వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీ రాజకీయాలపై కీలక ప్రకటన విడుదల చేసిన ఐప్యాక్..!!

రాజకీయ పార్టీలకు కన్సల్టెన్సీగా వ్యవహరిస్తోన్న ఐప్యాక్ టీమ్- కీలక ప్రకటన విడుదల చేసింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో అయిదుమంది మంత్రులు మాత్రమే గెలుస్తారంటూ వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. ఆ వార్తలన్నీ నిరాధారమైనవని

|
Google Oneindia TeluguNews

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తాజాగా వెలువడిన వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీకి పరాభవం తప్పదని, ఇప్పుడున్న మంత్రుల్లో అయిదుమంది మాత్రమే విజయం సాధిస్తారంటూ వచ్చిన వార్తా కథనాలు కలకలం రేపాయి. ఈ విషయాన్ని స్వయంగా వైఎస్ఆర్సీపీకి పొలిటికల్ కన్సల్టెంట్ గా వ్యవహరిస్తోన్న ఐప్యాక్ వెల్లడించిందని పేర్కొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

కేసీఆర్‌కు అన్ని పార్టీల్లో కోవర్టులు- ఈటెల రాజేందర్ సంచలనం..!!కేసీఆర్‌కు అన్ని పార్టీల్లో కోవర్టులు- ఈటెల రాజేందర్ సంచలనం..!!

 నెగెటివ్ గా.. ఉద్దేశపూరకంగా..

నెగెటివ్ గా.. ఉద్దేశపూరకంగా..

దీనిపై ఐప్యాక్ స్పందించింది. కీలక ప్రకటన విడుదల చేసింది. తొమ్మిది రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్ష రాజకీయ పార్టీలకు తాము కన్సల్టేన్సీ గా వ్యవహారిస్తోన్నామని గుర్తు చేసింది. సరికొత్త వ్యూహ రచనలతో ఆయా రాజకీయ పార్టీలను గెలిపించడానికి విశేషంగా కృషి చేస్తోన్నామని తెలిపింది. అలాంటి ఐప్యాక్ సంస్థ రిపోర్ట్ పేరుతో ఒక వర్గానికి చెందిన మీడియా నెగెటివ్ గా ప్రచారం చేస్తోందని తేల్చి చెప్పింది.

 అవాస్తవం..

అవాస్తవం..

ఒక దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని తప్పు పట్టింది. మంత్రుల పనితీరు, గెలుపోటములపై ఐప్యాక్ సర్వే పేరుతో ఆ దినపత్రిక ఈ వార్తను ప్రచురించిందని వివరించింది. ఈ వార్తా కథనంపై ఐప్యాక్ తీవ్రంగా స్పందించింది. ఆ పత్రికలో ప్రచురించిన కథనాన్ని తోసిపుచ్చింది. సోషల్ మీడియాలో ఐప్యాక్ పేరుతో వైరల్ అవ్వుతోన్న సర్వే రిపోర్ట్ అసత్యమని, ఇందులో వాస్తవం లేదని స్పష్టం చేసింది.

ఉద్దేశపూరకంగా..

ఉద్దేశపూరకంగా..

ఒక వర్గానికి చెందిన మీడియా అవాస్తవాలతో రాసిన ఈ కథనాన్ని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన అధికార సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ ఉద్దేశపూరకంగానే వైరల్ చేస్తోందని తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోను గమనిస్తే ఐప్యాక్ లోగోను కూడా మార్క్ చేస్తూ మెయిల్ ఐడీని దాచి పెట్టారని ఐప్యాక్ వివరించింది. అంతే కాకుండా అదే వీడియోలో ఐప్యాక్ డైరెక్టర్ పేరు కూడా తప్పుగా ప్రచురించిందని గుర్తు చేసింది.

ఆదరణను చూసి..

ఆదరణను చూసి..

ఇప్పటి వరకు తొమ్మిది రాష్ట్రాల్లో పని చేశామని, ఎక్కడా తమ రిపోర్ట్ లు లీక్ అవ్వడం గాని లేదా రిపోర్ట్ తప్పు కావడం గానీ చోటు చేసుకోలేదని ఐప్యాక్ సంస్థ వెల్లడించింది. ఐప్యాక్ సంస్థ సర్వేలు, ఖచ్చితమైన రిపోర్ట్ లకు ఉన్న ఆదరణ చూసి ఒక వర్గానికి చెందిన మీడియా తమపై ఈ తరహా దుష్ప్రచారానికి పాల్పడుతోందని పేర్కొంది. నారా లోకేష్ పాదయాత్రపై తమ దృష్టిని మళ్లించడానికే ఈ చర్యకు పూనుకున్నారని వివరించింది.

కొన్ని రోజులు ముందు నుంచే..

కొన్ని రోజులు ముందు నుంచే..

ఆదివారం సాయంత్రం నుంచే టీడీపీ సోషల్ మీడియా విభాగాల్లో ఈ దుష్ప్రచారం మొదలైందని, దీన్ని మొదటగా వైరల్ చేసింది ఐటీడీపీనేనని తెలిపింది. కావాలనే టీడీపీ తన అనుకూల మీడియాలో ఈ తరహా తప్పుడు కథనాన్ని ప్రచురించిందని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా చెప్పుకునే మీడియా ఇలా తమ సొంత ప్రయోజనాల కోసం లక్షలాది మంది పాఠకులు, ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడం దురదృష్టకరమని ఐప్యాక్ డైరెక్టర్ రిషి రాజ్ సింగ్ అన్నారు. ఐప్యాక్ పేరుతో తప్పుడు సర్వేలు, నివేదికలు, నకిలీ వార్తలను ప్రచారం చేయడాన్ని తాము ఖండిస్తున్నామని, తమ సంస్థ పేరుతో ప్రచురితమైన కథనాలు పూర్తి సత్యదూరంగా ఉన్నాయని, వాటిని విశ్వసించ వద్దని తెలియజేశారు.

English summary
Ipac denied the reports that only 5 ministers will be winning in next election others will suffer defeats.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X