వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యుత్ రంగంలో పెట్టుబడులే లక్ష్యం: విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం జగన్

|
Google Oneindia TeluguNews

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో తన మార్క్ పాలన కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. సీతయ్య ఎవరి మాట వినడు అన్న చందంగా పాలన సాగిస్తున్న జగన్ అన్ని శాఖలలోనూ సంస్కరణల దిశగా అడుగులు వేస్తున్నారు .విద్యుత్ రంగంలో పట్టుబడులే లక్ష్యంగా విద్యుత్ శాఖ సమీక్షలో సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

 విశాఖ అభివృద్ధికి సీఎం జగన్ కీలక నిర్ణయాలు .. శరవేగంగా పనులు విశాఖ అభివృద్ధికి సీఎం జగన్ కీలక నిర్ణయాలు .. శరవేగంగా పనులు

 విద్యుత్‌రంగంపై సీఎం జగన్‌ సమీక్ష

విద్యుత్‌రంగంపై సీఎం జగన్‌ సమీక్ష

విద్యుత్‌రంగంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన కీలకంగా విద్యుత్‌ రంగంలో పెట్టుబడులు, మరిన్ని ఉద్యోగాల కల్పనే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు . విద్యత్ రంగంలో పెట్టబడులను ఆహ్వానిస్తున్నామన్న జగన్ ఎవరైతే ఆసక్తి చూపుతారో వారికి సానుకూల వాతావరణం కల్పించేలా పాలసీ తీసుకువస్తామని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్‌ ఉత్పత్తి చేసి, ఆ విద్యుత్‌ను బయట అమ్మకోవాలనుకునే కంపెనీలకు, సంస్థలకు చేయూతనిస్తామని చెప్పారు.

ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ తయారుచెయ్యాలని అధికారులకు ఆదేశం

ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ తయారుచెయ్యాలని అధికారులకు ఆదేశం

ఇక ఆయా సంస్థలకు అనుకూలంగా పాలసీ తీసుకువస్తున్నామన్న సీఎం జగన్ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక రాష్ట్రంలో విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టె వారికి అనుకూలంగా రాష్ట్రంలో ప్లాంట్లు పెట్టాలనుకునేవారికి ఉపయుక్తంగా , సానుకూల వాతావరణం కల్పించేలా ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీ ఉండాలని అధికారులకు సూచించారు. విద్యుత్ రంగంలో పెట్టబడులను ప్రోత్సహిస్తామని ఆయన పేర్కొన్నారు.

 భూముల లీజు విషయంలో అధికారులతో చర్చించిన జగన్

భూముల లీజు విషయంలో అధికారులతో చర్చించిన జగన్

ఇక విద్యుత్ రంగ సంస్థల కోసం లీజు ప్రాతిపదికన పరిశ్రమలకు భూములిచ్చే ప్రతిపాదనపై చర్చించిన జగన్ దీనివల్ల భూములిచ్చేవారికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి ఏటా రైతులకు ఆదాయం వస్తుందని, భూమిపై హక్కులు ఎప్పటికీ వారికే ఉంటాయని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఇక ఈ నేపధ్యంలోనే విద్యుత్ శాఖా ఉన్నతాధికారులు మరో
వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ ఉత్పాదనకు ఎన్టీపీసీ ముందుకు వస్తుందని సీఎం జగన్‌ దృష్టికి తీసుకు వెళ్ళారు . వారికి అవసరమైన భూమిని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

Recommended Video

Janasena Party Leader Pothina Mahesh Slams YS Jagan Over Jagananna Vasathi Deevena Scheme | Oneindia
ఫీడర్ల ఆటోమేషన్‌ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు

ఫీడర్ల ఆటోమేషన్‌ పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు

ఇక వ్యవసాయానికి 9 గంటలపాటు నిరంతర విద్యుత్‌ కోసం ఫీడర్ల ఆటోమేషన్‌ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చే రెండేళ్లలోగా ఆటోమేషన్‌ పూర్తి చేయాలని అధికారులకు సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు 10వేల మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణంపై కూడా జగన్ అధికారులతో చర్చించారు. వీలైనంత త్వరగా సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

English summary
CM Jagan review on power sector. In this review, he concludes that the key is to invest in the power sector and create more jobs. Jagan said the policy would be implemented to create a positive environment for those who would be interested in it. He said that the state will do it to companies and companies that want to generate electricity and sell that power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X