వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపోమాపో చంద్రబాబుకు నోటీసులు? టీడీపీలో కలకలం: పవన్-జగన్‌ను లాగి...

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు, కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం దోస్తీ నేపథ్యంలో తెరపైకి షాకింగ్ విషయం వచ్చింది. అది చంద్రబాబుకు నోటీసులు. ఏపీ సీఎంకు రేపో, మాపో కేంద్రం నుంచి నోటీసులు వచ్చే అవకాశముందని అంటున్నారని స్వయంగా టీడీపీ నేతలే అంటున్నారు.

చదవండి: కేసీఆర్ తర్వాత తెలంగాణలో ఏపీ సీఎం రికార్డ్!: చంద్రబాబుకు ఉత్తమ్ 15 సీట్లు ఆఫర్

నటుడు శివాజీ, టీడీపీ నేతలు వర్ల రామయ్య, యనమల రామకృష్ణుడులతో పాటు తెలంగాణ టీడీపీ భేటీలో చంద్రబాబు కూడా ఇందుకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు. వారు నేరుగా మాట్లాడగా, చంద్రబాబు మాత్రం పరోక్షంగా మాట్లాడారు. చంద్రబాబుకు నోటీసులు వస్తాయని జోరుగా ప్రచారం సాగుతోందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: తెలంగాణపై చంద్రబాబు 'బిగ్' ప్లాన్: కాంగ్రెస్ గెలిస్తే అధికారంలోను భాగస్వామ్యం

ఓ వైపు జగన్, మరోవైపు వవన్.. రాజకీయ క్రీడ

ఓ వైపు జగన్, మరోవైపు వవన్.. రాజకీయ క్రీడ

ఓ వైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లతో బీజేపీ రాజకీయక్రీడకు తెరలేపిందని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. నోటీసులు వస్తాయని బీజేపీ నేతలే చెబుతున్నారని అన్నారు. నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలపై తాము పోరాటం ప్రారంభించామని చెప్పారు. తమ వ్యతిరేక పార్టీలను కేంద్రం వేధిస్తోందన్నారు.

కొత్త పార్టీలు పెట్టిస్తూ, కొత్త వ్యక్తులు తెరపైకి

కొత్త పార్టీలు పెట్టిస్తూ, కొత్త వ్యక్తులు తెరపైకి

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి వ్యక్తుల ద్వారా తప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారని యనమల అన్నారు. చంద్రబాబును నేరుగా రాజకీయంగా ఎదుర్కోలేక కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు. కొత్త పార్టీలను పెట్టిస్తున్నారని, కొత్త వ్యక్తులను తెరపైకి తీసుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. మోడీ, అమిత్ షాలు కలిసి చంద్రబాబును సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

అసమర్థ పవన్, అవినీతి జగన్

అసమర్థ పవన్, అవినీతి జగన్

ఎవరు ఎన్ని ఆపరేషన్ గరుడలు తెచ్చినా ఏం చేయలేరని వర్ల రామయ్య అన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకొని అణగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అసమర్థ నేత పవన్ కళ్యాణ్, అవినీతి నతే జగన్‌తో కలిసి బీజేపీ తమపై కక్ష సాధిస్తోందన్నారు. ఎవరు కూడా చంద్రబాబును తాకలేరన్నారు.

చంద్రబాబు కూడా కీలక వ్యాఖ్యలు, ఎందుకు, నిజమెంత?

చంద్రబాబు కూడా కీలక వ్యాఖ్యలు, ఎందుకు, నిజమెంత?

మరోవైపు, తెలంగాణ టీడీపీ సమావేశంలో చంద్రబాబు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తమ వ్యతిరేకులపై సీబీఐ, ఐటీ, ఈడీలను ప్రయోగిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటనే చర్చ సాగుతోంది. శివాజీ, వర్ల, యనమల చెబుతున్న ఆపరేషన్ గరుడ, నోటీసులు నిజమేనా అనే చర్చ సాగుతోంది. ఇందులో నిజమెంత ఉందో అర్థం కావడం లేదని అంటున్నారు. అయితే శివాజీ, వర్ల, యనమల, చంద్రబాబులు మాట్లాడటంతో టీడీపీ వ్యూహాత్మకంగా ఇలా వ్యవహరిస్తోందా అనే చర్చ కూడా సాగుతోంది. అది నిజమే అయితే నోటీసులు ఎందుకు ఇస్తుంది, ఏ అంశానికి సంబంధించి ఇస్తుందనే దానిపై కూడా చర్చ సాగుతోంది.

English summary
It is said that Telugudesam Party leaders saying that BJP is trying to send notices to Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X