కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబు అరెస్ట్ చేసిన గంగిరెడ్డికి బెయిల్ : అలిపిరి ఘటనలో కీలకంగా: ఎర్రచదనంలో స్మగ్లింగ్ లో..!!

|
Google Oneindia TeluguNews

అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్‌ కొల్లం గంగిరెడ్డికి బెయిల్‌ మంజూరైంది. గంగిరెడ్డిపై మూడు జిల్లాల్లో మొత్తం 27 కేసులు ఉన్నాయి. 2003లో అలిపిరిలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు పైన జరిగిన హత్యా యత్నంలో ఆయన నిందితుడు. 2004 నుండి 2014 వరకు చంద్రబాబు అధికారంలో లేకపోవటంతో గంగిరెడ్డి పోలీసులకు దొరకలేదు. అయితే, తిరిగి 2014లో చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అప్పటి డీజీపీ రాముడికి కీలక బాధ్యతలు అప్పగించారు. ఎలాగైనా గంగిరెడ్డిని తీసుకురావాలని నాటి ప్రభుత్వం సీరియస్ గా నిర్ణయించింది. దీంతో..ఎట్టకేలకు పోలీసులు మారిషస్ లో తల దాచుకున్న గంగిరెడ్డిని పోలీసులు ఏపీకి తీసుకొచ్చారు. ఆయనకు శిక్ష ఖరారైంది. ఇప్పుడు ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో గంగిరెడ్డి జైలు నుండి విడుదల కానున్నారు.

గంగిరెడ్డిని నాడు పట్టుదలతో తెచ్చిన ప్రభుత్వం..
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2014లో బాధ్యతలు తెచ్చిన తరువాత ఎలాగైన గంగిరెడ్డిని అరెస్ట్ చేసి ఏపీకి తీసుకురావాలని పోలీసులకు గట్టిగా ఆదేశాలు ఇచ్చారు. దీనితో పాటుగా అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ గా ఉన్న గంగిరెడ్డి కోసం ప్రత్యేక పోలీసు సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో..2015లో గంగిరెడ్డి విదేశాలకు పారిపోయాడు. అదే సమయంలో 2015లో దొంగపాస్ పోర్టుతో మారిషస్ చేరుకున్నాడు. అక్కడి నుంచి దుబాయ్ వెళ్లేందుకు యత్నిస్తుండగా అక్కడి పోలీసులు గంగిరెడ్డిని అరెస్టు చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో గంగిరెడ్డిని భారత్ కు తీసుకొచ్చారు. ఆ తరువాత కోర్టులో ఆయనకు శిక్ష విధించగా..కడప జిల్లా కోర్టులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా, కొద్ది సేపటి క్రితం గంగిరెడ్డికి గాజులమండ్యం కేసులో తిరుపతి కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. తీసుకొచ్చారు. ఎర్రచందనం స్మగ్లింగ్ తో పాటు నాడు అలిపిరి ఘటన కేసులో గంగిరెడ్డి నిందితుడు.

 International red sandal smugler Gangireddy got bail after four years.

అలిపిరి ఘటనలో కీలకంగా గంగిరెడ్డి..
చంద్రబాబు సమైఖ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2003 లో తిరుమలకు వెళ్తున్న సమయంలో అలిపిరి వద్ద చంద్రబాబు కారు ను క్లైమోర్ మైన్స్ తో పేల్చేసే ప్రయత్నం చేసారు. చంద్రబాబు తో సహా అప్పుడు అదే కారులో ఉన్న బొజ్జల గోపాల క్రిష్ణారెడ్డి సైతం ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. ఆ ఘటనలోనూ గంగిరెడ్డి కీలకం వ్యవహరించాడని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పలు మార్లు చెప్పుకొచ్చారు. దీంతో..ఆ తరువాత ఎన్నికల్లో వరుసగా 2004, 2009 ఎన్నికల్లో చంద్రబాబు అధికారం కోల్పోయారు. తిరిగి 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత విదేశాల్లో ఉన్న గంగిరెడ్డిని పట్టుకొచ్చారు. కాగా, ఇప్పుడు తిరిగి గంగిరెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఈ అంశం ఇప్పుడు టీడీపీ శ్రేణుల్లో చర్చకు కారణమైంది.

English summary
International red sandal smugler Gangireddy got bail after four years. He accused in Attack on Chandra babu in alipiri case. In Chadnra Babu tenure gangireddy arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X