ఏలూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ ఛాన్స్ జగన్ ప్రియ శిష్యుడికేనా?: ఏలూరు వైసీపీలో ఏం జరుగుతోంది?..

ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్ టికెట్ కు సంబంధించిన ఊహాగానాలను నాని వర్గం కొట్టిపారేస్తోంది.

|
Google Oneindia TeluguNews

ఏలూరు: ఏపీ ప్రతిపక్షం వైసీపీలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇక్కడ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఆళ్ల నాని ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.

Recommended Video

YS Jagan Padayatra : బాబు అవసరమా? పాదయాత్రలో ఎవరిని పలకరించినా | Oneindia Telugu

2019ఎన్నికల సమయంలో పార్టీ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తుందా?.. లేక ఎలాగూ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు కాబట్టి మరొకరికి అవకాశం ఇస్తుందా? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది. నాని వర్గం మాత్రం తమకే టికెట్ దక్కుతుందని చెబుతుంటే.. వైసీపీలోని ఇతర గ్రూపులు టికెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

జగన్ ప్రియ శిష్యుడు ఆళ్ల నాని:

జగన్ ప్రియ శిష్యుడు ఆళ్ల నాని:

గతంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పలుమార్లు పోటీ చేసిన ఆళ్ల నాని 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించారు. వైఎస్ జగన్ ప్రియ శిష్యుడిగా పేరున్న ఆయన.. తర్వాతి కాలంలో వైసీపీలో చేరారు. కానీ 2014ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై ఓటమిపై తప్పలేదు. అప్పటినుంచి పార్టీ పట్ల అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ వచ్చిన ఆయన.. ఇటీవల మళ్లీ యాక్టివ్ అయ్యారు.

 ఏరికోరి ఎమ్మెల్సీ:

ఏరికోరి ఎమ్మెల్సీ:

పార్టీ పట్ల విధేయుడిగా ఉన్నందుకు జగన్ ఆళ్ల నానిని ఎమ్మెల్సీని చేశారు. నాని ఎమ్మెల్సీ అవడంతో ఎమ్మెల్యే టికెట్ దక్కించుకోవాలనే ఆశావహుల సంఖ్య పెరిగింది. నాని ఎమ్మెల్సీగానే కొనసాగాలని నిర్ణయించుకున్నారో.. లేదో తెలియదు గానీ ఆశావహులు మాత్రం అప్పుడే తమ ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

 కొత్తవాళ్లకు ఛాన్స్ ఇస్తారా?:

కొత్తవాళ్లకు ఛాన్స్ ఇస్తారా?:

జగన్ కు ప్రియ శిష్యుడు అన్న ముద్ర ఉండటంతో.. ఆయనేది కోరినా జగన్ కాదనరనే వాదన కూడా ఉంది. దీన్నిబట్టి ఒకవేళ నాని ఎమ్మెల్యే టికెట్ కోరితే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. జగన్ నానికే అవకాశం ఇస్తారా?.. లేక ఎలాగూ ఆయనకు ఎమ్మెల్సీ ఉంది కాబట్టి కొత్తవాళ్లకు అవకాశం ఇద్దామంటారా? అన్నది వేచి చూడాలి.

 నాని వర్గం ఏమంటోంది?:

నాని వర్గం ఏమంటోంది?:

ఏలూరు అసెంబ్లీ సెగ్మెంట్ టికెట్ కు సంబంధించిన ఊహాగానాలను నాని వర్గం కొట్టిపారేస్తోంది. తమ నాయకుడికే టికెట్ దక్కుతుందని వారు చెబుతున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నంత మాత్రానా.. ఎమ్మెల్యేగా పోటీ చేయరాదా? అని ప్రశ్నిస్తున్నారు.

ఎమ్మెల్యేగా గెలిస్తే.. ఎమ్మెల్సీని వదులుకుంటారని, ఈమాత్రం దానికి ఇంత చర్చ ఎందుకని అంటున్నారు. నాని వర్గం వాదనలతో ఎమ్మెల్యే టికెట్ ను ఆశిస్తున్నవారిలో మళ్లీ దిగులు మొదలైంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉండటం.. అంతిమ నిర్ణయం జగన్ దే కావడంతో.. అప్పటివరకు పరిస్థితులు ఎలాంటి మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.

English summary
It's an interesting discussion in YSRCP about Eluru assembly segment, MLC Alla Nani may contest for MLA in next elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X