వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జల ప్రవేశం చేసిన 'ఐఎన్ఎస్ కద్మత్': పేరేలా వచ్చిందంటే? (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: భవిష్యత్తులో యుద్ధ నౌకలన్నింటినీ నూరు శాతం స్వదేశీ పరిజ్ఞానంతోనే నిర్మిస్తామని భారత నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ ఆర్‌కె ధావన్ వెల్లడించారు. గురువారం విశాఖ నావల్ డాక్‌యార్డ్‌లో జలాంతర్గామి విధ్యంసక నౌక 'ఐఎన్ఎస్ కద్మత్' ను ఆయన తూర్పు నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ షిప్‌యార్డులో యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కద్మత్‌ తయారైందన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా 90 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రెండో యుద్ధ నౌక కద్మత్ అని వెల్లడించారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ నౌక భారత నౌకాదళానికి ఎనలేని సేవలు అందిస్తున్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కద్మత్ అంటే లక్షద్వీప్‌లోని ఒక దీవి పేరు అని ఆయన చెప్పారు. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ నుంచి 1961లో తొలి యుద్ధ నౌక బయటకు వచ్చిందన్నారు.

జల ప్రవేశం చేసిన 'ఐఎన్ఎస్ కద్మత్': పేరేలా వచ్చిందంటే?

జల ప్రవేశం చేసిన 'ఐఎన్ఎస్ కద్మత్': పేరేలా వచ్చిందంటే?

అప్పటి నుంచి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ నౌకాదళానికి కావల్సిన అనేక యుద్ధ నౌకలను, నిఘా నౌకలను అందిస్తూ వస్తోందన్నారు. సంవత్సరాల తరబడి యుద్ధ నౌకల తయారీకి శ్రమిస్తున్న కార్మికులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు.

 జల ప్రవేశం చేసిన 'ఐఎన్ఎస్ కద్మత్': పేరేలా వచ్చిందంటే?

జల ప్రవేశం చేసిన 'ఐఎన్ఎస్ కద్మత్': పేరేలా వచ్చిందంటే?

యుద్ధ నౌకల తయారీలో నౌకాదళ షిప్ డిజైన్ సెంటర్, డిఆర్‌డిఓ ఎంతగానో సహకరిస్తుందన్నారు. డిఆర్‌డిఓ సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు 15 ఏళ్ళకు రోడ్ మ్యాప్ తయారు చేస్తున్నామని ఆయన చెప్పారు.

జల ప్రవేశం చేసిన 'ఐఎన్ఎస్ కద్మత్': పేరేలా వచ్చిందంటే?

జల ప్రవేశం చేసిన 'ఐఎన్ఎస్ కద్మత్': పేరేలా వచ్చిందంటే?

స్వదేశీ పరిజ్ఞానంలో స్వయం సమృద్ధి సాధించామని చెప్పడానికి డిఆర్‌డిఓ, షిప్ డిజైన్ సెంటర్‌లు అందించిన ఐఎన్‌ఎస్ కడ్మత్ నిలువెత్తు నిదర్శనమని ఆయన అన్నారు. యుద్ధ నౌకల తయారీలో మరింత స్వయం సమృద్ధి సాధించేందుకు బ్లూప్రింట్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
జల ప్రవేశం చేసిన 'ఐఎన్ఎస్ కద్మత్': పేరేలా వచ్చిందంటే?

జల ప్రవేశం చేసిన 'ఐఎన్ఎస్ కద్మత్': పేరేలా వచ్చిందంటే?

ఇప్పటికే భారత దేశంలోని వివిధ షిప్‌యార్డుల్లో 46 యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లు తయారవుతున్నాయని ధావన్ తెలియచేశారు. వీటిని చాలా వరకూ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతోనే తయారు చేస్తున్నామన్నారు.

 జల ప్రవేశం చేసిన 'ఐఎన్ఎస్ కద్మత్': పేరేలా వచ్చిందంటే?

జల ప్రవేశం చేసిన 'ఐఎన్ఎస్ కద్మత్': పేరేలా వచ్చిందంటే?

వచ్చేనెలలో విశాఖలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనే కొత్త నౌకల్లో ఇది ఒకటని చెప్పారు. భారత నౌకాదళంలో తూర్పు నౌకాదళ భుజస్కందాలపై ఎక్కువ బాధ్యతలు ఉన్నాయని చెప్పారు.

జల ప్రవేశం చేసిన 'ఐఎన్ఎస్ కద్మత్': పేరేలా వచ్చిందంటే?

జల ప్రవేశం చేసిన 'ఐఎన్ఎస్ కద్మత్': పేరేలా వచ్చిందంటే?

తూర్పు తీరాన్ని దాటి మలాక్కాడ్ స్టేట్స్‌కు సంవత్సరానికి 70 వేల వాణిజ్య నౌకలు ప్రయాణిస్తున్నాయని, వాటి రక్షణ బాధ్యత కూడా తూర్పు నౌకాదళంపై ఉందన్నారు.

 జల ప్రవేశం చేసిన 'ఐఎన్ఎస్ కద్మత్': పేరేలా వచ్చిందంటే?

జల ప్రవేశం చేసిన 'ఐఎన్ఎస్ కద్మత్': పేరేలా వచ్చిందంటే?

భవిష్యత్‌లో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనేందుకు తూర్పు నౌకాదళం సిద్ధంగా ఉండాలన్నారు. నౌకాదళం సమర్థవంతంగా పనిచేయడం వలనే ప్రజలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని ఆయన అన్నారు.

 జల ప్రవేశం చేసిన 'ఐఎన్ఎస్ కద్మత్': పేరేలా వచ్చిందంటే?

జల ప్రవేశం చేసిన 'ఐఎన్ఎస్ కద్మత్': పేరేలా వచ్చిందంటే?

వచ్చే నెలలో విశాఖలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్)లో 52 దేశాలు పాల్గొంటున్నాయని చెప్పారు. ఇందులో 24 దేశాల నుంచి యుద్ధ నౌకలు వస్తున్నాయని, 34 దేశాల నౌకాదళాధిపతులు పాల్గొంటున్నారని ఆయన వివరించారు. ఈ ఫ్లీట్ రివ్యూలో పాకిస్తాన్ పాల్గొనడం లేదని ఆయన చెప్పారు.

English summary
Chief of Naval Staff Admiral RK Dhowan today said the Indian Navy will in future build all types of ships including those designed for warfare indigenously in line with Prime Minister Narendra Modi's "Make in India" initiative.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X