వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పనిచేయకుండా గడ్డి పీకుతున్నారా?: కాంట్రాక్టర్లకు దేవినేని 'క్లాస్'

పనుల్లో జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పనులు పూర్తి చేయకుండా గడ్డి పీకుతున్నారా? అంటూ కాంట్రాక్టర్లను మందలించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ప్రభుత్వ ప్రాజెక్టుల పట్ల అలసత్వం వహించే కాంట్రాక్టర్లపై కన్నెర్ర చేస్తున్నారు ఏపీ నీటి పారుదల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. పనుల్లో జాప్యాన్ని ఎండగడుతూ కాంట్రాక్టర్లకు దేవినేని 'క్లాస్' ఇచ్చారు. తీరు మార్చుకోకపోతే బ్లాక్ లిస్టులో పెట్టేస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారు.

ఉత్తరాంధ్రలోని సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి దేవినేని కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పనుల్లో జాప్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పనులు పూర్తి చేయకుండా గడ్డి పీకుతున్నారా? అంటూ కాంట్రాక్టర్లను మందలించారు. ఒక పని చేస్తున్నామంటే.. దానిపై శ్రద్ద, పట్టుదల, పౌరుషం ఉండాలన్నారు.

Irigation minister Devineni Uma strong warning to contractors

ప్రాజెక్టులు సమయానికి పూర్తి చేయాలన్న కసితో పనిచేయాలని కాంట్రాక్టర్లకు హితవు పలికారు. మరోసారి ఇదే తరహాలో వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని వారిని హెచ్చరించారు దేవినేని. పనితీరు మార్చుకోకపోతే బ్లాక్ లిస్టులో పెట్టడం ఖాయమని చెప్పారు.

పనులు త్వరగా పూర్తి చేయాలని.. అలా అని నాణ్యతను గాలికొదిలేస్తే సహించేది లేదని కాంట్రాక్టర్లను దేవినేని హెచ్చరించారు. ఎక్కడా నాణ్యతా లోపాలనేవి లేకుండా.. పూర్తి క్వాలిటీతో ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూచించారు.

English summary
Irigation Minister Devineni Uma Maheshwara Rao conducted a review meet with contractors. He warned them strongly to complete projects as soon as possible with good quality
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X