వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ కేంద్ర బ‌ల‌గాలు తెచ్చుకోవాలా : వివాదానికి తెర తీస్తున్న టిడిపి నేత‌లు..!

|
Google Oneindia TeluguNews

నాడు రాహుల్‌..నేడు ప్ర‌ధాని మోదీ. అప్పుడు రాహుల్ స‌భ‌కు ఎవ‌రూ వెళ్ల‌ద్దు..నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయండి...ఇదీ నాడు టిడిపి ఇచ్చిన పిలుపు. ఇప్పుడు స‌రిగ్గా అదే విధంగా..ప్ర‌ధాని మోదీ ఏపి ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోవాల‌ని పిలుపు. ఏకంగా ముఖ్య‌మంత్రి నిర‌స‌న‌. మోదీ స‌భ‌ను అడ్డుకుంటామ‌ని ఏకంగా మంత్రి హెచ్చిర‌క‌...అధికార పార్టీనే ప్ర‌ధాని మోదీని అడ్డుకుంటామంటే..ఎలాంటి సంకేతాలు ఇస్తున్న‌ట్లు...

ఏపి అధికార పార్టీ - ప్ర‌ధాని మోదీ మ‌ధ్య కొద్ది రోజులుగా ఓపెన్ పొలిటిక‌ల్ వార్ జ‌రుగుతోంది. ఇది ఇప్పుడు ప‌తాక స్థాయికి చేరింది. మోదీ వ‌ర్సెస్ చంద్ర‌బాబు గా రాజ‌కీయాలు మారుతున్నాయి. ఏపిలోనే కాదు..జాతీయ రాజ‌కీయాల్లో నూ..బిజెపి వ్య‌తిరేక కూటమిని బ‌లోపేతం చేయ‌టంలో చంద్ర‌బాబు చొర‌వ చూపిస్తున్నారు. ఇక‌, ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాని మోదీ పార్టీ ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొనేందుకు ఏపికి వ‌స్తున్నారు. జ‌న‌వ‌రి 6న గుంటూరు స‌మీ పం లో ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆయ‌న పాల్గొంటారు. ప్ర‌ధాని మోదీ పై ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన విమ‌ర్శ‌ల‌కు నేరుగా ఆయ‌నే స‌మాధానం ఇస్తార‌ని బిజెపి నేత‌లు చెబుతున్నారు. అయితే, ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాని స‌భ‌కు గైర్హాజ‌రు కావ ట‌మే..నిస‌మైన నిర‌స‌న అని సీయం పిలుపునిచ్చారు. ఏకంగా మంత్రి ఆనంద్‌బాబు తాము ప్ర‌ధాని స‌భ‌ను అడ్డుకుం టామ‌ని ప్ర‌క‌టించారు.

Is Modi come with Central Forces... AP Ruling party call protest on P.M tour..

ఏపికి ఇచ్చిన హామీల అమ‌లులో కేంద్రం నిర్ల‌క్ష్యం చేస్తుంద‌ని టిడిపి విస్తృత ప్ర‌చారం చేస్తోంది. ఏపికి అన్యాయం చేసిన ప్ర‌ధాని తాము చ‌చ్చామో..బ‌తికామో చూడ‌టానికి వస్తున్నారా అని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న‌కు నిర‌స‌న‌గా గో బ్యాక్ మోదీ అంటూ క‌మ్యూనిస్టులు పిలుపునిచ్చాయి. ఇక‌, అధికారంలో ఉన్న పార్టీయే ఈ ర‌కంగా వ్య‌వ‌హ‌రిస్తే ఎలాంటి సంకేతాలు వెళ్తాయ‌నే చర్చ ఇప్పుడు మొద‌లైంది. ప్ర‌ధాని వాళ్ల పార్టీ కార్య క్ర‌మంలో పాల్గొన‌టానికి వ‌స్తుంటే అడ్డుకోవాల‌ని..అడ్డుకుంటామ‌ని ఇంతలా అధికారంలో ఉన్న నేత‌లు ప్ర‌క‌ట‌న‌లు చేయాల్సిన అవ‌స‌రం ఉందా అనే చ‌ర్చ కూడా మొద‌లైంది. ప్ర‌జాస్వామ్యంలో నిర‌స‌న‌లు తెల‌ప‌టానికి చాలా మార్గా లు ఉంటాయి. అధికారంలో ఉన్న నేత‌లే ఈ ర‌క‌మైన వ్యాఖ్య‌లు చేయ‌వ‌చ్చా అనేది మ‌రో సందేహం. ఇక‌, ప్ర‌ధాని రాక ను అధికార ప‌క్ష‌మే అడ్డుకుంటామ‌ని చెబుతున్న స‌మ‌యంలో..ప్ర‌ధాని రాష్ట్ర బ‌ల‌గాల‌ను కాకుండా.. కేంద్ర బ‌ల‌గాల ను భ‌ద్ర‌త కోసం తెచ్చుకోవాలా అనే ప్ర‌శ్న కూడా వినిపిస్తోంది.

English summary
TDP Govt calling boycott P.M tour in AP. Now this issue became more discussion in all sections. Govt can call this type of slogans against P.M is Properway or not..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X