వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు విషయంలో శివాజీ చెప్పిందే జరిగిందా?...కొందరు ఔనంటున్నారు...ప్రత్యర్థులు మరోలా అంటున్నారు!

|
Google Oneindia TeluguNews

అమరావతి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక రాజ్యాంగబద్ధ సంస్ధ నుంచి నాలుగైదు రోజుల్లో నోటీసులు అందబోతున్నాయని సినీ హీరో శివాజీ 6 రోజుల క్రితం ప్రకటించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

<strong>చంద్రబాబుకు వారెంటా... తాఖీదు ఇవ్వకుండా ఎలా ఇస్తారు?... రాజకీయ కుట్రే: బుద్ధా వెంకన్న</strong>చంద్రబాబుకు వారెంటా... తాఖీదు ఇవ్వకుండా ఎలా ఇస్తారు?... రాజకీయ కుట్రే: బుద్ధా వెంకన్న

ఈ క్రమంలోనే సిఎం చంద్రబాబుకు మహారాష్ట్రలో కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ రావడంతో సినీ నటుడు శివాజీకి ఒక్కసారిగా ప్రాధాన్యత పెరిగింది. శివాజీ చెప్పినట్లే జరిగిందని, కాబట్టి శివాజీ అంతకుముందు వెల్లడించినట్లుగా ఆపరేషన్ గరుడ కూడా నిజం అయిఉండొచ్చని ఒక్కసారిగా విశ్లేషణలు ఊపందుకున్నాయి. అయితే శివాజీ చెప్పింది ఈ వారెంట్ గురించి కాదని...ఇవి కోర్టు నుంచి వచ్చినవని...సిబిఐ లేదా ఈడీ తరహా సంస్థల నుంచి నోటీసులు వస్తాయన్నట్లుగా శివాజి చెప్పారని ప్రత్యర్థులు కొట్టిపడేస్తున్నారు.

కోర్టు వారెంట్ తో...సంచలనం

కోర్టు వారెంట్ తో...సంచలనం

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాబ్లీ కేసులో మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు నాన్ బెయిలబుల్ వారంట్ రావడం రాజకీయంగా పెనుదుమారం రేగుతోంది. ఒకవైపు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు నేపథ్యంలో చంద్రబాబుకు బాబ్లీకేసులో వారెంట్ జారీ కావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కారణం ఈ కేసు ప్రత్యక్షంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ మూడు రాష్ట్రాలతో ముడిపడి ఉంది. వాస్తవానికి చంద్రబాబుపై కేసులను మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు మీడియాలో వార్తలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తెలంగాణలో ఎన్నికలు జరుగబోతున్న సమయంలోనే ఇప్పుడు ఈ నోటీసుల అంశం సుమారు 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తరువాత మళ్లీ తెరమీదకు రావడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

శివాజీ చెప్పింది...ఇదేనా?...

శివాజీ చెప్పింది...ఇదేనా?...

ఇటీవల ఎపి సిఎం చంద్రబాబును ముఖ్యమంత్రి పదవి నుంచి దించేందుకు బీజేపీ పెద్దలు ఆపరేషన్ గరుడ అనే మహా కుట్రకు తెరతీశారని సినీ నటుడు శివాజీ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో పెను దుమారం రేపింది. ఆ తరువాత ఆరు రోజుల కిందటే అదే శివాజీ మరోసారి తెరమీదకు వచ్చి ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక రాజ్యాంగబద్ద సంస్థ నుంచి నోటీసులు అందబోతున్నాయని, ఇది కేంద్రం కుట్రలో భాగమేనని, ఆపరేషన్ గరుడకు మరో రూపమని మళ్లీ సంచలనం రేపారు. మరో నాలుగు రోజుల్లో ఈ నోటీసులు ఇస్తారన్నారు. ఈ క్రమంలోనే ఎపి సిఎం చంద్రబాబుకు మహారాష్ట్ర కోర్టు నుంచి ఏకంగా వారెంట్ రావడం శివాజీ వ్యాఖ్యలకు ప్రాధాన్యత అమాంతం పెంచింది. శివాజీ చెప్పినట్లే జరిగిందని, జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇది కాదనేది...మరికొందరి వాదన

ఇది కాదనేది...మరికొందరి వాదన


అయితే శివాజీ వ్యాఖ్యలకు...మహారాష్ట్ర కోర్టు వారెంట్ కు అసలు సంబంధం లేదనేది ప్రత్యర్థుల వాదన. శివాజీ కేంద్ర ప్రభుత్వం కుట్రలో భాగంగా ఒక రాజ్యాంగబద్ద సంస్త నుంచి నోటీసులు వస్తాయని చెప్పారని...ఆయన వ్యాఖ్యలను బట్టి అవి ఏ సిబిఐ, ఈడీ ఇలాంటి సంస్థలు కావచ్చని అర్థం అవుతోందని...కానీ ఇప్పుడు నోటీసులు వచ్చింది కోర్టు నుంచి అనే విషయాన్ని గమనించాలనేది వారి వాదన. కోర్టులు కేంద్రమో, రాష్ట్ర ప్రభుత్వాలో చెప్పినట్లు నడుచుకోవని హతవు పలుకుతున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి ఇందులో మతలబు ఉందని, అంతిమంగా ఇది చంద్రబాబుకు లబ్ది చేకూర్చే అంశంగా రూపాంతరం చెందుతుందని, కావాలంటే మీరే చూడండని నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు.

 టిడిపి నేతల...మండిపాటు

టిడిపి నేతల...మండిపాటు

అయితే చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారంట్ పై టిడిపి నేతలు మండిపడుతున్నారు. ప్రజా జీవితంలో ఉండే రాజకీయ నాయకులు ఆందోళనల సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకోవడం, 144సెక్షన్ ను అమలులో ఉన్నా పట్టించుకోకపోవడం అనేవి చాలా చిన్న కేసులని...అవి అంత తీవ్రంగా పరిగణించేవి కావని...అయినా వాటిని సీరియస్ కేసుల్లా పరిగణించారని అంటున్నారు. ఎత్తేసినట్లు చెబుతున్నకేసులను మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు హఠాత్తుగా బయటకు తీసి...వాటిపై కోర్టులో పిటిషన్ వేయించి...మళ్లీ బయటకు తేవడం వెనుక ఖచ్చితంగా కుట్ర ఉందని టిడిపి నేతలు వాదిస్తున్నారు. నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ఉంటే...ఆ విషయం ఏపీ సీఎంవోకు...సీఎంకు...తెలియకుండా ఉంటుందా..?..అంటున్నారు.

 నోటీసులపై ఏం చేద్దాం...టిడిపి మంతనాలు

నోటీసులపై ఏం చేద్దాం...టిడిపి మంతనాలు

2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన చంద్రబాబుతో పాటు మరో 15మందిపై మహారాష్ట్రలో కేసు నమోదైంది. ఆక్రమంలో చంద్రబాబును అరెస్ట్ కూడా చేశారు. అయితే ఎనిమిది ఏళ్లుగా మహారాష్ట్ర కోర్టు ఒక్క నోటీసు ఇవ్వకుండా హఠాత్తుగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంపై టిడిపి నేతలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు కోర్టు నోటీసుల వ్యవహారంలో ఏం చేయాలనే అంశంపై టీడీపీ నేతలు విస్తృతంగా మంతనాలు జరుపుతున్నారు. ఈ నెల 21 న ధర్మాబాద్ కోర్టుకు హాజరు కావాలా?...లేదంటే మరేం చేయాలనే అంశంపై చర్చలు జరుపుతున్నారని తెలిసింది. ఏదేమైనా సినీనటుడు శివాజీ నోటీసుల గురించి చెప్పినవిధంగానే వారెంట్ జారీ కావడం శివాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

English summary
Amaravathi:Actress Shivaji has announced a few days ago that Andhra Pradesh Chief Minister Chandrababu will get notices within four days from a constitutional body. In this background CM Chandrababu had get non bailable warrant from Dharmabad court, Maharashtra. This issue has given importance to Shivaji's comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X