వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త ఫ్రెండ్‌షిప్!: అదే అసలు పాయింట్.. చంద్రబాబు-రాహుల్ గాంధీ కలుస్తారా?

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త స్నేహం చిగురిస్తోందా? నిన్నటి దాకా వైరి పార్టీలుగా ఉన్నవారు ఒక్కటవుతున్నారా? అందులో నిజం ఎంతుందో లేదో కానీ పార్టీలు పరస్పరం ఆసక్తికర విమర్శలు చేసుకుంటున్నాయి. జనసేన, వైసీపీ ఒక్కటేనని, వారిద్దరు బీజేపీకి తొత్తులు అని టీడీపీ విమర్శిస్తోంది.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఆ పార్టీకి దగ్గరవుతోందని, ఇందుకు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆత్మ ఘోషిస్తోందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటవుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.

 ఆసక్తికర చర్చ

ఆసక్తికర చర్చ

జనసేన ఓ వైపు లెఫ్ట్ పార్టీలతో ముందుకు వెళ్తుంటే టీడీపీ మాత్రం పవన్ కళ్యాణ్ వెనుక బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని చెబుతున్నారు. వైసీపీ చంద్రబాబుతో పాటు మోడీని నిలదీస్తుంటే కేసుల మాఫీ కోసం జగన్ కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని అంటున్నారు. మరోవైపు, కాంగ్రెస్‌తో టీడీపీ దోస్తీ ప్రచారాన్ని టీడీపీ కొట్టి పారేస్తోంది. ఎవరికి వారు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నప్పటికీ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇది ఆసక్తికర చర్చగా మారింది.

అక్కడే అడుగు పడిందా?

అక్కడే అడుగు పడిందా?

తెలంగాణలో ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ క్యాడర్ మాత్రమం బాగానే ఉంది. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ ఆసక్తిని చూపిస్తున్నాయి. తెలంగాణ టీడీపీలోని నేతలు కొందరు టీఆర్ఎస్ వైపు, మరికొందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి, సీతక్క వంటి కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు, చేరిన తర్వాత కూడా రేవంత్ వ్యాఖ్యలు చంద్రబాబుకు అనుకూలంగానే ఉన్నాయి. తాజాగా, కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దని నిబంధన లేదన్నారు. అంటే తెలంగాణలో టీడీపీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ లేదా టీఆర్ఎస్‌లలో ఎవరితో పొత్తు పెట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

 కాంగ్రెస్ - టీడీపీ ఒక్కటవుతాయా?

కాంగ్రెస్ - టీడీపీ ఒక్కటవుతాయా?

మూడు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ - టీడీపీలు వైరి పక్షాలుగా ఉన్నాయి. ఇన్నాళ్ల టీడీపీ చరిత్రలో తొలిసారి కాంగ్రెస్‌తో పొత్తు అంశం చర్చకు రావడం గమనార్హం. తెలంగాణ ప్రభావం ఏపీలోను కనిపించకుండా ఉండకపోదని, టీడీపీ ఒంటరిగా పోటీ చేసినా ఆ తర్వాత హోదా కోసం కేంద్రంలో ఎవరికో ఒకరికి మద్దతివ్వాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రత్యేక హోదాపై బీజేపీ తేల్చేయడంతో పాటు 2019లో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధిస్తే ఒక్కటవుతారా అనే ఆసక్తికర చర్చ సాగుతోంది.

 అది సోనియా-చంద్రబాబులను కలుపుతుందా?

అది సోనియా-చంద్రబాబులను కలుపుతుందా?

కాంగ్రెస్ - టీడీపీలు ఒక్కటవుతున్నాయని బీజేపీ నేతలు విమర్శించడంతో పాటు ఆ పార్టీల వ్యాఖ్యలు కూడా ఈ చర్చకు తావిస్తోంది. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని బీజేపీ తేల్చేసింది. 2019లో మళ్లీ మోడీ అధికారంలోకి వచ్చినా కేంద్రంపై కలిసి పోరాడేందుకు కాంగ్రెస్‌తో కలిసి వెళ్లే అవకాశాలు కొట్టి పారేయలేం. అలా కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా హోదా కోసం మద్దతిచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఈ కారణాలు పార్టీలను కలపవచ్చునని అంటున్నారు.

 దోస్తీ.. బీజేపీని అడ్డుకుంటున్నారని ఆగ్రహం

దోస్తీ.. బీజేపీని అడ్డుకుంటున్నారని ఆగ్రహం

పార్లమెంటు సమావేశాల సమయంలో కాంగ్రెస్ పార్టీతో కలిపి టీడీపీ సభను అడ్డుకుందని, కాంగ్రెస్ నేతలను టీడీపీ నేతలు కలిశారని బీజేపీ నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. టీడీపీ ఎంపీలు సోనియాను కలిసిన విషయం తెలిసిందే. గురువారం బీజేపీ నేతలు కాంగ్రెస్ తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరాహార దీక్ష చేశారు. ఏపీలో పలుచోట్ల బీజేపీ చేసిన దీక్షలను లెఫ్ట్ పార్టీల సహకారంతో టీడీపీ అడ్డుకుంటోందని బీజేపీ నేతలు ఆరోపించారు. తద్వారా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దీక్ష చేస్తుంటే టీడీపీ లెఫ్ట్ పార్టీ సహకారంతో తమను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

 అఖిల పక్షానికి కాంగ్రెస్ హాజరు

అఖిల పక్షానికి కాంగ్రెస్ హాజరు

బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌తో కలిసి పార్లమెంటులో అడ్డుకున్న టీడీపీ ఇప్పుడు ఏపీలో తాము దీక్ష చేయాలనుకున్న చోట సీపీఐ నిరసనలకు అనుమతి ఇచ్చిందని, తద్వారా తమ దీక్షను అడ్డుకోవాలని చూసిందని ఆరోపించారు. అంతేకాదు, చంద్రబాబు తొలి అఖిల పక్ష సమావేశానికి కాంగ్రెస్ హాజరైంది. లెఫ్ట్ పార్టీలు హాజరు కావడం వేరు. వైసీపీ, జనసేన, బీజేపీలు హాజరుకాకుండా కాంగ్రెస్ హాజరు కావడం వేరు అని అంటున్నారు.

 ఇదీ అసలు పాయింట్! తెలంగాణ టు ఏపీ

ఇదీ అసలు పాయింట్! తెలంగాణ టు ఏపీ

అన్నింటికంటే ముఖ్యంగా తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తమకు హోదాపై ఎవరు హామీ ఇస్తే వారికే మద్దతు అని టీడీపీ నేతలు చెప్పారు. టీడీపీ - కాంగ్రెస్ కలుస్తుందనే చర్చకు ఇది కూడా కారణమయిందని అంటున్నారు. చంద్రబాబుతో మంచి సంబంధాలు ఉన్న రేవంత్ కాంగ్రెస్‌లో చేరడం మొదలు.. ప్రత్యేక హోదా వరకు అంశాలను పరిశీలిస్తే ఆ రెండు పార్టీలు కలిసే అవకాశాలు కొట్టి పారేయలేమని కొందరు అంటున్నారు. మరోవైపు, వైసీపీ, జనసేన పార్టీలు కూడా కలుస్తాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.

 టీడీసీగా మార్చుకోవాలి

టీడీసీగా మార్చుకోవాలి

గురువారం ధర్నా సందర్భంగా జీవీఎల్ నర్సింహా రావు టీడీపీపై నిప్పులు చెరిగారు. టీడీపీ కాంగ్రెస్ పార్టీకి స్టెఫ్నీగా మారిందని మండిపడ్డారు. టీడీపీ పేరును టీడీసీగా (తెలుగుదేశం కాంగ్రెస్) మార్చాలన్నారు. దేశం ఛీకొట్టిన రాహుల్ గాంధీ పక్కన టీడీపీ చేరిందన్నారు. ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందన్నారు. రాష్ట్రంలో చాలా కాంగ్రెస్ పార్టీలు తయారయ్యాయని ధ్వజమెత్తారు.

English summary
BJP leaders alleged that Telugudesam Party is colluded with Congress Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X