వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏకులా కాదు..ఏ2లా వచ్చి మేకులా అయ్యాడే:విజయసాయిరెడ్డిపై టిడిపి ఆక్రోశం

|
Google Oneindia TeluguNews

వైసిపికి సంబంధించి ఇంతకుముందు వరకు టిడిపి నేతల ప్రధాన టార్గెట్ జగన్ ఒక్కడిపైనే ఉండేది. కానీ ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో మరో లీడర్ కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబుకు ప్రధాన శత్రువులా...కంట్లో నలుసుగా మారాడు...ఆ నేత మరెవరో కాదు వైసిపి రాజ్య సభ ఎంపి విజయసాయి రెడ్డి. కారణం...ఢిల్లీతో పాటు ఎపి గల్లీల్లో కూడా తమ పార్టీ ఇప్పుడు కొత్త ఇబ్బందులు ఎదుర్కోవడానికి కారణం విజయసాయిరెడ్డేనని చంద్రబాబు, టిడిపి నేతలు మండిపోతున్నారు.

అందుకే ముందు విజయసాయిరెడ్డికి చెక్ చెప్పాలని ప్రయత్నిస్తున్నారట. అందులో భాగంగానే ఇటీవల చంద్రబాబుతో సహా టిడిపి నేతలు జగన్ కంటే ఎక్కవగా విజయసాయి రెడ్డినే టార్గెట్ చేస్తుండటం గమనార్హం. చంద్రబాబేమో ఆయన ప్రధాని కార్యాలయం చుట్టూ అన్ని సార్లు తిరగాల్సిన అవసరం ఏంటని ఆక్రోశం వ్యక్తం చేయగా...ఎంపి జెసి దివాకర్ రెడ్డి అయితే దమ్ముంటే విజయసాయిరెడ్డి ముందు రాజీనామా చెయ్యాలని, ఆ తరువాత మళ్లీ గెలవాలని సవాలు విసిరారు. ఆ సవాలు వెనుక ప్రధాన ఉద్దేశం ఎలాగైనా ఢిల్లీలో విజయసాయిరెడ్డి స్పీడుకు బ్రేకులు వెయ్యాలనట...దీన్నిబట్టే టిడిపికి..చంద్రబాబుకు విజయసాయి రెడ్డి ఎంత ఇబ్బందికరంగా మారాడో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

 టిడిపి టార్గెట్...విజయసాయిరెడ్డి...ఎందుకంటే?...

టిడిపి టార్గెట్...విజయసాయిరెడ్డి...ఎందుకంటే?...

ఎపి ప్రయోజనాల సంగతి అటుంచితే...నల్లేరు మీద నావలా సాగిపోతున్న టిడిపి-బిజెపిల మైత్రీ బంధం ఇప్పుడు ఇలా కొడిగట్టటానికి కారణం...సూత్రధారో పాత్రధారో తెలియదు కానీ వైసిపి పార్టీ నేత విజయసాయిరెడ్డే కారణం అని టిడిపి నేతలే కాదు ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా బలంగా విశ్వసిస్తున్నారు. ఆడిటర్ కదా రాజకీయాలు ఏం తెలుస్తాయిలే అని తాము తేలిగ్గా అంచనావేసిన విజయసాయి రెడ్డి ఏకంగా ఢిల్లీ స్థాయిలో తమ పుట్టి ముంచాడని తెదేపా నేతలు రగిలిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి టిడిపి మంత్రులు వైదొలిగే ప్రకటన సందర్భంగా స్వయంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు...వైసిపి అధినేత జగన్ ని కూడా కాకుండా పరోక్షంగా విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఆక్రోశం వెలిబుచ్చిన సంగతి అందరూ గమనించారు. పొద్దస్తమానం ప్రధాని కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఏంటండి?...పిఎంవో ఆఫీసు కారిడార్లలో ఈయనకు ఏం పనండి అంటూ చంద్రబాబు మండిపడటం ప్రధాన్యత సంతరించుకుంది.

 ఏ2 లా వచ్చి...మేకులా...విజయసాయిరెడ్డి...

ఏ2 లా వచ్చి...మేకులా...విజయసాయిరెడ్డి...

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అకౌంటు వ్యవహారాలు చూసే ఆడిటర్ గా ఉన్న విజయసాయి రెడ్డి...తదనంతర పరిణామాల నేపధ్యంలో జగన్ అక్రమాస్తుల కేసులో ఏ-2 నిందితుడిగా మారాడు. ఆ తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయ ఆంరంగ్రేటం చేసిన ఆడిటర్ విజయసాయిరెడ్డి ముందుగా వైకాపా ప్రధాన కార్యదర్శి పదవి పొందారు. ఆ తరువాత రాజ్యసభ ఎంపీ పోస్టు సంపాదించుకున్నారు...అకౌంటెంటే కదా...ఏదో కేసుల నుంచి తప్పించుకోవడానికి తిప్పలు పడుతున్నాడంటూ విజయసాయిరెడ్డిని ఇటీవలికాలం వరకు తేలిగ్గా తీసుకున్న ఆయన చివరకు టిడిపికి దిమ్మతిరిగి మైండ్ బ్లాంకయ్యే దెబ్బ తగిలేందుకు కారణమయ్యాడు. ఈ మధ్యకాలంలో ఢిల్లీలో విజయసాయిరెడ్డి చురుకైన పాత్ర పోషిస్తున్నా టిడిపి ఆయన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేయలేదు. కారణం విజయసాయిరెడ్డిని టిడిపి వ్యూహకర్తగా భావించలేదు...రాజకీయంగా జగన్ చెప్పినట్లు చేయడం తప్ప విజయసాయిరెడ్డి ఏం చెయ్యగలరులే అని టిడిపి భావించినట్లు కనిపిస్తోంది.

 విజయసాయిరెడ్డిపై...నజర్ ఎప్పుడంటే...

విజయసాయిరెడ్డిపై...నజర్ ఎప్పుడంటే...

అయితే విజయసాయిరెడ్డిని తేలిగ్గా తీసుకోకూడదని టిడిపి స్పష్టంగా అర్థమైంది ఎప్పుడంటే...రాజ్యసభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినప్పటినుంచి...
అదే విషయంలో వెంకయ్యనాయుడును నిలదీసిన అప్పటి నుంచి...టిడిపి విజయసాయిరెడ్డిని గట్టిగా పట్టించుకోవడం మొదలు పెట్టింది. ఆ తరువాత విజయసాయిరెడ్డి ఏకంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుపై రాష్ట్రపతి కోవింద్ కు ఫిర్యాదు చేయడంతో ఇక అప్పటినుంచే విజయసాయిరెడ్డిని టార్గెట్ చెయ్యాల్సిందేనని టిడిపి నిర్ణయించుకుంది.

 పాయింట్ ఆఫ్ ఆర్డర్...ఆ సందర్భం ఇదే

పాయింట్ ఆఫ్ ఆర్డర్...ఆ సందర్భం ఇదే

విభజన సమస్యలు పరిష్కరిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ హామీ ఇస్తే ఆందోళన విరమిస్తామని, ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం, అమరావతి నిధులపై ప్రకటన చేయాలని రాజ్యసభలో కేంద్రమంత్రి సుజనా చౌదరి డిమాండ్ చేసిన సందర్భంలో...వైసీపీ ఎంపీ విజయసాయి పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తారు. టీడీపీ ఎంపీ సుజనాచౌదరి మంత్రివర్గంలో ఉంటూ నిరసన తెలపడంపై విజయసాయి పాయింట్ ఆఫ్ ఆర్డర్ ప్రస్తావన తెచ్చారు. ఒక మంత్రి మరొక మంత్రికి సలహా ఇవ్వడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. రాజ్యాంగ వ్యతిరేక చర్యను ఛైర్మన్‌ ఎలా సమర్థిస్తారని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. కేబినెట్ నిర్ణయంతో విభేదించిన మంత్రిని రాజ్యసభలో ఎలా మాట్లాడనిస్తారని విజయసాయి ప్రశ్నించగా.. కేంద్రమంత్రులు సలహాలు ఇవ్వొచ్చని, సుజనా మాటలు కేబినెట్‌ నిర్ణయానికి వ్యతిరేకం కాదని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు రూలింగ్ ఇచ్చారు. దీంతో పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌పై ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు తీరు రాజ్యాంగ విరుద్ధమన్నారు విజయసాయిరెడ్డి. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ఛైర్మనే నిబంధనలు అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఛైర్మన్‌ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

 టార్గెట్:ఇప్పుడు జగన్ కన్నా ముందు

టార్గెట్:ఇప్పుడు జగన్ కన్నా ముందు

మరుగున పడిపోతుందనుకున్నప్రత్యేకహోదా బూమెరాంగ్ లాగా వెనుదిరిగి రావడంలో...ఈ విషయమై టిడిపి, బిజెపిలపై ఒత్తిడి పెరిగేలా చేయడంలో... క్షేత్రస్ధాయిలో జగన్ పాదయాత్ర ఒక ఎత్తు అయితే...ఢిల్లీలో ఉండి విజయసాయిరెడ్డి చేసిన మంత్రాంగం మామూలుగా లేదని అర్థమైన టిడిపి నేతలు ఇప్పుడు విజయసాయిరెడ్డిపై రగిలిపోతున్నారంట. పైగా టిడిపి అధినేత చంద్రబాబు కూడా విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీగా ఢిల్లీలో ఉండి వైసిపికి అతనెంతగా ఉపయోగపడ్డాడో అంతర్గత సమావేశంలో తమ ఎంపీలకు ఆ వివరాలు చెప్పి మీరింతమంది ఉన్నా అతను చేసిందాంట్లో ఆవగింజంతైనా పార్టీకి ఉపయోగపడలేకపోయారంటూ తలంటారట!..దీంతో టిడిపి ఎంపీలకు విజయసాయిరెడ్డిపై కోపం ఇంకా పెరిగిపోయిందట...అందుకే తాము చెయ్యలేకపోతే పొయ్యాము...కనీసం విజయసాయిరెడ్డి స్పీడుకైనా బ్రేకులు వెయ్యగలిగితే పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం కొంతైనా చల్లారుతుందని భావిస్తున్నారట. అందుకే ఇటీవలి కాలంలో ఎక్కువగా విజయసాయిరెడ్డినే టార్గెట్ చేయడం...దమ్ముంటే విజయసాయిరెడ్డి పదవికి రాజీనామా చేయాలంటూ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిసవాళ్లు విసరటం...ఆ రకంగానైనా సైడ్ చెయ్యాలనే ఉద్దేశంతోనేనట.

 విజయసాయి విజయాలు...టిడిపి వ్యూహాలు

విజయసాయి విజయాలు...టిడిపి వ్యూహాలు

విజయసాయిరెడ్డికి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఇస్తుండటంపై ఆయన్ని ఏమనలేని చంద్రబాబు...ఆయన కార్యాలయాన్నితప్పుబట్టారు. అలాగే కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజును విజయసాయిరెడ్డి కలిసిన విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని చంద్రబాబు సూచించారు. అయితే వారిని విజయసాయి కలిస్తే చంద్రబాబు అంతగా భయపడుతుండటం టిడిపి నేతలకే అర్థం కావడం లేదట. అయితే జగన్ తరపున విజయసాయిరెడ్డి చూసి రమ్మంటే కాల్చివచ్చిన చందంగా వ్యవహారాలు బ్రహ్మాండంగా చక్క పెడుతున్నారని చంద్రబాబే మథనపడిపోతున్నారట. అందుకే ఇలాంటి వాళ్లని పీఎంవో పరిసరాల్లోకి అనుమతించ కూడదని అంటున్నారట. విజయసాయిరెడ్డికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం పీఎంవోకే కళంకమని కూడా అన్నారు...అయితే దీనిపై నెటిజన్లు మాత్రం ప్రధాని మోడీని విజయసాయిరెడ్డి కలవడం ఎలా తప్పవుతుందని, అది తప్పయితే సుజనా చౌదరి మీద కూడా అనేక కేసులుండటంతో పాటు ఏకంగా అరెస్టు వారెంటే జారీ అయింది...అది మర్చిపోయారా?...అని ప్రశ్నిస్తున్నారు....ఏదేమైనా ఊహించని విధంగా రాజకీయాల్లో అడుగిడిన ఈ బక్కపలుచటి ఆడిటర్ విజయసాయిరెడ్డి...చంద్రబాబు లాంటి అనుభవశాలి...రాజకీయ చాణుక్యుడిని కూడా చికాకు పెడుతున్నారంటే...పార్టీ తనపై పెట్టిన బాధ్యతను నెరవేర్చడంలో విజయవంతమైనట్లే...అంతేకాదు పేరుకు తగినట్లు సార్థక నామధేయుడే.

English summary
Now, TDP leaders are more concerned about Vijayasai Reddy than Jagan.This person who has entered in politics unexpectedly... is now tapping the TDP in many ways.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X