సుజానా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇరువర్గాలు తమ అభిప్రాయాలను చెప్పాయి.ఈ అభిప్రాయాలతో ఇరువర్గాలకు ఇబ్బందిలేకుండా ఉండే నిర్ణయాన్ని తీసుకొన్నారు.

నిమిషం ఆలస్యమైనా పాస్ ఇవ్వొద్దని ఆదేశాలు

నిమిషం ఆలస్యమైనా పాస్ ఇవ్వొద్దని ఆదేశాలు

నిమిషం ఆలస్యమైనా బోర్డింగ్ పాస్‌లు ఇవ్వకూడదని ఆదేశాలున్నాయని ఇండిగో ఆపరేషన్స్ అధిపతి రాందాస్ ఈ సమావేశంలో వివరించారు. అయితే ఎంపీలు, ఇతర విఐపిల విషయంలో ఒకటి, లేదా రెండునిమిషాలపాటు మినహయింపు ఇవ్వాలని తమకు ఆ ఆదేశాలు పాటిస్తామని రాందాస్ ప్రకటించారు. తమకు ఇండిగో యాజమాన్యం నుండి ఈ ఆదేశాలు వస్తే వాటిని పాటిస్తామన్నారు.

జెసి దివాకర్‌రెడ్డికి వాదన ఇలా

జెసి దివాకర్‌రెడ్డికి వాదన ఇలా

బోర్డింగ్ పాస్ ఇవ్వకపోవడంతో తాను పడ్డ ఇబ్బందిని కూడ జెసి దివాకర్‌రెడ్డి కూ వినిపించారు. ఏ రకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో ఆయన చెప్పారు. నెలరోజులపాటు కూడ ఏ రకమైన ఇబ్బందులను ఎదుర్కొన్న విషయాన్ని కూడ జెసి దివాకర్‌రెడ్డి వివరించారు. స్వయంగా విమానాయానశాఖ మంత్రి చొరవ తీసుకోవడంతో ఎంపీ జెసి దివాకర్‌రెడ్డి క్షమాపణ చెప్పకుండానే విమానాయానసంస్థలు శాంతించాయి. అయితే ఆనాడు విశాఖ పట్టణంలో చోటుచేసుకొన్న ఘటనపై కూడ జెసి దివాకర్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. దీంతో విమానాయనసంస్థలు కూడ శాంతించినట్టు సమాచారం. దీంతో ట్రావెల్‌బ్యాన్‌ను ఎత్తివేశారు.

English summary
Private airline IndiGo and publicly owned Air India Wednesday lifted the flying ban on Telugu Desam Party (TDP) MP JC Diwakar Reddy with immediate effect a month after he was banned by most of the domestic airlines from flying due to his alleged unruly behavior.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X