వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెఎఫ్‌సి:పవన్ కళ్యాణ్ కు నిజంగా చిత్త శుద్ధి ఉందా?...ఉంటే ఎందుకిలా?...

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ విభజన హామీల కోసం జెఎఫ్‌సి ద్వారా ప్రయత్నం మొదలుపెట్టిన పవన్ కల్యాణ్...నేడు ఆ దిశలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే తన సారథ్యంలోని జెఎఫ్‌సి అనేది రాష్ట్రాభివృద్దిని కాంక్షించే అన్ని వర్గాలకు ప్రాతినిథ్యం ఇచ్చేలా ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Recommended Video

Pawan Kalyan's JFC Meeting With Jayaprakash & Undavalli

అయితే పవన్ ఆ మేరకు ప్రకటన అయితే చేశారు కానీ...తన ప్రకటనకు తాను కట్టుబడి ఉన్నారా? తానే చెప్పినట్లు రాష్ట్ర శేయస్సు కోసం రాగద్వేషాలకు అతీతంగా జెఎఫ్ సి నిర్వహిస్తున్నారా? అంటే...ఇప్పటివరకు జరిగిన పరిణామాలన్నింటిని బట్టి జెఎఫ్‌సి రూపకల్పనలో పవన్ నిష్ఫాక్షికంగా వ్యవహరించినట్లు కనపడలేదనే రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

పవన్ సారథ్యంలోని జెఎఫ్‌సి...నేడే తొలి సమావేశం

పవన్ సారథ్యంలోని జెఎఫ్‌సి...నేడే తొలి సమావేశం

ఎపి విభజన హామిల కోసం పవన్ కల్యాణ్ నేతృతంలో రూపుదిద్దుకున్నజెఎఫ్‌సి తొలి సమావేశం నేడు జరుగుతోంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఉదయం 8గంటలకు జనసేన ఆఫీస్ నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ ముందుగా ట్యాంక్‌బండ్‌పై ఉన్న బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకొని, పూలమాల వేసి నివాళి అర్పించి తమ ప్రయత్నం సఫలం కావాలని కోరుకున్నారు.

ఈ సమావేశంలో...ఎవరెవరు...పాల్గోనున్నారంటే...

ఈ సమావేశంలో...ఎవరెవరు...పాల్గోనున్నారంటే...

హైదరాబాద్ లోని దస్‌పల్లా హోటల్లో రెండు రోజుల పాటు జరిగే జెఎఫ్‌సి సమావేశాలకు పవన్ కళ్యాణ్ సారథ్యం వహిస్తుండగా...రాజకీయ పార్టీల నుంచి లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, వామపక్ష నేతలు మధు, నారాయణ, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జంగా గౌతమ్ తదితరులు పాల్గొంటారు. వీరు కాకుండా పలువురు రాజకీయ,సామాజిక, ఆర్థిక, విద్య, న్యాయ నిపుణులు కూడా పాల్గొనే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అయితే ప్రజలు ఎన్నుకొన్న పార్టీలకు...ఎందుకు ప్రాతినిథ్యం లేదు...

అయితే ప్రజలు ఎన్నుకొన్న పార్టీలకు...ఎందుకు ప్రాతినిథ్యం లేదు...

అయితే కారణాలు ఏమైనప్పటికి ఈ సమావేశాలకు పవన్ మూడు ప్రధాన పార్టీలను ఆహ్వానించకపోవడం చర్చనీయాంశం అయింది. అంతేకాకుండా ఇప్పటికే తనపై ఉన్న అనుమానాలు మరింత పెరగడానికి ఆస్కారం ఏర్పడింది. విభజన హామీల గురించి చర్చించడానికే అయినప్పడు ఎపికి సంబంధించి మెజారిటీ ఎన్నుకున్న మూడు ప్రధాన పార్టీలు టిడిపి,వైసిపి, బిజెపిలను పవన్ ఆహ్వానించకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి చర్చిండానికే అయినప్పుడు ఈ మూడు ప్రధాన పార్టీలను సమావేశానికి ఆహ్వానించి వారి అభిప్రాయాలను ఎందుకు సేకరించడంలేదు...వారిని బహిష్కరించడానికి కారణం ఏమిటనేది?...ఆయా పార్టీల ప్రజాప్రతినిధులు తమ గెలుపు ద్వారా ప్రజామద్దతును పొంది ఉన్నారు కాబట్టి...ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి...మెజారిటీ ప్రజల నిర్ణయాన్ని మనకు ఇష్టం ఉన్నా లేకున్నాస్వాగతించాలి కాబట్టి...ఆ మూడు పార్టీలను కూడా జెఎఫ్‌సికి ఆహ్వానించి ఉండాల్సింది...లేదా ఎందుకు ఆహ్వానించడం లేదో వెల్లడించాల్సింది...ఆ పని ఇప్పటికే చేసి ఉంటే బాగుండేది.

బహిష్కరణ దేనికి...ఈ మూడు పార్టీలు కారణమనా?...లేక వ్యక్తిగత రాగద్వేషాలా?..

బహిష్కరణ దేనికి...ఈ మూడు పార్టీలు కారణమనా?...లేక వ్యక్తిగత రాగద్వేషాలా?..

పవన్ కళ్యాణ్ ఈ మూడు పార్టీలను ఆహ్వానించకపోవడానికి కారణాలు ఏంటి?...విభజన హామీలు అమలు కాకపోవడానికి ఈ మూడు పార్టీలే కారణమయ్యాయని, అవుతున్నాయని పవన్ భావిస్తున్నారా?...అలా అయినా వారి వాదన వినడానికి అభ్యంతరం ఏంటి?...సమావేశంలోనే వారి వాదనలు...అందుకు ప్రతిస్పందనల ద్వారా వాస్తవాలు ప్రజలకు మరింత కళ్లకు కట్టే అవకాశం ఉండేది కదా?...లేక ఆ మూడు పార్టీలను ఆహ్వానిస్తే వారు సమావేశాలను సజావుగా సాగనివ్వరనా?...తప్పుదోవ పట్టిస్తారనా? లేక...క్రెడిట్ ఏదైనా వారి ఖాతాలోకి వెళుతుందనా?...వారిని తాము నిలువరించడం కష్టమనా?..లేక తన వ్యక్తిగత రాగద్వేషాలా?...

ఆ రెండు పార్టీలు అందుకైతే...మరి ఈ పార్టీని ఎందుకు?...

ఆ రెండు పార్టీలు అందుకైతే...మరి ఈ పార్టీని ఎందుకు?...

సరే...విబజన హామీల హమలు లోపాల గురించి కాబట్టి...అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం గురించి కాబట్టి అక్కడా ఇక్కడా అధికారంలో ఉన్న బిజెపి, తెలుగుదేశం పార్టీలను పక్కనపెట్టామని చెప్పినా...వైసిపిని ఆహ్వానించకపోవడంలో ఔచిత్యం ఏమిటి?...ఎందుకంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అయిన ఆ పార్టీ
ప్రత్యేక హోదా నినాదాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు...పలు సందర్భాల్లో ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి ప్రయోజనమని వాదన వినిపిస్తూనే ఉంది...అంటే జగన్ అవినీతిపరుడనేది తన అభిప్రాయం కాబట్టి పవన్ కళ్యాణ్ అందుకే వైసిపిని ఈ సమావేశానికి ఆహ్వానించలేదా?...లేక కొందరంటున్నట్లుగా ఈ జెఎఫ్సి సమావేశం టిడిపి కనుసన్నల్లో జరుగుతోందా?...లేక విభజన హామీలు నెరవేరకపోవడానికి టిడిపి, బిజెపిలతో పాటు వైసిపి కూడా ఏమైనా చేసిందని పవన్ భావిస్తున్నారా?...అలా అయినా ఈ జెఎఫ్సి కూటమిలో పవన్ తన వ్యక్తిగత అభిప్రాయాలకు, రాగ,ద్వేషాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లే కదా? మరి అది కరెక్టేనా?...ఇవి కొందరు రాజకీయ విశ్లేషకులు సంధిస్తున్న ప్రశ్నలు...ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను పక్కన పెట్టేటప్పుడు అందుకు కారణాలు వెల్లడించడం అనేది ప్రజాస్వామ్యం స్ఫూర్తిని వెల్లడిస్తుంది...మరి పవన్ తరువాతైనా ఈ ప్రశ్నలకు జవాబు ఇస్తాడా?...లేక తన ఆధిపత్యాన్నో... అపరికత్వతనో చాటుకుంటాడా?...కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది.

English summary
Janasena Leader Pawan Kalyan established JFC – Joint Fact Finding Committee for achieving the implementation of promises made in the AP Re-organisation Act during the bifurcation. However, Pawan kalyan does not invite some of the leading parties to the JFC meeting. Political observers have analyzed that Pawan has given preference to his personal opinions to form JFC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X