వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు పట్టుతప్పుతోందా: నేతల అసంతృప్తి సెగలు దేనికి సంకేతం?

తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. పార్టీలోఅధినేతను ధిక్కరించడానికి ఎవరూ సాహసించేవారు కాదు. కానీ, ఈ మద్య కాలంలో బహిరంగంగానే పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు విమర్శలకు దిగుతుండట

|
Google Oneindia TeluguNews

అమరావతి: తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. పార్టీలోఅధినేతను ధిక్కరించడానికి ఎవరూ సాహసించేవారు కాదు. కానీ, ఈ మద్య కాలంలో బహిరంగంగానే పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు విమర్శలకు దిగుతుండటం పార్టీ అధిష్టానానికి ఆందోళన కలిగించే అంశమే.

ఇటీవల మంత్రివర్గ విస్తరణలో పదవులు ఆశించి భంగపడిన పలువురు నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేయడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఏకంగా పార్టీ అధినేత బుజ్జగిస్తే తప్ప వారు శాంతించకపోవడం గమనార్హం. ఇంతకుముందు టీడీపీలో ఇలా ఉండేది కాదు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి అసంతృప్తి ఉన్నా.. బహిరంగంగా విమర్శించేవారు కాదు.

కేశినేని నాని

కేశినేని నాని

విజయవాడ రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన గొడవ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, కేశినేని నాని, బోండా ఉమ క్షమాపణలతో వివాదం సద్దుమణిగింది. కానీ అనంతరం నాని మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నామనే పేరు తప్పా.. అధికారులెవ్వరూ తమ మాట వినే పరిస్థితి లేకుండా పోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, విజయవాడ రవాణాశాఖ కార్యాలయంలో అధికారులపై గొడవ జరిగిన తీరు పట్ల టిడిపి అధినేత చంద్రబాబునాయుడు విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్ రావులపై సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొంత అసంతృప్తికి గురైన కేశినేని నాని.. ఆ తర్వాత తన ట్రావెల్స్‌ను రద్దు చేస్తున్నట్లు సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.

బోండా ఉమామహేహశ్వరరావు

బోండా ఉమామహేహశ్వరరావు

తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో తెలుగుదేశం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనకు మంత్రి పదవి రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించానని, అధిష్టానం మాత్రం తమను పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ తర్వాత కొంత శాంతించారు.
చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రివర్గంలో స్థానం రానందుకు తాను చాలా బాధపడ్డానని చెప్పారు. తాను చంద్రబాబు ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని చెప్పారు. భవిష్యత్తులో తనకు న్యాయం జరుగుతుందని నమ్ముతున్నానని చెప్పారు. కాగా, బొండా ఉమా కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అంతకుముందు ప్రకటించారు. మంత్రి పదవి రాకపోవడంతో అలకబూనిన ఆయనకు మద్దతుగా స్థానిక కార్పొరేటర్లు కూడా రాజీనామా చేస్తామని ప్రకటించారు. దీంతో ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణలు ఆయన్ను బుజ్జగించి సీఎం వద్దకు తీసుకెళ్లారు. ఆ తర్వాత బోండా శాంతించారు.

ధూళిపాళ్ల నరేంద్ర

ధూళిపాళ్ల నరేంద్ర

మంత్రివర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించి భంగపడిన వారిలో సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా ఉన్నారు. పార్టీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎప్పుడూ పార్టీ వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడలేదని, పార్టీకి ఎంతో అండగా ఉన్నానని.. అయినా పార్టీ అధిష్టానం తమను గుర్తించలేదని బహిరంగంగానే ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్నా గుర్తింపు లేదని విమర్శించారు. ఈ క్రమంలో పార్టీ జాతీయ నేత లోకేష్, అధినేత చంద్రబాబు కలగజేసుకుని వ్యక్తిగతంగా మాట్లాడటంతో ధూళిపాళ్ల వెనక్కుతగ్గారు.

పయ్యావుల కేశవ్

పయ్యావుల కేశవ్

మరో సీనియర్ నేత పయ్యావుల కేశవ్ కూడా మంత్రివర్గ విస్తరణలో తనకు పదవి లభిస్తుందని భంగపడ్డారు. ఈసారైనా తనకు మంత్రి పదవి తగ్గుతుందని భావించినా.. అలాంటిదేమీ జరగకపోవడంతో కొంత అసహనానికి గురయ్యారు పయ్యావుల. బహిరంగంగా తీవ్ర విమర్శలు చేయకపోయినప్పటికీ ఆయన తన అసంతృప్తిని అధిష్టానానికి తెలిసెలా చేశారు. దీంతో అధిష్టానం పయ్యావులను కూడా బుజ్జగించి తన దారికి తెచ్చుకుంది.

 గోరంట్ల బుచ్చయ్య చౌదరి

గోరంట్ల బుచ్చయ్య చౌదరి

పార్టీలో సీనియర్ నేత, కీలక నేతగా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కూడా మంత్రి పదవి దక్కలేదు. దీంతో ఆయన కూడా పార్టీపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పార్టీకి ఇన్నేళ్లు సేవ చేసిన సరైన గుర్తింపు లభించడం లేదని అన్నారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆర్థికంగా, రాజకీయంగా నష్టపోయారని గుర్తు చేస్తున్నారు. ఆ తర్వాత గోరంట్లకు కూడా అధిష్టానం నుంచి బుజ్జగింపులు వచ్చాయి. దీంతో ఆయన కూడా చల్లబడక తప్పలేదు.

రామసుబ్బారెడ్డి

రామసుబ్బారెడ్డి

ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టి.. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న తనను పక్కన పెట్టడంపై రామసుబ్బారెడ్డి కూడా అధిష్టానం తీవ్రంగానే స్పందించారు. పార్టీకి ఏళ్లుగా సేవ చేసిన వారిని వదిలే ఇప్పుడొచ్చిన వారికి పదవులు కట్టడం ఏంటని అధిష్టానాన్ని నిలదీశారు. రామసుబ్బారెడ్డికి కూడా టీడీపీ అధిష్టానం సర్దిచెప్పి పార్టీ మీ సేవలను తప్పక గుర్తిస్తుందని హామి ఇవ్వడంతో కొంత మెత్తబడ్డారు రామసుబ్బారెడ్డి.

చింతమనేని ప్రభాకర్

చింతమనేని ప్రభాకర్

తరచూ వివాదాల్లో ఉండే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తనకు మంత్రివర్గంలో పదవి లభించకపోవడంపై అధిష్టానంపై విరుచుకుపడ్డారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం దారుణమన్నట్లు వ్యవహరించారు. రాజీనామా చేసి తాను కొత్త పార్టీ పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అధినేతను కలిసిన క్రమంలో ఆయనే కొంత చల్లబడ్డారు.

శివప్రసాద్ విమర్శలతో తారస్థాయికి..

శివప్రసాద్ విమర్శలతో తారస్థాయికి..

తాజాగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే లేపాయి. దళితులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని, మంత్రివర్గంలో ఐదు పదవులు ఇవ్వాల్సి ఉండగా.. మూడింటితోనే సరిపెట్టారని విమర్శించారు. దళితులకు భూములు కేటాయించాలని కోరితే చంద్రబాబు నిరాకరించారని అన్నారు. రాజధాని కోసం దళితుల భూములు లాక్కుని వారిని కూలీలుగా మార్చారని మండిపడ్డారు. తాను చిన్నప్పటి నుంచీ చంద్రబాబుతో ఉన్నప్పటికీ.. పట్టించుకోవడం లేదని అన్నారు. తాను కుప్పం ఓట్లతో గెలవలేదని, 2019లో తాను పోటీ చేసేందుకు చాలా పార్టీలున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు పట్టుకోల్పుతున్నారా...?

చంద్రబాబు పట్టుకోల్పుతున్నారా...?

ఇలా వరుస పెట్టి నేతలు అధిష్టానంపై విరుచుకుపడుతుండటం దేనికి సంకేతమని పలువురు విశ్లేషిస్తున్నారు. చంద్రబాబునాయుడు పార్టీపై పట్టుకోల్పోతున్నారా? అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కానీ, ఈ నేతలు మొదట తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు, అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో వారు చల్లబటం టీడీపీకి కలిసివచ్చే అంశంగానే చెప్పవచ్చు. కానీ, శివప్రసాద్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు. శివప్రసాద్‌ను పిలిచి మాట్లాడి బుజ్జగిస్తారని అనుకున్నప్పటికీ.. ఆయన అలా చేయలేదు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్న శివప్రసాద్ బహిరంగంగా పార్టీ, ప్రభుత్వంపై విమర్శలు చేయడం పట్ల చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే వ్యక్తిగత ఎజెండాతో ముందుకెళ్లే వారిపై చర్యలు తప్పవని చంద్రబాబు ఘాటుగా హెచ్చరించడం గమనార్హం. ఏది ఎలావున్నా.. మొత్తానికి నేతల తీరును చూస్తుంటే క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న టీడీపీ కూడా పట్టుతప్పుతోందని చెప్పకతప్పదు.

English summary
According to political analyists-Andhra Pradesh CM and Telugudesam Party(TDP) Chief Chandrababu Naidu is losing control over party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X