వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వేలు.. బాలకృష్ణకు బాబు బిగ్ షాక్?: పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్, బీజేపీకి దూరమే!

|
Google Oneindia TeluguNews

అనంతపురం: తన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో బాలయ్యకు ఇచ్చే అవకాశాలు తక్కువేనని అంటున్నారు.

పవన్‌తో టీడీపీ ఎమ్మెల్యే గంటన్నరపాటు భేటీ, జైళ్లో పెట్టినా: బాబుకూ జనసేనాని ఝలక్!పవన్‌తో టీడీపీ ఎమ్మెల్యే గంటన్నరపాటు భేటీ, జైళ్లో పెట్టినా: బాబుకూ జనసేనాని ఝలక్!

టీడీపీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే బాలకృష్ణకు టిక్కెట్ దక్కే అవకాశాలు అనుమానమేనని అంటున్నారు. అంతేకాదు, బాలకృష్ణను రాజకీయాల నుంచి కూడా పక్కన పెట్టాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలుస్తోందని పేర్కొంటున్నారు. బాలకృష్ణపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.

మళ్లీ.. ఎక్కడ చెడింది: పురంధేశ్వరి దిమ్మతిరిగే 'లెక్క', షాక్.. బాబుపై సోము వీర్రాజు ప్రశంస, కానీమళ్లీ.. ఎక్కడ చెడింది: పురంధేశ్వరి దిమ్మతిరిగే 'లెక్క', షాక్.. బాబుపై సోము వీర్రాజు ప్రశంస, కానీ

హిందూపురంలో టిడిపి వెనుకబడిందనే ప్రచారం

హిందూపురంలో టిడిపి వెనుకబడిందనే ప్రచారం

హిందూపురంలో టీడీపీ వెనుకబడిందనే ప్రచారం విస్తృతంగా సాగుతోందని పేర్కొంటున్నారు. ఈ కారణంతో బాలకృష్ణను ఈసారి పక్కన పెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు. హిందూపురం టిడిపికి పెట్టని కోట. అలాంటి చోటు నుంచి 2014లో బాలకృష్ణ పోటీ చేసి గెలుపొందారు.

 ఆశించినట్లుగా లేదని

ఆశించినట్లుగా లేదని

2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకొని నివేదికలు తెప్పించుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఆశించినట్లుగా లేదని చంద్రబాబు భావిస్తున్నారని అంటున్నారు.

 వారికి ఇదివరకే చంద్రబాబు హెచ్చరిక

వారికి ఇదివరకే చంద్రబాబు హెచ్చరిక

ఇటీవల టీడీపీ భేటీలోను చంద్రబాబు ఈ విషయం చెప్పారు. 120 నుంచి 130 స్థానాల్లో టీడీపీ పరిస్థితి బాగుందని, మిగతా చోట్ల ఆశించినట్లుగా లేదని, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు లేదా ఇంచార్జులు పద్ధతి మార్చుకోవాలని లేదంటే వారినే మార్చవలిసి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.

పవన్ కళ్యాణ్, బీజేపీ ఎఫెక్ట్, బాబు సర్వే నివేదికలు

పవన్ కళ్యాణ్, బీజేపీ ఎఫెక్ట్, బాబు సర్వే నివేదికలు

వచ్చే ఎన్నికల్లో టీడీపీ.. బీజేపీకి దూరమయ్యే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీకి అండగా ఉంటే అవకాశాలను కొట్టి పారేయలేం. ఈ నేపథ్యంలో బీజేపీ ఉంటే ఎలా లేకుంటే ఎలా, పవన్ మద్దతు తీసుకుంటే ఎలా లేకుంటే ఎలా అనే అంశాలపై చంద్రబాబు సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీకి దూరమై, పవన్‌తో కలిసి ఉండటమే మంచిదని చంద్రబాబు, టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇటీవల బీజేపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం చూస్తున్నా తెగతెంపుల దిశగా కనిపిస్తోంది. పురంధేశ్వరి, సోము వీర్రాజు వంటి నేతలు టీడీపీపై నిప్పులు చెరిగారు. ప్రతిగా ఆదివారం టీడీపీ నేతలు సుజయ కృష్ణ రంగారావు, గంటా శ్రీనివాస రావు, నారాయణలు కూడా కౌంటర్ ఇచ్చారు.

Recommended Video

సర్వేలు: జగన్‌కు, చంద్రబాబుకు షాక్
 లీకులు ఇస్తున్నారా?

లీకులు ఇస్తున్నారా?

దాదాపు నలభై నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి బాగా లేదని చంద్రబాబుకు అందిన నివేదికలు చెబుతున్నాయని, అందులో బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం కూడా ఉందని అంటున్నారు. ఈసారి అక్కడ బాలకృష్ణ పోటీ చేస్తే ఓటమి ఖాయమని విధంగా లీకులు వస్తున్నాయని అంటున్నారు. దీనికి బాలకృష్ణ నియోజకవర్గంలో అందుబాటులో ఉండకపోవడమే కారణమని చెబుతున్నారట. ఇతర నాయకులకు బాధ్యతలు అప్పగించి ఆయన అప్పుడప్పుడు నియోజకవర్గానికి వస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్యకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చే విషయంలో చంద్రబాబు సీరియస్‌గానే ఉన్నారని అంటున్నారు. మరో ప్రచారం కూడా సాగుతోంది.

బాలకృష్ణ క్రియాశీలక రాజకీయాల్లో ఉంటే లోకేష్‌కు అడ్డంకిగా మారుతారని పొమ్మనలేక పొగపెడుతున్నారని పేర్కొంటున్నారు. అయితే, నారా లోకేష్ మేనల్లుడు. స్వయానా కూతురు భర్త. కాబట్టి తన అల్లుడు ఎదుగుదలకు బాలకృష్ణ అడ్డుగా మారుతారనే ప్రచారం అంతా వట్టిదేనని, కొందరు చేస్తున్న వట్టి ప్రచారమని అంటున్నారు.

English summary
It is said that Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu unhappy with Hindupur MLA Nandamuri Balakrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X