వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నీతా అంబానీ టీమ్‌పై ఆ వైసీపీ ఎంపీకి ఎంత ప్రేమో: ఆ క్రికెటర్‌కు ఆలింగనంతో అభినందన

|
Google Oneindia TeluguNews

అమరావతి: టీమిండియా మిడిల్ ఆర్డర్ అటాకింగ్ బ్యాట్స్‌మెన్ హార్ధిక పాండ్యా ఆదివారం పుట్టినరోజు వేడుకలను జరుపుకొంటున్నారు. పలువురు క్రీడాకారులు, రాజకీయ నాయకులు ఆయనకు శుభాకాంక్షలను తెలిపుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సందర్భంగా ప్రస్తుతం హార్దిక్ పాండ్య యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఉంటున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీకి చెందిన టీమ్ ఇది. ముంబై ఇండియన్స్ టీమ్ ఫ్రాంఛైజీగా నీతా అంబానీ వ్యవహరిస్తున్నారు.

హార్దిక్ పాండ్యాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పరిమళ్ నత్వానీ కూడా ఉన్నారు. పాండ్యాకు బర్త్‌డే విషెస్ తెలుపుతూ అతనితో కలిసి దిగిన ఓ ఫొటోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను అందుకోవాలని అభిలాషించారు. ముంబై ఇండియన్స్‌తో పాటు టీమిండియాలో సరికొత్త రికార్డులను నెలకొల్పాలని అకాంక్షించారు పరిమళ్ నత్వానీ. క్రికెట్‌పై తనకు ఉన్న ఆసక్తిని చాటుకున్నారు. ముంబై ఇండియన్స్‌ను తన సొంత టీమ్‌గా భావిస్తారాయన.

ముఖేష్ అంబానీకి పరిమళ్ నత్వానీ అత్యంత సన్నిహితుడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కార్పొరేట్ వ్యవహారాల డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. తన మిత్రుడికి రాజ్యసభ సభ్యత్వాన్ని కల్పించాలని కోరుతూ స్వయంగా ముఖేష్ అంబానీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అంబానీ విజ్ఙప్తిని వైఎస్ జగన్ కాదనలేకపోయారు. పరిమళ్ నత్వానీకి తమ పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చి, రాజ్యసభకు పంపించారు. ఆరేళ్ల పాటు ఆయన వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు. తన సొంత సంస్థకు చెందిన జట్టే కావడం వల్ల ముంబై ఇండియన్స్‌‌ క్రికెటర్లతో నత్వానీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

IPL 2020: YSRCP MP Parimal Nathwani greets to Hardik Pandya on his birthday

Recommended Video

IPL 2020 : Kagiso Rabada Breaks Vinay Kumar's IPL Record | Oneindia Telugu

ఈ ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్ వరుసగా ఘన విజయాలను సాధిస్తోన్న విషయం తెలిసిందే. పాయింట్ల పట్టికలో ఆ జట్టు రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లను ఆడిన రోహిత్ శర్మ టీమ్ నాలుగింట్లో విజయం సాధించింది. ఎనిమిది పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. ప్లేఆఫ్ బెర్తును ఖాయం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ముంబై ఇండియన్స్ ఘన విజయాలను సాధించడంలో హార్దిక్ పాండ్యా కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఆరు మ్యాచ్‌లను ఆడిన అతను 135 పరుగులు చేశాడు.

English summary
YSR Congress Party Rajya Sabha member Parimal Nathwani have greets to team india all rounder and Mumbai Indians player Hardik Pandya on his birthday. Parimal Nathwani post his Photo along with Hardik Pandya his twitter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X