వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బికినీ వేసుకుంటే తప్పేంటి?, మొద్దుశీను గతేనంటూ బెదిరింపు: అనితపై రవికిరణ్

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనితపై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని పొలిటికల్ పంచ్ అడ్మిన్ రవికిరణ్ తేల్చి చెప్పారు. విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ఆయనను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రవికిరణ్‌పై 292, 509 సెక్షన్ల కింద, మహిలపై వేధింపులకు గాను సెక్షన్ 6కింద, ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టంలోని సెక్షన్ 3కింద కేసులు నమోదు చేశారు.

బరువు పెరిగారంటే ఎస్సీ, ఎస్టీ కేసా

బరువు పెరిగారంటే ఎస్సీ, ఎస్టీ కేసా

అంతకుముందు రవికిరణ్ మీడియాతో మాట్లాడారు. అసలు అనితతో వివాదం ఏంటని మీడియా ప్రశ్నించగా.. చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి ప్రతిపక్షాలకు కనిపించడం లేదా? అని ఓ సందర్భంలో అని అన్నారని.. అందుకు తాను స్పందించి ఆమె అభివృద్ధి(బరువు పెరగడం) కనిపిస్తోంది, గానీ, రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా కనపడటం లేదని సోషల్ మీడియాలో పంచ్ వేశానని చెప్పారు.

లోకేష్‌లా లావుగా.. ఇప్పుడు స్లిమ్‌గా

లోకేష్‌లా లావుగా.. ఇప్పుడు స్లిమ్‌గా

అంతకుముందు కూడా సమైక్య రాష్ట్రం 23జిల్లాలతో లోకేష్‌లా లావుగా ఉండేదని, తర్వాత 13జిల్లాలతో స్లిమ్ అయ్యిందని తాను ఓ పంచ్ వేశానని తెలిపారు. ఇలా బరువు పెరగడం గురించి మాట్లాడటమే తప్పంటే.. అలాంటివి చాలా ఉంటాయన్నారు.
వెయిల్ లాస్ ప్రకటనల విషయంలో కూడా ముందు, తర్వాత అంటూ మహిళలకు సంబంధించిన రెండు ఫొటోలతో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తారని, అది మహిళలను అవమానించడం అయితే.. ఆ యాడ్ ఇచ్చిన వాళ్ల మీద, ప్రకటనలు ప్రసారం చేసిన మీడియా మీద కూడా కేసులు పెట్టాలని రవికిరణ్ అన్నారు.

మొద్దుశీనుకు పట్టినే గతేనంటూ..

మొద్దుశీనుకు పట్టినే గతేనంటూ..

తనను తుళ్లూరు పోలీసులు గతంలో విచారినప్పుడే.. తాము తలచుకుంటే ఏమైనా చేస్తామని, మొద్దు శీనుకు ఏం జరిగిందో తెలుసు కదా? అని బెదిరించారని తెలిపారు. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టినా తమకు సంబంధం లేదని చెప్పారని రవికిరణ్ తెలిపారు.

బికినీ వేసుకుంటే తప్పేం లేదంట

బికినీ వేసుకుంటే తప్పేం లేదంట

సోషల్ మీడియాలో తమ వాయిస్‌ను అణగదొక్కాలన్న లక్ష్యంతో భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఒకప్పుడు ఇదే విశాఖలో ఆర్కే బీచ్‌లో బికినీ ఫెస్టివల్ పెట్టారని, దాన్ని సోషల్ మీడియాలో చాలా గట్టిగా చెప్పడంతో తర్వాత కాస్త వెనక్కి తగ్గారని అన్నారు. అప్పట్లో అనిత మాట్లాడుతూ.. బికినీ వేసుకుంటే తప్పేంటని ప్రశ్నించారని, నిజానికి అది మహిళలను అవమానించడమే అవుతుంది గానీ, గ్రోత్ అంటే అవమానించడం కాదని రవికిరణ్ స్పష్టం చేశారు. తాను ఈ తరహాలో ఎప్పుడూ ఊహించలేదని, తొలిసారి విచారణలో పోలీసులు చెప్పినట్లే ఇప్పుడు కూడా చేశారని, వాళ్లు అనుకున్నది సాధించారని రవికిరణ్ అన్నారు.

English summary
Political Punch admin Inturi Ravikiran lashed out at Telugudesam MLA Vangalapudi Anitha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X