వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జనసేనలో మాజీ జేడీ చాప్టర్ క్లోజేనా ? అసలు పవన్ కు లక్ష్మీ నారాయణకు ఎందుకు చెడింది ?

|
Google Oneindia TeluguNews

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇక జనసేన పార్టీని వీడినట్టేనా ? జనసేన కీలక కమిటీలలో మాజీ జేడీకి ఎందుకు స్థానం ఇవ్వలేదు? అసలు పవన్ ను కలిసేందుకు కూడా మాజీ జేడీ ఎందుకు రావటం లేదు ? జ‌న‌సేనలో వుండ‌లేక లక్ష్మీ నారాయణ బ‌య‌టికి వెళ్ల‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారా? జనసేన పార్టీ పట్ల మాజీ జేడీ లక్ష్మీనారాయణ తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? అసలు పవన్ కు మాజీ జేడీ కి చెడింది ఎక్కడ ? ఇవి ప్రస్తుతం మాజీ జేడీ లక్ష్మీ నారాయణ విషయంలో ఏపీ ప్రజల్లో ఉన్న ప్రశ్నలు .

<strong> కాశ్మీర్ సమస్యనే పరిష్కారం అయ్యింది .. కాపు రిజర్వేషన్ల సమస్య పరిష్కారం కాదా .. జగన్ కు పవన్</strong> కాశ్మీర్ సమస్యనే పరిష్కారం అయ్యింది .. కాపు రిజర్వేషన్ల సమస్య పరిష్కారం కాదా .. జగన్ కు పవన్

జేడీ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్న లక్ష్మీ నారాయణ .. అదే పవన్ ఆగ్రహానికి కారణమా ?

జేడీ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు చేస్తున్న లక్ష్మీ నారాయణ .. అదే పవన్ ఆగ్రహానికి కారణమా ?

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. ఈ పేరు దేశంలోని ప్రజలందరికీ తెలుసు. జగన్ ఆర్థిక నేరాల కారణంగా , జగన్ పై అక్రమాస్తుల కేసు నమోదు చేసి విచారణ జరిపిన ఉన్నతాధికారిగా, నిజాయితీపరుడైన సిబిఐ అధికారిగా ఆయనకు పేరుంది. ఇక ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామ స్వ‌రాజ్యమే నా స్వ‌ప్నం అని రాజ‌కీయాల్లోకి ఎంట‌ర‌య్యారు. అయితే సొంత పార్టీని పెట్టి ఎన్నికలకు వెళతారు అనుకున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ అనూహ్యంగా జ‌న‌సేన‌లో చేరి ఆయ‌న ఇటీవ‌ల జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైజాగ్ నుంచి జ‌న‌సేన త‌రుపున ఎంపీగా పోటీ చేశారు. దాదాపు మూడు లక్షల ఓట్లు సాధించారు కానీ ఓటమి పాలయ్యారు. ఇక ఆ తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాల్లో కంటే తన సొంత కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. వైజాగ్ లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు . అయితే ఈ కార్యక్రమాల నిర్వహణకు జనసేన క్యాడర్ ను వాడుకుంటున్నారని , ఇది పవన్ కు అసలు నచ్చటం లేదని అందుకే ఆయన విషయంలో పవన్ సైలెంట్ గా ఉన్నారని సమాచారం

జనసేన పార్టీ కార్యక్రమాలు కాకుండా జేడీ ఫౌండేషన్ పనులపైనే దృష్టి పెట్టిన లక్ష్మీ నారాయణ .. జనసేనలో అసహనం

జనసేన పార్టీ కార్యక్రమాలు కాకుండా జేడీ ఫౌండేషన్ పనులపైనే దృష్టి పెట్టిన లక్ష్మీ నారాయణ .. జనసేనలో అసహనం

పవన్ కళ్యాణ్ పార్టీలో పవన్ కళ్యాణ్ తో పాటు ప్రభావం చూపించగల నేతలుగా ఉన్నవారు చాలా తక్కువ . నాదెండ్ల మనోహర్ , ఆ తర్వాత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక నేతలు . కానీ లక్ష్మీ నారాయణ ఎన్నికల ఓటమి తర్వాత జనసేన పార్టీ కార్యకర్తలను తాను నిర్వహించే జేడీ ఫౌండేషన్ కార్యక్రమాలకు వాడుకుంటున్నారని పవన్ కు తెలిసింది. జనసేన పార్టీ కార్యక్రమాలకు కాకుండా వ్యక్తిగతంగా జనసైనికులను జేడీ వాడుకోవటమే పవన్ లక్ష్మీ నారాయణ పట్ల నిర్లిప్తంగా ఉండటానికి ప్రధాన కారణం అని తెలుస్తుంది. ఇక లక్ష్మీ నారాయణ సైతం పవన్ ను కలవాలంటే ఇబ్బంది పడుతున్నారని సమాచారం . సాధారణ కార్యకర్తలా పవన్ కోసం వెయిట్ చెయ్యాల్సి వస్తుందని అందుకే ఆయన పవన్ ను కనీసం కలవటానికి కూడా వెళ్ళటం లేదని సమాచారం . దీంతో వీరిద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయింది.

పార్టీ నేతలతో ఏ మాత్రం టచ్ లో ఉండని లక్ష్మీ నారాయణ ... పార్టీకి దూరం

పార్టీ నేతలతో ఏ మాత్రం టచ్ లో ఉండని లక్ష్మీ నారాయణ ... పార్టీకి దూరం

ఇక లక్ష్మీ నారాయణ జనసేన పార్టీ తో కానీ పార్టీ నేతలతో కానీ ఏ మాత్రం టచ్ లో ఉండటం లేదని కూడా పవన్ కళ్యాన్ ఆయన తీరుపై అసహనంతో ఉన్నారని సమాచారం . అందుకే పవన్ జనసేన ప్రకటించిన పోలిట్ బ్యూరో కమిటీలో కానీ, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో కానీ లక్ష్మీ నారాయణకు స్థానం కల్పించలేదు. ఇక ఈ విషయంపై ఎన్ని రకాల వార్తలు వస్తున్నా లక్ష్మీ నారాయణ స్పందించనూ లేదు . ఇక దీంతో లక్ష్మీ నారాయణ జనసేన పార్టీకి గుడ్ బై చెప్తారనే విషయం కన్ఫార్మ్ అయిపోయింది.

English summary
Even after his defeat from Visakhapatnam as MP candidate from Jana Sena, he was seen carrying out some social services in Visakhapatnam. It is alleged that Jana Sena leader VV Lakshminarayana has used party activists for carrying out his personal JD Foundation works. This issue has reportedly created a difference with party president Pawan Kalyan. It is also alleged that Lakshmi Narayana has to wait for some time to meet party chief whenever he wants to meet party president Pawan Kalyan. Pawan Kalyan has also not appointed JD Lakshmi Narayana in some of his key political committee. This has created confusion within the party cadre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X