విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మా మధ్య విభేదాల వల్లే పార్టీ మారలేదు: దేవినేని నెహ్రు అనుచరుడు గాంధీ

1979 లోనే విధ్యార్థి దశ నుండే స్టూడెంట్ యూనియన్ ను ఏర్పాటు చేశామని, దేవినేని నెహ్రుతో కలిసి తాను కూడ యూనియన్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించానని ఆయన అనుచరుడు గాంధీ చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: 1979 లోనే విధ్యార్థి దశ నుండే స్టూడెంట్ యూనియన్ ను ఏర్పాటు చేశామని, దేవినేని నెహ్రుతో కలిసి తాను కూడ యూనియన్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించానని ఆయన అనుచరుడు గాంధీ చెప్పారు.

దేవినేని నెహ్రు ఆకస్మాత్తుగా మరణిచండంతో ఆయన అనుచరుడుగా ఉన్న గాంధీ విజయవాడలోని ఆయన నివాసం వద్ద నెహ్రుతో ఉన్న అనుబంధాలను నెమరువేసుకొన్నారు.

1978 లో దేవినేని గాంధీ, నెహ్రు, బాజీ, మురళి అందరం కలిసి తిరిగేవాళ్ళమని ఆయన చెప్పారు. 1979 లో వందమందితో కలిసి స్టూడెంట్ యూనియన్ ను ఏర్పాటు చేసినట్టుగా గాంధీ చెప్పారు. అయితే యూనియన్ వ్యవహరాల్లో చాలా బిజీగా ఉండేవారమని ఆయన గుర్తు చేసుకొన్నారు.

Interesting comments on Devineni Nehru:Gandhi

అయితే ఎన్టీఆర్ టిడిపిని ఏర్పాటు చేసిన తర్వాత తామంతా టిడిపిలో చేరినట్టు చెప్పారు. టిడిపిని కృష్ణా జిల్లాలో బలోపేతం చేసేందుకు కృషిచేసినట్టు చెప్పారు. అప్పట్లో కృష్ణా జిల్లాకు చెందిన కొందరు నాయకులను టిడిపిలో చేర్పించామని గాంధీ గుర్తు చేశారు.

అయితే 1995 లో తమ మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చాయని ఆయన చెప్పారు. అప్పట్లో నెహ్రు టిడిపిని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడన్నారు. అయితే తామంతా టిడిపిలోనే ఉన్నామని ఆయన గుర్తు చేశారు.

కొద్దిరోజుల ముందు ఆయన టిడిపిలో చేరడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు గాంధీ.ఇక అందరం కలిశామని అనుకొంటున్న సమయంలోనే ఈ దురదృష్టకరమైన ఘటన జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేస్తోందన్నారు. మేమంతా నాటి నుండి నేటి వరకు అన్నదమ్ముల్లాగానే ఉన్నామని గాంధీ చెప్పారు. ఎవరు ఏ పార్టీలో ఉన్నా మర్యాదపూర్వకంగానే పలకరించుకొనేవాళ్ళమని గాంధీ చెప్పారు.
ఆయన మంచి కోరుకొనే వారిలో తమ్ముడిగా పనిచేశానని చెప్పారు. ఆయన తమ్ముడు అనేవారు. తాను అన్నయ్య అంటూ పిలిచేవాడినని గాంధీ గుర్తు చేశారు.

English summary
In 1978 we were formed a union said Devineni Nehru follower Gandhi.He shared interesting incident about Nehru with media on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X