వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలోనే సీనియ‌ర్ ఏం చేస్తున్నారు..!! ప్ర‌ధాని..సీఎం స‌మావేశంలో ఆస‌క్తి క‌ర చ‌ర్చ‌: జ‌గ‌న్

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌ధాని మోదీతో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్ల‌మెంట్‌లోని ప్ర‌ధాని కార్యాల‌యంలో జ‌రిగిన ఈ స‌మావేశంలో ఎంపీలు..అధికారుల‌తో స‌మీక్ష ముగిసిన అనంత‌రం ప్ర‌ధాని..ముఖ్య‌మంత్రి ఇద్ద‌రూ దాదాపు అర‌గంట సేపు ఏకాంతంగా చ‌ర్చ‌లు చేసారు.ఆ స‌మ‌యంలో ఏపీలోని ప‌రిస్థితుల‌తో పాటుగా రాజ‌కీయంగా అంశాల‌ను ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌స్తావించిన‌ట్లు స‌మాచారం. గ‌త అయిదేళ్ల కాలంలో చంద్రబాబు హయాంలో తాము గుర్తించిన అవినీతి గురించి సీఎం జ‌గ‌న్ వివ‌రించిన‌ట్లుగా తెలుస్తోంది.ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాని దేశంలోనే సీనియ‌ర్ ఏం చేస్తున్నారు..అంటూ చిన్న గా న‌వ్వుతూ ప్ర‌శ్నించారు. జ‌గ‌న్ సైతం అదే త‌ర‌హాలో స‌మాధానం ఇచ్చారు. ఇంత‌కీ ఆ సంభాష‌ణ ఎవ‌రి గురించి.. ఏం జ‌రిగింది..

ఆ సీనియ‌ర్ ఏం చేస్తున్నారు...

ఆ సీనియ‌ర్ ఏం చేస్తున్నారు...

ఎన్డీఏ నుండి టీడీపీ బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత టీడీపీ అధినేత చంద్రబాబు ప్ర‌ధాని మోదీ ల‌క్ష్యంగా అనేక ఆరోప‌ణ‌లు చేసారు. అవి ఒక ద‌శ‌లో హ‌ద్దులు దాటి వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల వ‌ర‌కు వెళ్లాయి. ప్ర‌తీ సంద‌ర్భంలోనూ మోదీ త‌న‌కంటే జూని య‌ర్ అంటూ..అవ‌కాశం వ‌చ్చి ప్ర‌ధాని అయ్యార‌ని వ్యాఖ్యానించారు. మోదీ కంటే తానే ముందే ముఖ్య‌మంత్రిని అయ్యా న‌ని ప‌లు మార్లు చెప్పారు. యునైటెడ్ ఫ్రంట్ స‌మ‌యంలోనే త‌కన‌కు ప్ర‌ధాని అయ్యే అవ‌కాశం వ‌చ్చింద‌ని అయినా తాను ఏపీ కోసం తిర‌స్క‌రించాన‌ని చంద్రబాబు చెప్పేవారు. దేశంలోని సీనియ‌ర్ మోస్ట్ పొలిటీషియ‌న్ అని చెబుతూ త‌న 40 ఏళ్ల అనుభ‌వం గురించి ప‌దే ప‌దే గుర్తు చేసేవారు. ఇప్పుడు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ప్ర‌ధానితో స‌మావేశ‌మైన స‌మ యంలో దీని ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. చంద్ర‌బాబు హయాంలో అవినీతి జిరిగిందంటూ సీఎం జ‌గ‌న్ ప్ర‌ధానిని అంశాల వారీగా వివ‌రించారు. ఆ స‌మ‌యంలో ఆ మోస్ట్ సీనియ‌ర్ పొలిటిషియ‌న్ ఏం చేస్తున్నారు అంటూ ఒకింత న‌వ్వుతో చంద్రబాబు పేరెత్త‌కుండానే జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు. దీనికి జ‌గ‌న్ సైతం న‌వ్వుతూనే ఇంకా తానే ముఖ్య‌మంత్రిగా భావిస్తున్నారంటూ స‌మాధానం ఇచ్చిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

<strong>వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు: డాక్టర్‌పై పోలీసుల దాడి..ఇదేనా రాజన్న రాజ్యం? </strong>వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు: డాక్టర్‌పై పోలీసుల దాడి..ఇదేనా రాజన్న రాజ్యం?

అవినీతి ఇలా జ‌రిగిదంటూ..

అవినీతి ఇలా జ‌రిగిదంటూ..

తాను కొద్ది రోజుల క్రితం పీపీఏల విష‌యంలో.. పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల విష‌యంలో తీసుకున్న నిర్ణ‌యాల పైన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. పీపీఏల ఒప్పందాల్లో ఏడాదికి అవ‌స‌రం లేక‌పోయినా దాదాపు 2200 కోట్ల మేర అద‌న‌పు చెల్లింపులు జ‌రిగాయంటూ ప్ర‌ధాని దృష్టికి జ‌గ‌న్ తీసుకొచ్చారు. అదే విధంగా పోల‌వ‌రం ప్రాజెక్టుకు సంబంధించి గ‌త అయిదేళ్ల కాలంలో రెండు వేల కోట్ల‌కు పైగా అవినీతి జ‌రిగింద‌ని తాము నియ‌మించిన నిపుణుల కమిటీ ఇచ్చిన తాత్కాల‌కి నివేదిక‌ను సైతం ప్ర‌ధానికి సీఎం అందిచిన‌ట్లు తెలిసింది. రాజ‌ధాని విష‌యంలో పూర్తిగా ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని..త‌న అనుయాయుల‌కే భూములు అతి త‌క్కువ ధ‌ర‌కే ద‌క్కేలా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించారంటూ మ‌రోసారి జ‌గ‌న్ పూర్తి స‌మాచారంతో ప్ర‌ధానికి వివ‌రించార‌ని చెబుతున్నారు. అయితే, ప్ర‌ధాని సైతం అవినీతి జ‌రిగితే చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని వ్యాఖ్యానించిన‌ట్లు స‌మాచారం. అదే స‌మ‌యంలో ఏపీకి కేంద్రం నుండి ఆశిస్తున్న సాయం గురించి జ‌గ‌న్ పూర్తి నివేదిక‌ను స‌మ‌ర్పించారు.

ప్ర‌ధానికి సీఎం త‌న‌పై ఫిర్యాదు చేసార‌న్న చంద్ర‌బాబు..

ప్ర‌ధానికి సీఎం త‌న‌పై ఫిర్యాదు చేసార‌న్న చంద్ర‌బాబు..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు సైతం ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ నేరుగా ప్ర‌ధానికి త‌న మీద ఫిర్యాదులు చేసిన అంశాన్ని ధృవీక‌రించారు. ఏ ముఖ్య‌మంత్రి అయినా ప్ర‌ధానితో స‌మావేశ‌మైతే రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం మాట్లాడుతార‌ని..అదే విధంగా నిధుల గురించి చ‌ర్చిస్తార‌ని..అయితే జ‌గ‌న్ మాత్రం త‌న మీద ఫిర్యాదుల‌కే స‌మ‌యం వెచ్చించార‌ని టీడీపీ అధినేత పేర్కొన్నారు. ప‌రోక్షంగా త‌న మీద జ‌గ‌న్ నేరుగా ప్ర‌ధానికి ఫిర్యాదు చేసార‌నే అంశాన్ని ధృవీక‌రించారు. ఇక‌, తాను జ‌గ‌న్ లాగా అడ్డంగా దొర‌క‌న‌ని..తన‌కు అవినీతి చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పుకొచ్చారు. నిజాయితీగా ఏపీ అభివృద్ది కోసం ప‌ని చేసినా..ఓట‌ర్లు ఎందుకు తిర‌స్క‌రించారో అర్దం కావ‌టం లేద‌ని వ్యాఖ్యానించారు. ఇక వైపు టీడీపీ నేత‌ల వ్యాఖ్య‌లు..ఈ మ‌ధ్య కాలంలో అన్ని బిల్లులకు మ‌ద్ద‌తు ఇస్తున్న విష‌యం ప‌రిశీలిస్తే బీజేపీకి ద‌గ్గ‌ర‌య్యేందుకు టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంద‌నే అభిప్రాయం క‌లుగుతోంది.

English summary
Interesting debate taken place in Pm Modi and AP Cm jagan meeting on Chandra babu seniority. As per sources PM Asked about what the most senior doing to Jagan. CM Jagan also reacted in that way only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X