వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోజు రోజుకీ ఉబ్బిపోతున్న పసివాడి పొట్ట! చివరికి ఏమవుతుందో?

ఆ పసివాడి వయసు ఆరు నెలలు. అయితే మూడో నెల నుంచే అతడి పొట్ట పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం పొట్ట పరిమాణం 28 సెంటీమీటర్లకు చేరుకుంది. అలా ఎందుకు జరుగుతోందో తెలియక అతడి తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆ పసివాడి వయసు ఆరు నెలలు. అంత చిన్న వయసులోనే మాయదారి వ్యాధి ఒకటి పట్టి పీడిస్తోంది. అత‌డి పొట్ట రోజురోజుకి పెరిగిపోతోంది. దీంతో ఆ బాలుడి త‌ల్లిదండ్రులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

విశాఖప‌ట్నం జిల్లా పాడేరులోని మారుమూల గ్రామమైన కుంకంపూడికి చెందిన గెమ్మెలి బాలరాజు, లక్ష్మి దంపతులకు ఆరు నెలల కిందట మగబిడ్డ జ‌న్మించాడు. అయితే మూడు నెల‌లుగా ఆ బాలుడి పొట్ట ఉబ్బిపోతూ వ‌స్తోంది. ప్రస్తుతం ఈ పసివాడి పొట్ట 28 సెంటీమీటర్లకు పెరిగిపోయింది.

ఆ బాలుడు పాలు తాగినా, తాగకపోయినా ఇదే ప‌రిస్థితి. అసలే కడు పేదరికంతో ఇల్లు గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా ఉంటే, ఈ మాయదారి రోగమొకటి. ప్రస్తుతం త‌మ బిడ్డ‌కు వైద్యం చేయించే స్తోమత కూడా లేక ఆ దంపతులు తల్లడిల్లిపోతున్నారు.

Infant's Stomach increasing Day by Day! What will happen in another couple of months?

ఇటీవల తమ కుమారుడిని చింతపల్లి పీహెచ్‌సీకి తీసుకెళ్లామని, అక్కడి నుంచి నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తమ బాబును తరలించారని,ఆపరేషన్‌ చేయాలని డాక్టర్లు చెప్పారని ఆ పసివాడి తల్లదండ్రులు బాలరాజు, లక్ష్మి తెలిపారు.

అయితే, నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో రెండు రోజులపాటు చిన్నారిని ఉంచి, ఆ తరువాత వైద్య సిబ్బంది పట్టించుకోలేదని, దీంతో ఏ చేయాలో అర్థం కాక తమ బాబుని ఇంటికి తీసుకొచ్చేసుకున్నామని వారు వాపోయారు.

English summary
Visakhapatnam: An infant, at the age of 6 months suffering with a rare decease. The child's stomach is increasing day by day. Whether he drinks milk or not, the stomach still increasing. His parents who belongs to Kumkampudi, Paderu, Visakhapatnam District taken him to Chintapalli PHC and from there to Narsipatnam Area Hospital. But no one gave them relief from this problem. Now the child's stomach size is 28 centimetres. What will happen in another one or two months.. God knows.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X