వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ వచ్చే వారికి గుడ్ న్యూస్- ఈ-పాస్ జారీలో సర్కార్ మార్పులు..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావం మొదలయ్యాక వివిధ రాష్ట్రాల మధ్య ప్రయాణాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆ తర్వాత అన్ లాక్ ప్రారంభమయ్యాక ఈ ఆంక్షలను కేంద్రం తొలగించింది. అయితే ఏపీ మాత్రం ఆంక్షలను ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఏపీలోకి వచ్చే వారికి ఈ-పాస్ తప్పనిసరి చేసింది.

ఈ-పాస్ లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులను ఇప్పటికీ అనుమతించడం లేదు. కానీ తాజాగా ఈ-పాస్ రూల్స్ లో ప్రభుత్వం మార్పులు చేసింది. రేపటి నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి.

inter state passenger movement is further liberalised in ap with automatic e-pass approval

ఇప్పటివరకూ ఈ-పాస్ పొందాలంటే ఏపీ ప్రభుత్వ స్పందన పోర్టల్ లో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. ఇందులో ఏపీకి రావడానికి సరైన కారణాలు ఉంటేనే పరిశీలించి అనుమతి మంజూరు చేస్తున్నారు. లేకపోతే తిరస్కరిస్తున్నారు కూడా.

Recommended Video

Breaking: AP's 3 Capitals Bill Approved By Governor న్యాయస్ధానాలు ఎలా స్పందిస్తాయన్న దానిపై ఉత్కంఠ ?

తాజాగా అధికారుల జోక్యం లేకుండా నేరుగా దరఖాస్తు చేసుకున్న వారికి ఆటోమేటిగ్గా అనుమతి మంజూరు చేసేలా ఆంక్షలు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే దరఖాస్తు చేసుకున్న వారు కోరిన వివరాలు అందిస్తే చాలు వాటిని మరోసారి పరిశీలించకుండా నేరుగా సిస్టమ్ జనరేటెడ్ మెసేజ్ ద్వారా 24 గంటల్లో ఈ-పాస్ జారీ అయిపోతుంది.

English summary
andhra pradesh government decided to ease e-pass rules for the passengers enters into the state from tomorrow. as per the new rules e-pass will be generated automatically.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X