• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వైసీపీలో వరుస బాంబులు..ఆనం మళ్లీ ఫైర్ తాజాగా ధర్మాన.. పుష్పశ్రీవాణిపై ఆమె మామ ఆరోపణలు..

|

ఏడాది పాలన సంబురాల్లో మునిగిపోయిన వైసీపీలో అనూహ్యరీతిలో అసంతృప్తులు చెలరేగుతున్నాయి. సొంత ప్రభుత్వంపైనే తీవ్ర విమర్శలు చేసిన వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి గురువారం మరోసారి ఫైరయ్యారు. ఆయనకుతోడుగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత, శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు సైతం ప్రభుత్వాధికారులపై విరుచుకుపడ్డారు. ఈలోపే.. ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణిపై ఆమె సొంత కుటుంబీకులే సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది.

మన్సాన్ వివాదంపై సంచైత సంచలనం.. తండ్రి చితి ఆరకముందే.. ఆ ఇద్దరూ కలిసి చేశారంటూ.. మన్సాన్ వివాదంపై సంచైత సంచలనం.. తండ్రి చితి ఆరకముందే.. ఆ ఇద్దరూ కలిసి చేశారంటూ..

కోడలు ఫెయిలయ్యారంటూ..

కోడలు ఫెయిలయ్యారంటూ..


ఏపీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణిపై ఆమె మామ, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం అయిఉండి కూడా శ్రీవాణి సొంత నియోజకవర్గమైన కురుపాంను అభివృద్ధి చేయలేకపోయారని, వైసీపీ ఏడాది పాలనలో విజయనగరం జిల్లాకు ఒరిగిందేమీలేదని, తాగునీరు, రోడ్లు, పెన్షన్ల వంటి సదుపాయాలు కల్పించడంలోనూ తన కోడలు ఫెయిలయ్యారని శత్రుచర్ల అన్నారు.

చివరి నిమిషంలో సీఎం జగన్‌కు షాక్.. ఢిల్లీ టూర్ రద్దుపై రచ్చ.. చంద్రబాబుకు శాశ్వత స్థానం..చివరి నిమిషంలో సీఎం జగన్‌కు షాక్.. ఢిల్లీ టూర్ రద్దుపై రచ్చ.. చంద్రబాబుకు శాశ్వత స్థానం..

వైఎస్సార్ తీరుకు వ్యతిరేకంగా..

వైఎస్సార్ తీరుకు వ్యతిరేకంగా..

ఒకప్పుడు కాంగ్రెస్ లో వైఎస్సార్ కు దగ్గరి వ్యక్తిగా పేరుపొందిన చంద్రశేఖర రాజు.. సీఎం జగన్ తీరు తండ్రి వైఎస్సార్ కు విరుద్ధంగా ఉందన్నారు. ‘‘అప్పట్లో వైఎస్ పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ సాయం చేశారు. కానీ ప్రస్తుత జగన్ పాలనలో వైసీపీకి అనుకూలంగా లేకపోతే అర్హత ఉన్నా పేదలకు పథకాలు దక్కట్లేదు. జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు అవకాశం ఉన్నా ఇప్పటి దాకా ఒక్క నిర్మాణాన్నీ చేపట్టలేదు. అసలు పాలనపై వైసీపీకి అవగాహనేలేనట్లుంది''అని చంద్రశేఖరరాజు విమర్శించారు. ఆయనీ వ్యాఖ్యలు చేసిన సమయంలో డిప్యూటీ సీఎం శ్రీవాణి సొంత జిల్లాలో నాడు-నేడు కార్య‌క్ర‌మం ద్వారా సుమారు రూ.16వేల కోట్ల ఖ‌ర్చుతో వైద్యారోగ్య‌రంగంలో మౌళిక స‌దుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు.

ఏపీలో 174 స్థానాలేనా?

ఏపీలో 174 స్థానాలేనా?


సొంత ప్రభుత్వంపై వరుసగా విమర్శలు చేస్తూ మాజీ మంత్రి, వైసీపీ ఆనం రామనారాయణరెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. గురువారం వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని రావూరులో సమీక్ష నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నడూ చూడని పరిస్థితులు చూస్తున్నానని, వెంకటగిరిని అసలు పట్టించుకున్న నాథుడే లేడని, రాష్టంలో రాష్టంలో 175 నియోజకవర్గాలు ఉన్నాయా లేక 174 మాత్రమేనా అని అనుమానంగా ఉందన్నారు. గతంలో 23 జిల్లాలకు(ఉమ్మడి రాష్ట్రంలో) మంత్రిగా చేసిన తనకు, ఎమ్మెల్యే పదవి అలంకారప్రాయం కాదని, జనం కోసం సొంత ప్రభుత్వాన్నైనా నిలదీయడానికి సిద్ధమని ఆనం చెప్పుకొచ్చారు.

3రోజుల గడువు..

3రోజుల గడువు..

‘‘కేసీ కెనాల్, సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ ను పరిశీలించాల్సిందిగా సీఎం జగన్ ను పదే పదే కోరినా పట్టించుకోవట్లేదు. ఇక్కడి అధికారులేమో సోమశిల నీళ్లు అమ్ముకుంటున్నారు. జిల్లాకు సంబంధించిన నీటి లెక్కలు ఎవరికీ తెలియడంలేదు. విద్య, వైద్యం, సంక్షేమ పథకాలపై అధికారులు నివేదికలు తయారుచేయలేదు. ఇంకో మూడు రోజులు గడువిస్తున్నాను.. ఆలోగా అధికారులు అన్ని లెక్కలు, సరైన సమాచారం సిద్ధంగా ఉంచాలి. లేకపోతే మళ్ళీ మీడియా ముందుకు వస్తాను..''అంటూ రామనారాయణరెడ్డి ఫైరయ్యారు. జిల్లాలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలతో ఆనం తొలి నుంచీ తగాదా పడుతుండగా, మధ్యలో ఓసారి సీఎం పిలిపించి మాట్లాడటంతో కొన్నాళ్లు సైలెంట్ అయిపోయారు. తాజాగా మళ్లీ తన అసంతృప్తిని ఆయన వెళ్లగక్కుతున్నారు.

  AP CM Jagan On Nadu Nedu Education Review Meeting In Tadepalli
  ధర్మాన ఆగ్రహం..

  ధర్మాన ఆగ్రహం..

  ఆనం కలకలం కొనసాగుతుండగానే శ్రీకాకుళం జిల్లాలో జరిగిన జీజీహెచ్ అభివృద్ధి రివ్యూ మీటింగ్ లో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రభుత్వాధికారులపై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. ఆస్పత్రుల్లో శానిటేషన్ కోసం డబ్బులు లంచంగా తీసుకుంటున్నారంటూ యాజమాన్యంపై ఫైరయ్యారు. ముంబైకి చెందిన వ్యక్తికి శానిటైజేషన్ కాంట్రాక్టు అప్పగించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇద్దరు సీనియర్లు వరుసగా సొంత సర్కారుపై మండిపడటం చర్చనీయాంశమైంది.

  English summary
  Satrucharla Chandrasekhara Raju made sensational comments on his daughter-in-law Pushpa Srivani deputy who is deputy cm of ap. ysrcp senior Anam Ramanarayana Reddy slams his own party once again
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X