వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగురాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులకు బ్రేక్..?: కంటిన్యూ కానీ చర్చలు, ఏపీలో సిటీ బస్సులకు ఓకే...

|
Google Oneindia TeluguNews

తెలుగురాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సు సర్వీసులు ఇప్పట్లో నడిచే అవకాశం కనిపించడం లేదు. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో బస్సులు స్టార్ట్ చేసే అంశంపై సందిగ్ధత నెలకొంది. దీనికితోడు ఇరురాష్ట్రాల అధికారుల మధ్య చర్చల ప్రక్రియ వాయిదా పడింది. ఈ నెల 17వ తేదీన విజయవాడలో ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అధికారుల మధ్య చర్చ జరిగింది. కానీ మరో దఫా చర్చలు ప్రక్రియ మాత్రం వాయిదా పడింది. ఇందుకు కారణం టీఎస్ఆర్టీసీ ఆపరేషన్ విభాగంలో ఒకరికీ కరోనా వైరస్ రావడమే. దీంతో చర్చల ప్రక్రియ వాయిదా పడటంతో.. అంతరాష్ట్ర బస్సులు సరిహద్దు దాటడం లేదు.

Recommended Video

తెలుగురాష్ట్రాల మధ్య Bus సర్వీసులకు బ్రేక్.. AP లో సిటీ బస్సులకు గ్రీన్ సిగ్నల్! || Oneindia Telugu

 కర్ణాటక ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఈనెల 17 నుంచి ఆంధ్రాకు బస్సులు.. ఆన్ లైన్ రిజర్వేషన్ షురూ.. కర్ణాటక ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఈనెల 17 నుంచి ఆంధ్రాకు బస్సులు.. ఆన్ లైన్ రిజర్వేషన్ షురూ..

నో డిస్కషన్స్..

నో డిస్కషన్స్..

ఆర్టీసీ ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగితే.. బస్సు సర్వీసుల ప్రారంభంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎన్ని బస్సు సర్వీసులు, సమయంపై క్లారిటీ రానుంది. కానీ డిస్కషన్స్ ఆగిపోవడంతో అంతరాష్ట్ర సర్వీసులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల రాకపోకలతో మరింత పెరిగే అవకాశం ఉంది.

కరోనా డేంజర్ బెల్స్

కరోనా డేంజర్ బెల్స్

హైదరాబాద్‌లో రోజుకు 500 పైచిలుకు పాజిటివ్ కేసులు రికార్డవుతున్నాయి. సిటీకి కొత్త వారు వచ్చినా, వెళ్లినా ప్రమాదమేననే భావన కూడా వ్యక్తమవుతోంది. ఏపీలో జూన్ 1 తేదీ నుంచి బస్సు సర్వీసులు నడుస్తోన్నాయి. రోజుకు 3 వేల 266 సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ నడిపింది. 11.03 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు ప్రయాణించి.. ప్యాసెంజర్స్‌ను గమ్యస్థానం చేర్చాయి. దీంతో ఆర్టీసీ రూ.2.43 కోట్ల ఆదాయం సమకూరింది. కిలోమీటర్ లెక్కన రూ.22.06 మాత్రమే సంపాదించగలిగింది.

 రూ.12 కోట్ల ఆదాయం

రూ.12 కోట్ల ఆదాయం

అంతకుముందు (కరోనా వైరస్ కన్నా ముందు) రోజుకు రూ.12 కోట్ల ఆదాయం ఆర్టీసీకి వచ్చేది. కానీ బస్సుల పరిమితి, సోషల్ డిస్టన్స్ వల్ల అంత ఆదాయం రావడం లేదు. త్వరలో సిటీ బస్సులను నడిపిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. విజయవాడ, విశాఖపట్టణంలో సిటీ బస్సులు నడిపిస్తామని సంకేతాలు ఇచ్చారు. అయితే సిటీ బస్సులో టికెట్ రేట్ ఓకేవిధంగా ఉండే అవకాశం ఉంది.

English summary
andhra pradesh, telangana state rtc buses not start yet. because rtc officers second phase talks not continue.. and coronavirus positive cases are increase
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X