గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

థ్యాంక్యూ సీఎం స‌ర్‌! వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఇంట‌ర్ విద్యార్థులు

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకాన్ని ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు కూడా వ‌ర్తింప‌జేయ‌డం ప‌ట్ల రాష్ట్ర‌వ్యాప్తంగా హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మౌతున్నాయి. ఆర్థిక పరిస్థితుల కార‌ణంగా ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కే చ‌దువుకున్న పేద‌, మ‌ధ్య త‌ర‌గతి కుటుంబాల‌కు చెందిన విద్యార్థులు వైఎస్ జ‌గ‌న్‌కు కృతజ్ఞ‌త‌లు తెలుపుకొంటున్నారు. ఈ మేర‌కు ఇంట‌ర్మీడియ‌ట్ చ‌దువుకుంటున్న ప‌లువురు విద్యార్థులు బుధ‌వారం మ‌ధ్యాహ్నం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో వైఎస్ జ‌గ‌న్‌ను క‌లుసుకున్నారు. అమ్మ ఒడి ప‌థ‌కాన్ని ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థుల‌కు కూడా వ‌ర్తింపజేయ‌డం ప‌ట్ల కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Intermediate Students was met Chief Minister of AP YS Jagan for express their thanks

Recommended Video

8 న సంచలన ప్రకటన చేయనున్న సీఎం జగన్

ఇదివ‌ర‌కే విశాఖ‌ప‌ట్నం జిల్లాలో విద్యార్థులు భారీ ర్యాలీని నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. ఇంట‌ర్మీడియ‌ట్ విద్యార్థుల‌ను కూడా అమ్మ ఒడి ప‌థ‌కం కిందికి చేర్చ‌డం ప‌ట్ల హర్షం వ్యక్తం చేస్తూ వందలాది మంది ఇంటర్‌ విద్యార్థులు విశాఖ‌ప‌ట్నంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా వారు థ్యాంక్స్‌టు సిఎం సర్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్ జగన్ ప్ర‌వేశ పెట్టిన ఈ ప‌థ‌కం దేశానికే ఆదర్శమ‌ని చెప్పుకొచ్చారు.

ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో నాటు తుపాకుల‌తో కాల్పులు: 9 మంది మృతి ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లో నాటు తుపాకుల‌తో కాల్పులు: 9 మంది మృతి

Intermediate Students was met Chief Minister of AP YS Jagan for express their thanks

వైఎస్ జగన్‌ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన దాని ప్రకారం అధికారంలోకి రాగానే ఆశా వర్కర్ల వేతనాన్ని 10 వేల రూపాయ‌ల‌కు పెంచారని, అంగ‌న్‌వాడి, హోమ్‌గార్డులు, పారిశుధ్య కార్మికులు, యానిమేటర్లకు జీతాలు భారీగా పెంచారంటూ ప్ర‌శంసించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ''అమ్మ ఒడి'' లాంటి అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులకు ఆశాజ్యోతిగా నిలిచారన్నార‌ని చెప్పుకొచ్చారు. ఈ ప‌థ‌కం వ‌ల్ల ప‌దో త‌ర‌గ‌తిలోనే చ‌దువును మానివేసిన విద్యార్థుల‌కు కొత్త జీవితాన్ని ప్ర‌సాదించిన‌ట్ట‌వుతుంద‌ని విద్యార్థులు చెప్పారు.

English summary
Intermediate Student were met Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy at his Camp Office in Thadepalli in Guntur District on Wednesday. They lend their gratitude to YS Jagan for Amma Vodi Scheme implemented to Intermediate Students also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X