వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెల్లని చెక్కు కేసు: మాజీ మంత్రి కుమారుడికి రెండేళ్ల జైలు, 20లక్షల జరిమానా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో మాజీ మంత్రి విశ్వరూప్‌ కుమారుడు కృష్ణారెడ్డికి రెండేళ్ల జైలు శిక్ష పడింది. తన వద్ద తీసుకున్న అప్పు తీర్చేందుకు కృష్ణారెడ్డి చెల్లని చెక్కు ఇచ్చారని విజయలక్ష్మి అనే మహిళ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఈ కేసును విచారించిన హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌ న్యాయస్థానం కృష్ణారెడ్డికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.20లక్షల భారీ జరిమానా విధించింది.

 Invalid cheque case: 2 years jail for Vishwaroop's son Krishna Reddy

రూ.50 లక్షల ఎర్ర చందనం స్వాధీనం

నెల్లూరు: జిల్లాలోని సీతారాంపురం మండలం దేవమ్మచెరువు ఫారెస్టు ఏరియాలో శుక్రవారం ఉదయం అటవీ శాఖ అధికారులు విస్తృతంగా దాడులుచేసి 50 లక్షల రూపాయల విలువచేసే ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి నిందితులు పరారయ్యారు.

ఆటోను ఢీ కొట్టిన బస్సు: 27 మందికి గాయాలు

అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని మడకశిర రైల్వేగేటు వద్ద ఆటోను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు గొయ్యిలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో 27 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

బస్సులో ప్రయాణిస్తున్న 23 మంది, ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
2 years jail sentenced to former minister Vishwaroop's son Krishna Reddy in Invalid cheque case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X