వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ సూచన సీఎం పాటిస్తారా: ముఖ్యమంత్రి చెబుతున్నదేమిటి!

|
Google Oneindia TeluguNews

సీఎం జగన్ వర్సెస్ జనసేన అధినేత పవన్. గత కొన్నేళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్న వ్యవహారమే. 2014 ఎన్నికల నాటి నుండి చంద్రబాబు కు అనుకూలంగా..జగన్ కు వ్యతిరేకంగా పవన్ వ్యవహిస్తూ వచ్చారు. ఇక, 2017లో చంద్రబాబు..లోకేశ్ కు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలు పెట్టారు. అయితే జగన్ పాదయాత్రం సమయంలోనూ..ముఖ్యమంత్రి అయిన తరువాత జనసేన అధినేత పవన్ కళ్యాన్ ను ఏనాడు పార్టీ అధినేతగా..లేదా రాజకీయ నేతగా పిలవలేదు. పవన్ పైన స్పందించిన ప్రతీ సందర్బంలోనూ యాక్టర్ అంటూ లేదా చంద్రబాబు పార్టనర్ అంటూ మాత్రమే సంబోధించేవారు.

ఇక, పవన్ సైతం జగన్ ను ముఖ్యమంత్రి అని సంబోధించటం లేదు. జగన్ రెడ్డి అని పిలుస్తున్నారు. దీంతో.. వైసీపీ నేతలు కొత్తగా పవన్ నాయుడు అని పిలవటం మొదలు పెట్టారు. తాజాగా..తాను జగన్ రెడ్డి అని పిలవటం వెనుక కారణం పవన్ బయట పెట్టారు. తాము ముఖ్యమంత్రి అని గౌరవంగా పిలవాలంటే ఏం చేయాలో స్పష్టం చేసారు. మరి..పవన్ సూచన జగన్ అమలు చేస్తారా. అసలు..పార్టీ నేతలతో పవన్ గురించి జగన్ వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఏంటి..

2014 నుండి ఇద్దరి మధ్య అదే తీరుగా..

2014 నుండి ఇద్దరి మధ్య అదే తీరుగా..

2014 ఎన్నికల నుండి జగన్..పవన్ మధ్య రాజకీయంగా పోరు కొనసాగుతూనే ఉంది. ఆ ఎన్నికల్లో టీడీపీ..బీజేపీకి మద్దతుగా ప్రచారం చేసిన పవన్..నాడు జగన అక్రమాస్తుల కేసుల గురించి ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. అయితే, వైసీపీ మాత్రం పవన్ విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ ఆ ఎన్నికల్లో అసలు పవన్ విమర్శలకు సమాధానం చెప్పలేదు.

అదే విధంగా పవన్ పైనా విమర్శ లు చేయలేదు. కేవలం షర్మిళ మాత్రం ఒకటి ..రెండు సార్లు మాత్రం పవన్ మీద ఫైర్ అయ్యారు. ఇక, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వైసీసీ స్టాండ్ మార్చింది. చంద్రబాబు పైన విమర్శలు చేసే సమయంలో ప్రశ్నిస్తానంటూ పదే పదే చెప్పే.. పవన్ ఏమయ్యారంటూ వైసీపీ నేతలు నిలదీసారు. జనసేన పార్టీ కార్యక్రమాలు రాజకీయంగా యాక్టివ్ కావటంతో పవన్ కళ్యాన్..ఇక, తాను చంద్రబాబుకు అనుకూలంగా పని చేస్తున్నానే ముద్ర తొలిగించుకొనే ప్రయత్నం చేసారు. అందులో భాగంగానే..2017 జనసేన ప్లీనరీలో ఒక్క సారిగా చంద్రబాబు..లోకేశ్ లక్ష్యంగా పవన్ ఫైర్ అయ్యారు. దీని ద్వారా పవన్..టీడీపీ మధ్య గ్యాప్ ప్రారంభమైంది.

యాక్టర్..పార్టనర్ అంటూ..

యాక్టర్..పార్టనర్ అంటూ..

ఇక..చంద్రబాబు..పవన్ కళ్యాన్ లక్ష్యంగా జగన్ వేగంగా పావులు కదిపారు. పదే పదే చంద్రబాబు తప్పులను ఎత్తి చూపుతూ..పవన్ సైతం ఇందులో భాగస్వామి అంటూ.. ఆయనను డామేజ్ చేసే ప్రయత్నం చేసారు. చంద్రబాబు..పవన్ మధ్య గ్యాప్ మొదలైన తరువాత జగన్ మరింత యాక్టివ్ అయ్యారు. జగన్ 2019 ఎన్నికల ముందు దాదాపు 14 నెలల పాటు చేసిన పాదయాత్రలో పవన్ ను ఏనాడు జనసేన అధినేత గా..లేదా రాజకీయ నేతగా ప్రస్తావించలేదు.

చంద్రబాబు పైన పవన్ విమర్శలు చేస్తున్నా.. రహస్య మిత్రుడు అంటూ విమర్శించేవారు. వారిద్దరూ విడివిడిగా ఉంటూ..కలిసే పని చేస్తున్నారని జోరుగా ప్రచారం చేసారు. ఇదే ఎన్నికల్లో ప్రభావం చూపించిందని..జనసేనతో సహా టీడీపీ ఎన్నికల సమీక్షల్లో కార్యకర్తలు అధినేతల వద్ద ప్రస్తావించారు. ఇక, పవన్ వివాహాల గురించి ప్రస్తావించి పవన్ ను డామేజ్ చేయాలని జగన్ ప్రయత్నం చేయటం..అదే సమయంలో వ్యక్తిగత అంశాన్ని ప్రస్తావించారంటూ పవన్ సైతం తీవ్రంగా ప్రతిస్పందించటంతో రాజకీయంగా నష్టం జరుగుతుందనే ఆందోళన వైసీపీలోనూ మొదలైంది. అయితే, అప్పుడూ..ఇప్పడూ జగన్ మాత్రం తన స్టాండ్ మార్చుకోలేదు. పవన్ ను కేవలం యాక్టర్ గా మాత్రమే పరిగణిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు.

జగన్ రెడ్డి గారు..అంటూనే పవన్ సూచన

జగన్ రెడ్డి గారు..అంటూనే పవన్ సూచన

తాను ముఖ్యమంత్రిని గౌరవంగా పిలవాలంటే..ఆయన కొంత మందికే ముఖ్యమంత్రిగా కాకుండా..వైసీపీ నేతల ప్రయోజనాల కోసమే కాకుండా అందరి సంక్షేమం కోసం పని చేస్తే ముఖ్యమంత్రి అంటూ పిలుస్తానని స్పష్టం చేసారు. అప్పటి వరకూ జగన్ రెడ్డి అనే పిలుస్తానని తేల్చి చెప్పారు. జగన్ రెడ్డి అంటూ పవన్ పిలవటంతో వైసీపీ నేతలు పవన్ నాయుడు అంటూ కొత్తగా పిలవటం ప్రారంభించారు.

దీనికిప పవన్ స్పందించారు. అనేక పార్టీల నేతలతో పాటుగా జాతీయ మీడియా సైతం అదే విధంగా జగన్ రెడ్డి అనే పిలుస్తారని చెప్పుకొచ్చారు. తనను పవన్ నాయుడు అని పిలవటం నవ్వు తెప్పించిందని చెప్పారు. అయితే, తాజాగా పవన్ తాను చేసిన సూచన జగన్ పాటిస్తే..తాను ముఖ్యమంత్రి అని పిలుస్తానని..అప్పటి వరకు తన మాట మారదని స్పష్టం చేసారు.

జగన్ చెబుతున్నదేంటంటే..

జగన్ చెబుతున్నదేంటంటే..

ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికీ పవన్ ను రాజకీయ నేతగా గుర్తించటం లేదని ఆ పార్టీ నేతలు చెబతుున్నారు. ఆయన పార్టీ అధినేతగా ఉండి..చంద్రబాబు డైరెక్షన్ లో నడుస్తున్నారని అందుకే ఆయన్ను ఒక పార్టీ అధినేతగా గుర్తించటం లేదనేది వారి వాదన. ఇదే సమయంలో..పవన్ ను ముఖ్యమంత్రి కేవల్ ఒక సినిమా యాక్టర్ గా మాత్రమే గుర్తిస్తున్నారని సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

ఆయన చంద్రబాబు పార్టనర్ గా ఇప్పటికీ..వ్యవహరిస్తున్నారని..స్వతంత్రంగా నడుచుకోలేకపోతున్నారని ఆరోపిస్తున్నారు. దీని ద్వారా..ముఖ్యమంత్రి అసలు పవన్ ను పొలిటీషీయన్ గా కంటే సినిమా యాక్టర్ గానే పిలుస్తూ.. మైండ్ గేమ్ అడుతున్నారని విశ్లేషకుల అభిప్రాయంగా కనిపిస్తోంది. దీని ద్వారా పవన్ ఏమని పిలిచినా తమ వైఖరి ఇదే అనే విధంగా వైసీపీ నేతలు చెబుతున్నారు. గతంలో అనేక చర్చల సమయంలో పవన్ పూర్తిగా చంద్రబాబు మనిషి అని..ఆయన నమ్మదగిన వ్యక్తి కాదని వ్యాఖ్యానించినట్లు సీనియర్ నేతలు గతంలో జరిగిన చర్చలను గుర్తు చేసుకుంటున్నారు. దీని ద్వారా..అటు జగన్..ఇటు పవన్ ఇద్దరూ ఇదే రకంగా సంబోధించటం కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

English summary
Cm jagan and Pawan Kalyan created new discussion on calling their names and status. Pawan clarified that upto jagan change his attitude he called his as Jagan Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X