తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి సులువైన ఉపాయం
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి సులువైన ఉపాయాన్ని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అందిస్తోంది. దీనివల్ల దర్శనం ఎలా అనే చింత అవసరంలేదు. వెళ్లి రావడానికి రైల్వే టికెట్లు కూడా IRCTC అందిస్తుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంది. పార్కింగ్ ఛార్జీలతోపాటు టోల్ చార్జీలు కూడా ఐఆర్సీటీసీ చూసుకుంటుంది. విమానంలో వెళ్లిరావడానికి కూడా ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు. స్వామివారి దర్శనానికి పురుషులు, మహిళలు కచ్చితంగా సంప్రాదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది.
రైలుద్వారా రెండు రాత్రులు, మూడు పగళ్లు ప్రయాణం ఉంటుంది. 12734 నెంబరు రైలుద్వారా గుంటూరు, లింగంపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. అలాగే దిగొచ్చు. వచ్చే నెల ఐదోతేదీన ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ ధర రూ.3800. పూర్వసంధ్య పేరుతో ఐఆర్సీటీసీ మరో ప్యాకేజీ అందిస్తోంది. దీనిలో శ్రీకాళహస్తి, కాణిపాకం, తిరుచానూరు, శ్రీనివాస మంగాపురం ఆలయాలను దర్శించుకోవచ్చు. నాలుగు పగళ్లు, మూడు రాత్రులు ప్రయాణం ఉంటుంది. 12734 నెంబరు రైలు అందుబాటులో ఉంటుంది. లింగంపల్లి, సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు స్టేషన్లలో రైలు ఎక్కొచ్చు. దీనికి కూడా వచ్చే నెల ఐదోతేదీ నుంచి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ ధర రూ.5660గా ఉంది. పూర్తి సమాచారం కోసం ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ ను సంప్రదించాలి.

ఐఆర్‌సీటీసీ 'తిరుపతి బాలాజీ దర్శనం' ప్యాకేజీని అందిస్తోంది. ఇది రెండురోజుల్లోనే పూర్తవుతుంది. హైదరాబాద్ నుంచి 6E-2005 విమానంలో ప్రయాణించి రేణిగుంట చేరుకుంటారు. బస్సు మార్గంలో కాణిపాకం, శ్రీకాళహస్తి, శ్రీనివాసమంగాపురం, తిరుచానూరు ఆలయాల దర్శనం ఉంటుంది. ఏప్రిల్ 11, 18, 25, 29 తేదీల ప్రయాణానికి టికెట్లు అందుబాటులో ఉన్నాయి. టికెట్ ప్రారంభ ధర రూ.15వేలు.












Click it and Unblock the Notifications