వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూ.ఎన్టీఆర్‌కు బాబు సంకేతాలు, ముందుచూపు: హరికృష్ణకు కోపంవస్తే

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నటుడు జూనియర్ ఎన్టీఆర్, ఆయన తండ్రి నందమూరి హరికృష్ణను దూరం చేసుకోవద్దని భావిస్తున్నారా?

చదవండి: 'విదేశాల నుంచి వచ్చాక జగన్ ఏదో ఒకటి చేయాలిగా, జేసీ చెప్పినట్లు చేస్తాం'

ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరినీ దూరం చేసుకునే ఆలోచన ఆయనకు లేదా? అందుకే హరికృష్ణను మరోసారి పోలిట్ బ్యూరోలోకి తీసుకున్నారా? అనే చర్చ సాగుతోంది.

చదవండి: 'వైసిపి నేతలారా! వెంటనే పిచ్చాసుపత్రిలో చేర్పించండి, కంచె ఐలయ్యకు జగన్‌కు తేడా లేదు'

టిడిపి కార్యక్రమాల్లో చురుగ్గా లేని హరికృష్ణ

టిడిపి కార్యక్రమాల్లో చురుగ్గా లేని హరికృష్ణ

టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం టిడిపి పొలిట్ బ్యూరోలో నందమూరి హరికృష్ణను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శనివారం కొత్తగా ఏర్పటిన పోలిట్ బ్యూరోలోకి ఆయనను మళ్లీ తీసుకున్నారు. ఆయన గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా లేరు.

Recommended Video

Jai Lava Kusa Dialogues For Chandrababu జూ.ఎన్టీఆర్‌కు చంద్రబాబుకు లంకె | Oneindia Telugu
హరికృష్ణ అసంతృప్తి

హరికృష్ణ అసంతృప్తి

2014 ఎన్నికల సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వచ్చే విషయమై టిడిపి నేతలు ఆసక్తికర ప్రకటన చేశారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఎవరినీ ప్రచారానికి పిలవమని, ప్రచారం చేస్తామని ముందుకు వస్తే వద్దనమని చెప్పారు. నారా లోకేష్ టిడిపి వారసుడిగా ఎదుగుతుండటం హరికృష్ణ జీర్ణించుకోవడం లేదు. దీంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయినప్పటికీ పొలిట్ బ్యూరోలో కొనసాగించారు.

చంద్రబాబు ముందుచూపు... అనుకోనివి జరక్కుండా

చంద్రబాబు ముందుచూపు... అనుకోనివి జరక్కుండా

చంద్రబాబు ముందుచూపుతోనే హరికృష్ణను కొనసాగించారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరినీ దూరం చేసుకునే ఉద్దేశ్యం ఆయనకు లేదని అంటున్నారు. 2019 ఎన్నికలు మరో ఏడాదిన్నర మాత్రమే ఉన్న ఈ సమయంలో అనుకోనివి జరక్కుండా ఉండేందుకే ఆయన కొనసాగించారని అంటున్నారు.

హరికృష్ణకు కోపం వస్తే..

హరికృష్ణకు కోపం వస్తే..

చంద్రబాబు రాజకీయ కోణంలో ఆలోచించి హరికృష్ణను పక్కన పెట్టదల్చుకోలేదని చెబుతున్నారు. హరికృష్ణకు కోపం వస్తే ఆయన బయట విమర్శలు చేస్తే పార్టీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆలోచించారని అంటున్నారు. హరికృష్ణ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నప్పటికీ, లేనప్పటికీ పలు కారణాలతో ఆయనను పక్కన పెట్టలేదని అంటున్నారు.

జూ.ఎన్టీఆర్‌కు సంకేతాలు ఇచ్చారా?

జూ.ఎన్టీఆర్‌కు సంకేతాలు ఇచ్చారా?

హరికృష్ణను కొనసాగించడం ద్వారా చంద్రబాబు మరో సంకేతం కూడా ఇచ్చారని అంటున్నారు. హరికృష్ణ అయినా, జూనియర్ ఎన్టీఆర్ అయినా ఒకటే. కాబట్టి హరికృష్ణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా తాను ఎవరినీ దూరం చేసుకోదల్చుకోలేదని జూ.ఎన్టీఆర్‌కు సంకేతాలు పంపించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

మరో కొత్త తలనొప్పి వద్దనే

మరో కొత్త తలనొప్పి వద్దనే

నవ్యాంధ్ర ఏపీలో ఇప్పటికే చంద్రబాబు రాజధాని నుంచి ప్రతిపక్షం వరకు ఎన్నో వాటిని ఫేస్ చేస్తున్నారు. 2014లో మద్దతు పలికిన పవన్ కళ్యాణ్ దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మిత్రపక్షం బిజెపి ఎప్పుడు ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరో కొత్త తలనొప్పి వద్దనే చంద్రబాబు ఆలోచించారని అంటున్నారు.

English summary
TDP Supremo Chandrababu Naidu had announced the new Polit Bureau and Committees of TDP in Andhra Pradesh and Telangana. Everyone was eagerly waiting to see if Nandamuri Harikrishna who is not active in the party recently will get a renomination or not.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X