వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముంబై వెళ్లి పెట్టుబడులు తెస్తున్న బాబు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలా ప్రపంచంలోనే ఉన్నత పారిశ్రామిక కేంద్రంగా విశాఖపట్టణాన్ని తీర్చిదిద్దనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ముంబై నగరానికి ఉన్న అన్ని రకాల సౌకర్యాలూ విశాఖ నగరానికీ ఉన్నాయని, విమాన సదుపాయాలు, నౌకా రవాణా, రోడ్డు రవాణాతోపాటు తూర్పు ముఖద్వారంగా అనేక దేశాలకు ఆంధ్ర అందుబాటులో ఉందన్నారు.

ముంబయిలో సోమవారం సిటీ ఇన్వెస్టర్ల సదస్సుకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామన్నారు. దాదాపు వెయ్యి కిలోమీటర్లు పొడవైన తీర ప్రాంతం ఉన్న తమ రాష్ట్రంలో అపారమైన ఖనిజ, సహజవాయు నిక్షేపాలు ఉన్నాయన్నారు. విశాఖను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ చేపట్టామన్నారు.

తమ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేదని, అది మరో ఆకర్షణీయమైన అంశంగా అభివర్ణించారు. 24 గంటల విద్యుత్ సరఫరాకు కేంద్రం ఎంపిక చేసిన మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటన్నారు. పెట్టుబడులు పెట్టేవారికి ఏపీ స్వర్గ్ధామనన్నారు. డెయిరీ, ఫౌల్ట్రీ, సిమెంట్, పేపర్ పరిశ్రమల్లో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ముందుందన్నారు. ఫార్మా, బయోటెక్నాలజీ, మెటలర్జీ, ఎలక్ట్రానిక్స్, రసాయన పరిశ్రమల రంగాల్లో ఏపీ దూసుకువెళ్తోందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

రాష్ట్రాన్ని లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు, మినరల్ ప్రాసెసింగ్, ఢిఫెన్స్, ఏరోస్పేస్ హబ్‌లుగా మారుస్తామని చంద్రబాబు చెప్పారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లు, పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌లను కూడా అభివృద్ధి చేస్తామని, పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఇంటిగ్రేటెడ్ టెక్స్‌టైల్ పార్కులను, అపెరల్ పార్కులను ఏర్పాటు చేస్తామని, ఎలక్ట్రానిక్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని కూడా వెల్లడించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

రాష్ట్రంలోని అన్ని గ్రామాలను ఫైబర్ కనెక్టవిటీతో అనుసంథానం చేస్తామని తెలిపారు. 2050 నాటికి ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తాను సైబరాబాద్‌ను అభివృద్ధి చేసిన తీరును పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు వివరించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

హైదరాబాద్‌ను సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కేంద్రంగా మలిచామని చెప్పారు. చంద్రబాబుతో పలువురు పారిశ్రామికవేత్తలు భేటీ అయ్యారు. సూయజ్ ఎనర్టీ ఇంటర్నెషనల్ సీఈవో, సుజ్లాన్ కంపెనీ ప్రతినిధి, ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ తదితరులు కలిశారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఈ సందర్భంగా సూయజ్‌ ఎనర్జీ ఇంటర్నేషనల్‌ సిఇఒ బెర్నెడ్‌ మాట్లాడుతూ.. గ్యాస్‌, పవర్‌ సెక్టార్లలో అతిపెద్ద కంపెనీగా ఉన్న తాము ఏపీలోనూ రూ.15 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

పరిశ్రమల కోసం ఏపీలో 10 లక్షల ఎకరాలు సిద్ధంగా ఉందని, పారిశ్రామికవేత్తలు వస్తే 21 రోజుల్లోనే అనుమతులు అన్నీ ఇస్తామన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

సుజ్లాన్‌ కంపెనీ ప్రతినిధి రాజీవ్‌ శుక్లా.. సోలార్‌, విండ్‌ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆదిత్య బిర్లా గ్రూప్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ప్రెసిడెండ్‌ దేవ్‌ భట్టాచార్య ఎపిలో పెట్టుబడులకు గల అవకాశాలపై చంద్రబాబుతో చర్చించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

సన్‌ ఫార్మా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సుధీర్‌ వాల్యా.. తాము రూ.12 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు స్థాపించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ఎల్ అండ్ టి ప్రతినిధి ప్రవీణ్‌, టాటా ఆపర్చ్యునిటీస్‌ ఫండ్‌ ప్రతినిధి పద్మనాభ సిన్హా, బ్లాక్‌ స్టోన్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ మాథ్యూ, ఐడీఎఫ్‌సీ ఎగ్జిక్యూటివ్‌ సతీష్‌, తదితరులు చంద్రబాబుతో భేటీ అయ్యారు.

చంద్రబాబు

చంద్రబాబు

ప్రధానంగా ఆటోమొబైల్‌, ఫార్మా, టెక్స్‌టైల్‌, సిమెంట్‌, పవర్‌ కంపెనీల ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

English summary
Investors optimistic about Andhra Pradesh: CM Chandrababu at Mumbai
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X