వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రి కొడాలి నాని వ‌ర్సెస్ అచ్చెన్నాయుడు: స‌ంగ‌తి తేలుస్తా: ఇచ్చి తీరుతాం..నువ్వేమీ తేల్చ‌లేవు..!

|
Google Oneindia TeluguNews

ఏపీ శాస‌న‌స‌భా స‌మావేశాల తొలి రోజు రెండు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలాయి. స‌భ‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో సంబంధాలు..కాళేశ్వ‌రం ప్రాజెక్టు గురంచి వివ‌ర‌ణ ఇచ్చారు. ఆ స‌మ‌యం లో ప్రతిప‌క్ష నేత చంద్ర‌బాబు ల‌క్ష్యంగా కొన్ని కామెంట్లు చేసారు. దీనికి చంద్ర‌బాబు సైతం స్పందించారు. ఇక ద‌శ‌లో త‌న అనుభ‌వం అంత వ‌య‌సు ముఖ్య‌మంత్రికి లేదంటూ చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. స‌భ‌లో ఇలా ఉంటే..ఇక అసెంబ్లీ లాబీల్లోనూ ఆస‌క్త‌క‌ర చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. మంత్రి కొడాలి నాని.. టీడీపీ నేత అచ్చెన్నాయుడు మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ లాబీల్లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

Recommended Video

పోతూ పోతూ అప్పుల కుమ్మరించి పోయారు - బుగ్గన
కొడాలి నాని వ‌ర్సెస్ అచ్చెన్నాయుడు...

కొడాలి నాని వ‌ర్సెస్ అచ్చెన్నాయుడు...

అసెంబీలో జీఓ అవ‌ర్ కొన‌సాగుతున్న స‌మ‌యంలో లాబీల్లో మంత్రి కొడాలి నాని..టీడీపీ ఎల్పీ ఉప‌నేత అచ్చెన్నా యుడు ఒక‌రికి ఒక‌రు ఎదురు ప‌డి ప‌ల‌క‌రించుకున్నారు. ఆ స‌మ‌యంలో అచ్చెన్నాయుడు ఏంటి నాని..న‌ల్ల‌బ‌డ్డావ్ అంటూ ప‌ల‌క‌రించారు. దీనికి కొడాలి నాని త‌న దైన శైలిలో స్పందించారు. అచ్చెన్నాయుడు స‌ర‌దాగా ప్ర‌శ్నించినా.. ఎప్పుడూ గంభీరంగా ఉండే కొడాలి నాని మాత్రం సీరియ‌స్‌గానే స‌మాధానం ఇచ్చారు. తాము జ‌నంలో తిరుగుతున్నా మ‌ని..మీలా విశ్రాంతి తీసుస‌కోవ‌టం లేదంటూ స‌మాధానం ఇచ్చారు. దీంతో..ఒక్క సారిగా అచ్చెన్న సైతం గ‌ట్టిగానే మాట్లాడారు. రేష‌న్‌లో స‌న్న‌బియ్యం ఇస్తామంటున్నారు..ఆ సంగ‌తి తేలుస్తా అంటూ వ్యాఖ్యానించారు. దీనికి నాని సైతం బ‌దులిచ్చారు. నువ్వేమీ తేల్చలేవు..స‌న్ని బియ్యం ఇచ్చి తీరుతాం అంటూనే అస‌వ‌ర‌మైతే నీకు ఒక బ‌స్తా స‌న్న బియ్యం పంపుతాను అంటూ స‌మాధానం ఇచ్చారు. దీంతో ఇద్ద‌రూ ఎవ‌రి దారిన వారు వెళ్లిపోయారు. ఇది ద‌గ్గ‌ర ఉండి చూసిన వారు మాత్రం ఇది సీరియ‌స్‌గా జ‌ర‌గిందా..ఇద్ద‌రూ స‌ర‌దాగా మాట్లాడుకున్నారా అనే దాని పైన లాబీల్లో ఉన్న ఇత‌ర నేత‌లు చ‌ర్చించుకున్నారు.

సోము వీర్రాజు..బుద్దా వెంక‌న్న ఇలా..

సోము వీర్రాజు..బుద్దా వెంక‌న్న ఇలా..

అసెంబ్లీ లాబీల్లో శాస‌న‌మండ‌లి ప్రారంభానికి ముందు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంక‌న్న ఎదురు ప‌డ్డారు. ఇద్ద‌రూ ప‌ల‌క‌రించుకున్నారు. ఇక‌..టీడీపీ మీద విమ‌ర్శ‌లు అపేయండి..వైసీపీ మీద మీ ఆరోప‌ణ‌లు మొద‌లు పెట్టండి అని సూచించారు. దీనికి సోము వీర్రాజు స్పందిస్తూ టీడీపీ మీద ఇంకా పూర్తి కాలేద‌ని స‌మాధానం ఇచ్చారు. వైసీపీని వ‌దిలేది లేద‌ని..మ‌రి కొంత స‌మ‌యం ఉంద‌ని వ్యాఖ్యానించారు. ఆ త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల పైన చ‌ర్చించుకున్నారు. శాస‌న‌స‌భ‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌..ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు మ‌ధ్య కాళేశ్వ‌రం ప్రాజెక్టు గురించి జ‌రిగి మాట‌ల యుద్దం పైన ఎమ్మెల్సీలు సైతం ఆస‌క్తి చూపించారు. ఎవ‌రు ఏం మాట్లాడారు.. ఎలా తిప్పికొట్టార‌నే అంశం మీద అక్క‌డ ఉన్న ఎమ్మెల్యేల‌ను అడిగి తెలుసుకోవ‌టానికి ప్ర‌య‌త్నించారు.

ప్ర‌భుత్వం మీద ఇక యుద్ద‌మే...

ఏపీలో కొత్త‌గా అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వానికి తొలుత ఆరు నెల‌ల వ‌ర‌కు స‌మ‌యం ఇద్దామ‌ని భావించామ‌ని అయితే, ప్ర‌భుత్వం త‌మ మీదే బుర‌ద జ‌ల్లే ప్ర‌య‌త్నం చేస్తుండంతో ఇక ఉపేక్షించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించామ‌ని టీడీపీ ఎమ్మెల్యేలు చిట్ చాట్‌లో చెబుతున్నారు. ఈ 14 రోజులు స‌మావేశాల్లో ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యూహాల‌నే తాము అమ‌లు చేస్తామ‌ని ..అదే విధంగా ప్ర‌ధానంగా క‌రువు..విత్త‌న స‌మ‌స్య‌లు.. లా అండ్ ఆర్డ‌ర్ అంశాల పైనే ప్ర‌భుత్వాన్ని నిల‌దీయ‌టానికి సిద్ద‌మ‌య్యామ‌ని చెప్పుకొచ్చారు. బ‌డ్జెట్ ప్ర‌సంగం..చ‌ర్చ‌..స‌మాధానం త‌రువాత అంశాల వారీగా చ‌ర్చ లు స‌భ‌లో ప్రారంభం కానున్నాయి. ప్ర‌తిప‌క్షానికి మాట్లాడే అవ‌కాశం ఇవ్వాల‌ని సీఎం సైతం భావిస్తుండ‌టంతో స‌భ‌లో ఇక ఆస‌క్తి క‌ర చ‌ర్చ‌లు సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది.

English summary
interesting discussion between Minister Kodali Nani and TDLP deputy leader Acham Naidu in Assembly lobbies. Acham naidu warned Nani on new decision on Rice supply to hostels. In that matter Nani reacted seriously.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X