• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బిజెపిలోకి రమ్మంటున్నారు...కరడుగట్టిన తెలుగుదేశం వాదులం...బెదిరేదే లేదు: సీఎం రమేష్‌

|

హైదరాబాద్:కేంద్రం రాజకీయ కక్షతో చేయిస్తున్న ఐటీ దాడులకు బెదిరేదే లేదని టీడీపీ ఎంపి సీఎం రమేష్‌ స్పష్టం చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.

సోదాలకు వచ్చిన ఐటీ అధికారులు బీజేపీతో ఎందుకు పెట్టుకుంటారని అన్నారని, పరోక్షంగా బీజేపీలోకి రమ్మని బెదిరింపులకు పాల్పడుతున్నారని సిఎం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. తాము కరడుగట్టిన తెలుగుదేశం వాదులం.. దాడులకు బెదిరేది లేదని అని సీఎం రమేష్ తేల్చిచెప్పారు. ఐటీ దాడులకు సంబంధించి నేడు మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడిస్తానని సీఎం రమేష్ చెప్పారు.

అందుకే రమ్మన్నారు...వచ్చా

అందుకే రమ్మన్నారు...వచ్చా

తన వేలిముద్రలతో డిజిటల్‌ లాకర్లను తెరిచేందుకు ఐటీ అధికారులు తనను హైదరాబాద్‌ రమ్మన్నారని, అధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తానన్నారు. అధికారులు సహకరిస్తే తన ఇంట్లో జరుగుతున్న సోదాలను వీడియో తీసి మీడియాకు పంపిస్తానన్నారు. ఐటీ అధికారుల నుంచి తనకు ఎలాంటి నోటీసులు అందలేదని తన భార్య పేరిట నోటీసులు వచ్చాయని పేర్కొన్నారు. ఢిల్లీకి డబ్బులు తరలించాననడం అవాస్తవమని, నాలుగేళ్లలో రూ.200 కోట్ల వరకు పన్ను చెల్లించానని సిఎం రమేష్ చెప్పారు.

కొండను తవ్వి...ఎలకను పట్టారు

కొండను తవ్వి...ఎలకను పట్టారు

కేంద్రం భయానక వాతావరణం సృష్టించేందుకే ఐటీ సోదాలు చేస్తోందని, ఏపీ హక్కులను అడిగినందుకే మాపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఎంపీ సిఎం రమేష్ అన్నారు. నా దగ్గర ఎలాంటి అక్రమ ఆస్తులు లేవు...మా వద్ద దొరికింది మూడున్నర లక్షలు మాత్రమేనని...ఐటి ఐధికారుల పని కొండను తవ్వి ఎలుకను పట్టిన చంద్రంగా అయిందన్నారు. ఇదిలా వుంటే ఐటి దాడులపై సిఎం రమేష్, బిజెపి ఎంపి జివిఎల్ ల మధ్య మాటల యుద్దం నడిచింది.

జివిఎల్ కు...సవాలు

జివిఎల్ కు...సవాలు

ఉక్కు ఫ్యాక్టరీ విషయం ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వం లేదా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ప్రకటన చేయాలని, కానీ జీవీఎల్‌ ఏదోదో మాట్లాడుతున్నారని...ఆయనకు ఏ అంశంపైనా అవగాహన లేదని సిఎం రమేష్ విమర్శించారు. అయితే ప్రతి అంశంపైనా మీడియా ముందు చర్చకు తాను సిద్ధమని, చర్చకు రావాలని జివిఎల్ కు సిఎం రమేశ్‌ సవాల్‌ విసిరారు. అబద్ధాలు చెబితే ప్రజలు ఏమనుకుంటారోనన్న భావన లేకుండా ఆంబోతును వదిలేసినట్లుగా ఆయనను ఏపీ పైకి వదిలేశారని సిఎం రమేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

జివిఎల్...ప్రతి సవాల్

జివిఎల్...ప్రతి సవాల్

మరోవైపు సీఎం రమేష్ సవాలును బిజెపి ఎంపి జీవీఎల్‌ స్వీకరించారు. ఆ సవాలుకు తన స్పందనను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు..."రాష్ట్రాన్ని దోచేసిన అచ్చోసిన ఆంబోతులు ఎవరో ప్రజలకు తెలుసు...మీలాగే సవాలు చేసి ఎంపీ సుజనా చౌదరి గతంలో తోకముడిచారు...మీరూ అంతేనా..? మీ ఎంపీలకు పౌరుషం ఎక్కువ.. పర్ఫార్మెన్స్‌ తక్కువ...నేను చర్చకు సిద్ధం...ఎప్పుడైనా ఎక్కడైనా...మీరు సిద్ధమా?"...అంటూ సిఎం రమేష్ నుద్దేశించి పరుష పదాలతో ఘాటు సవాల్ చేశారు.

ప్లేస్,టైమ్ చెబితే...రెడీ అన్న సిఎం రమేష్

ప్లేస్,టైమ్ చెబితే...రెడీ అన్న సిఎం రమేష్

బిజెపి ఎంపి జీవీఎల్‌ నరసింహారావు చేసిన సవాలుకు టిడిపి ఎంపి సిఎం రమేష్ ప్రతిస్పందించారు. తనపై జివిఎల్ చేస్తున్న ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. సమయం, ప్రదేశం చెబితే ఆదివారం ఉదయమే చర్చకు వస్తానని పేర్కొన్నారు. రిత్విక్‌ కంపెనీలో సోదాలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని సిఎం రమేష్ తేల్చేశారు.

English summary
TDP MP Mr. Ramesh termed the raids on his premises “political vendetta” against his party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X