వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇవాంకను ఎపికి రప్పించాలని చంద్రబాబు ప్రయత్నించారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

అమరావతి: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు, సలహాదారు ఇవాంక ట్రంప్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్టానికి రప్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నించి విపలమయ్యారనే వార్తలు వస్తున్నాయి. హైదరాబాదుల జరిగే గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్ (జిఈఎస్)కు ఆమె హాజరవుతున్న విషయం తెలిసిందే.

Recommended Video

Ivanka Trump in Hyderabad : Security beefed up in Hyderabad

ఈ సందర్భంగా ఆమెను ఆంధ్రప్రదేశ్‌కు రప్పించాలని చంద్రబాబు ప్రయత్నించినట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయాన్ని ఓ అధికారి తెలిపినట్లు ప్రముఖ వార్తా సంస్థ ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి బోర్డు (ఈడిబి) ముఖ్య కార్యదర్శి జె. కృష్ణ కిశోర్ అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

Ivanka Trump

ఇవాంక ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తే అమరావతి లేదా విశాఖపట్నంలో ప్రత్యేక ఈవెంట్‌ను కూడా నిర్వహిస్తామని ఆమెరికా కాన్సులేట్‌కు చెప్పినట్లు సమాచారం. అయితే, అందుకు అమెరికా ప్రభుత్వం అంగీరించలేదని అంటున్నారు

జిఈఎస్‌కు హాజరు కావడం తప్ప మరెక్కడ కూడా ఇవాంక పర్యటించబోరని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇవాంక పర్యటిస్తే అమెరికా కంపెనీలు ఎపిలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారని ప్రభుత్వం ఆశించింది. కానీ అది ఫలించలేదు.

English summary
It is said that Andhra Pradesh CM Nara Chandrababu Naidu failed to convince US to get Ivanka Trump's visit in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X