వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంత్రీగాళ్లు: స్కెచ్ ఇదీ, రైళ్లలో దొంగతనాలు ఇలా చేస్తారు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర దొంగలను గవర్నమెంట్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి, వారి నుంచి 210 గ్రాముల బంగారు, వజ్రాభరణాలతో పాటు రూ. 3.25 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లోని తన కార్యాలయంలో ఈ కేసు వివరాలను జీఆర్పీ డీఎస్పీ పురవి నారాయణ రావు మీడియాకు ఆదివారం వెల్లడించారు.

సికింద్రాబాద్ నుంచి వచ్చే దురంతో, ఎల్‌సీటీ, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో మూడు నెలల కాలంలో వరుస చోరీలు జరిగాయి. ఆయా రైళ్లలో ఎ-1, హెచ్-1, కోచ్‌లలో ఎక్కువగా దొంగతనాలు జరగడంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో దొంగతనాలు జరిగిన తేదీల్లో ప్రయాణికులు రిజర్వేషన్ లిస్ట్‌లను పరిశీలించి, ఒకే పేరుతో ప్రయాణించే వారి వివరాలు సేకరించారు.

ఇలా సేకరించిన 15 మంది పేర్లు రాజమండ్రి, విశాఖపట్నంలోని పలు లాడ్జిలలో సేకరించిన పేర్లతో సరిచూసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హౌల్దౌర్ ప్రాంతానికి చెందిన హరి విందర్ సింగ్, పరంజిత్ సింగ్, సందీప్ కుమార్‌లతో పాటు ఉజ్జయిని ప్రాంతానికి చెందిన సత్య వీర్ సింగ్‌లను నిందితులుగా గుర్తించారు.

కంత్రీగాళ్లు: స్కెచ్ ఇదీ, రైళ్లలో దొంగతనాలు ఇలా చేస్తారు

కంత్రీగాళ్లు: స్కెచ్ ఇదీ, రైళ్లలో దొంగతనాలు ఇలా చేస్తారు


ఇందులో ఏ-1 ముద్దాయి హవిందర్ సింగ్‌కు సందీప్ కుమార్ ప్రాణ స్నేహితుడు కాగా, మిగతా ఇద్దరు సొంత బావమరులే కావడం గమనార్హం. ఈ క్రమంలో ఈ నెల 21న స్టేషన్‌లోని టికెట్ కౌంటర్ దగ్గర నిరీక్షిస్తుండగా జీఆర్పీ సీఐ కోటేశ్వరరావు బృందం హరి విందర్ సింగ్, పరంజిత్ సింగ్, సందీప్ కుమార్‌లను అదుపులోకీి తీసుకున్నారు.

కంత్రీగాళ్లు: స్కెచ్ ఇదీ, రైళ్లలో దొంగతనాలు ఇలా చేస్తారు

కంత్రీగాళ్లు: స్కెచ్ ఇదీ, రైళ్లలో దొంగతనాలు ఇలా చేస్తారు


సత్యవీర్ సింగ్ పరారీలో ఉన్నాడు. వీరిని విచారించగా రైళ్లలో జరిగిన ఏడు దొంగతనాలకు తామే కారణమని ఒప్పుకోవడంతో నిందితులను రిమాండ్‌కు తరలించినట్టు డీఎస్పీ తెలిపారు. రైళ్లలో దొంగతనాలు ఎలా చేస్తారంటే.... గ్రూపులో నలుగురు సభ్యులు వేర్వేరుగా విడిపోయి, ఇద్దరు జనరల్ టికెట్ తీసుకంటారు.

కంత్రీగాళ్లు: స్కెచ్ ఇదీ, రైళ్లలో దొంగతనాలు ఇలా చేస్తారు

కంత్రీగాళ్లు: స్కెచ్ ఇదీ, రైళ్లలో దొంగతనాలు ఇలా చేస్తారు


మరో ఇద్దరు ఏసీ కోచ్‌లో రిజర్వేషన్ చేయించుకంటారు. రైలు కదిలిన దగ్గర నుంచి ఏసీ బోగీల్లో ప్రతీ ప్రయాణికుడి కదలికపై కన్నేస్తారు. బాత్ రూం, స్నాక్స్, పుడ్ తదితర కారణాలతో బోగీ మొత్తం తిరుగుతారు. రాత్రి అందరూ నిద్రలోకి జారుకున్నాక బంగారు ఆభరణాలు, నగదు ఉన్న బ్యాగులను తస్కరించి జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న వారికి సమాచారమందిస్తారు.

 కంత్రీగాళ్లు కంత్రీగాళ్లు: స్కెచ్ ఇదీ, రైళ్లలో దొంగతనాలు ఇలా చేస్తారు: స్కెచ్ ఇదీ, రైళ్లలో దొంగతనాలు ఇలా చేస్తారు

కంత్రీగాళ్లు కంత్రీగాళ్లు: స్కెచ్ ఇదీ, రైళ్లలో దొంగతనాలు ఇలా చేస్తారు: స్కెచ్ ఇదీ, రైళ్లలో దొంగతనాలు ఇలా చేస్తారు

రైలు హాల్డ్ సమయంలో జనరల్ బోగీలో ప్రయాణిస్తున్న వారు ఏసీ బోగీల వద్దరు చేరుకోని, బ్యాగులు తీసుకొని అందులోని నగదు, నగలు మాయం చేస్తారు. తిరిగి జనరల్ బోగీ ఎక్కి గమ్యస్థానానికి చేరుకుంటారు. ఏసీలో ప్రయాణించే ఇద్దరు మాత్రం ఎవరికీ అనుమానం రాకుండా చివరి వరకు ప్రయాణం కొనసాగించి దొంగతనాలు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

English summary
An interstate gang of robbers, allegedly involved in looting train passengers, was today busted with the arrest of its three members here and Rs 3.25 lakh in cash and 210 gm gold jewellery studded with diamonds were seized from them.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X