హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

థాయిలాండ్ యాత్రకు ఐఆర్‌సీటీసీ శ్రీకారం, రైల్వేల్లో రూ.4 వేల కోట్ల కుంభకోణం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారతీయ రైల్వే ఆధ్వర్యంలో ఐఆర్‌సీటీసీ సరికొత్త పర్యాటకానికి శ్రీకారం చుట్టింది. జమ్మూ-శ్రీనగర్, డార్జిలింగ్, గ్యాంగటక్ ప్రాంతాలకు పర్యాటకులను తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నాలుగు రాత్రుళ్లు, ఐదు పగళ్లు ఉండే థాయిలాండ్ యాత్రకు ఐఆర్‌సీటీసీ తీసుకెళ్లనుంది.

ఇప్పటికే ఒకసారి థాయిలాండ్ పర్యటనను విజయవంతం చేసిన ఐఆర్‌సీటీసీ మరోసారి హైదరాబాద్ నుంచి ఈ నెల 23న థాయిలాండ్ యాత్రను ప్రారంభిస్తోంది. ఇందుకు గాను రూ. 40,000 చెల్లించాల్సి ఉంటుంది.
పూర్తి వివరాలకు 040-27702407, 9701360647/671/697 బేగంపేటలోని ఐఆర్‌సీటీసీ కార్యాలయ నంబరు 040-23400606, విజయవాడ 0866-2572280, తిరుపతి 0877-2222010 నంబర్లను సంప్రదించవచ్చు.

రైల్వేల్లో రూ.4 వేల కోట్ల కుంభకోణం:

IRCTC SCR Zone launches Thailand tour package

భారతీయ రైల్వేల్లో మరో కుంభకోణం వెలుగుచూసింది. 2012-13 కాలంలో సరుకుల రవాణాలో రూ.4 వేల కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు సీబీఐ అనుమానిస్తోంది. సరుకులతో కూడిన వ్యాగన్‌ బరువు పరిమితికి మించి ఉన్నా.. నిర్దేశిత బరువులోపే ఉన్నట్లు తప్పుడు రిపోర్టింగ్‌ ఇస్తూ ఈ కుంభకోణానికి పాల్పడినట్లు సీబీఐ గుర్తించింది.

రైల్వే వ్యాగన్ల ద్వారా సరుకులు రవాణా చేస్తున్నప్పుడు బండి ప్రారంభమయ్యే స్టేషన్‌లోగానీ, మార్గం మధ్యలోగానీ, లేదా గమ్యస్థానానికి చేరుకున్నాకగానీ వ్యాగన్‌ బరువును చూడాలి. రెవెన్యూ లీకేజీని అరికట్టడంతోపాటు వ్యాగన్లలో ఓవర్‌ లోడు వేయకుండా చూడడానికి ఇలా చెక్‌ చేయాల్సి ఉంటుంది.

కానీ, ఓవర్‌ లోడును తగ్గించి చూపేలా, పరిమిత స్థాయిలోనే వ్యాగన్‌ బరువు ఉన్నట్లు తెలిపేలా... బరువు చూసే పరికరాల్లో మార్పులు చేసినట్లు సీబీఐకి తన నివేదికలో పేర్కొంది. 2012-13 కాలంలో 1,008 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల సరుకుల రవాణా ద్వారా రైల్వేలకు 85,262 కోట్ల ఆదాయం వచ్చింది. మొత్తం సరుకుల బరువులో 5 శాతం మేరకు తగ్గించి చూపినా... ప్రభుత్వానికి రూ.4,263 కోట్ల నష్టం వస్తుందని సీబీఐ అధికారులు అంటున్నారు.

English summary
Buoyed by the success of their rail tour packages, Indian Railway Catering and Tourism Corporation (IRCTC) under South Central Railway Zone has announced its maiden outbound tour package to Thailand, this season.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X