వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరుకు షాకిచ్చేనా: పవన్ పార్టీ పేరు పిఆర్పీ, చర్చలు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ పేరు, ఏ పార్టీలో చేరుతారు... తదితర అంశాలపై జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పవన్ పార్టీ పేరు పవన్ రిపబ్లికన్ పార్టీగా ఉండే అవకాశాలున్నాయని కూడా ప్రచారం సాగుతోంది.

పవన్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతారని, లోక్‌సత్తాలో చేరుతారని ఓసారి, కొత్త పార్టీ పెడతారని మరోసారి ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కొత్త పార్టీ పేరు పవన్ రిపబ్లికన్ పార్టీ లేదా యువరాజ్యంగా ఉండవచ్చునని చెబుతున్నారు. ఈ పేర్లను పరిశీలిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. పవన్ రిపబ్లికన్ పార్టీ (పిఆర్పీ)... నాడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం (పిఆర్పీ)ను పోలి ఉంటుంది.

Is Pawan's party name PRP?

ప్రజారాజ్యం నేతలతో పవన్ భేటీ అవుతున్నారా?

మరోవైపు నాటి పలువురు ప్రజారాజ్యం పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ మంతనాలు జరుపుతున్నారట. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆయన చర్చిస్తున్నారని రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చెప్పినట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాన్‌కు చెందిన పలువురు వంగీ గీతతో కూడా మాట్లాడారట.

కాగా, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం సాగుతున్న సమయంలో లోక్‌సత్తా పార్టీ అధ్యక్షులు, కూకట్ పల్లి శాసన సభ్యులు జయప్రకాశ్ నారాయణ మంగళవారం స్పందించారు. విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆయన స్పందించారు. పవన్ వస్తే ఆహ్వానిస్తామని చెప్పారు.

English summary
Pawan Kalyan's political career didn't quite take off back in 2009 when he campaigned for Chiranjeevi's Prajarajyam Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X