వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిసైడ్ చేసేశారట?: ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు?..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేరు ఖరారైనట్టుగా తెలుస్తోంది. రేసులో మాణిక్యాలరావు పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ.. చివరకు సోము వీర్రాజు వైపే అధిష్టానం మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. శుక్రవారం నాడు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం.

Recommended Video

టీడీపీ అంటే తెలుగు 'డ్రామా' పార్టీ, అవినీతిని తవ్వడానికి బుల్డోజర్ కావాలి

ఆర్ఎస్ఎస్ నేపథ్యం.. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సోము వీర్రాజుకు కలిసొచ్చాయని అంటున్నారు. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవంతో పాటు, పార్టీ పట్ల విధేయుడిగా ఉండటం పార్టీ పెద్దలను ఆకర్షించిందంటున్నారు. దూకుడైన శైలితో వ్యవహరించే సోము వీర్రాజు తొలి నుంచి టీడీపీపై కూడా ఎటాక్ చేస్తూ వస్తున్నారు. మిత్రపక్షమైనా చంద్రబాబును టార్గెట్ చేయడానికి కూడా ఆయనే మాత్రం వెనుకాడలేదు.

Somu veerraju

సందర్భం వచ్చిన ప్రతీసారి బీజేపీపై టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. అసలైన దోషి టీడీపీయే అంటూ మీడియా ముందు పలుమార్లు ఆరోపణలు చేశారు. అలా టీడీపీ ఆరోపణలను సమర్థవంతంగా తిప్పికొట్టడంలోనూ సోము వీర్రాజు మిగతా వారికంటే ముందున్నారని అధిష్టానం భావించినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి ఇటీవలే హరిబాబు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక రేపో మాపో సోము వీర్రాజు అధ్యక్ష స్థానంలోకి వెళ్తారని అంటున్నారు.

English summary
It's an interesting speculation that MLC Somu Veerraju may going to take charge as state party president. According to the sources, BJP high command already taken a decision on this appointment
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X