వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టెలి హెల్త్ సర్వీసెస్ కి అచ్చెన్నాయుడుకి ఏంటి లింకు?అసెంబ్లీకి రాకుండా అడ్డుకోవడమే ప్రభుత్వ లక్ష్యమా

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : ఎప్పుడూ వాడివేడిగా కొనసాగే అమరావతి రాజకీయాల్లో ఏకంగా పెద్ద కుదుపు చోటుచేసుకుంది. నిన్నటి వరకూ ఆరోపణలు ప్రత్యారోపణలతో దద్దరిల్లే ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఒక్కసారిగా అరెస్టుల వరకు దారితీసింది. దీంతో నైరుతీ రుతుపవనాలు ప్రవేశించి చల్లగా మారాల్సిన వాతావరణం రాజకీయంగా మరింత వేడెక్కింది. తెలుగు దేశం పార్టీ జమానాలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోళ్లలు అక్రమాలు జరిగాయని గతంలో విజిలెన్స్ విభాగం తెలిపింది.

ఈఎస్ఐ స్కాంలో 19 మంది - అచ్చెన్నాయుడు సహా ఇద్దరు డాక్టర్ల అరెస్ట్ - సాయంత్రం కోర్టుకు..ఈఎస్ఐ స్కాంలో 19 మంది - అచ్చెన్నాయుడు సహా ఇద్దరు డాక్టర్ల అరెస్ట్ - సాయంత్రం కోర్టుకు..

 బాబు జమానాలో అక్రమాలు జరిగాయి.. ఆధారాలున్నందుకే అరెస్టులంటున్న వైసీపి ప్రభుత్వం..

బాబు జమానాలో అక్రమాలు జరిగాయి.. ఆధారాలున్నందుకే అరెస్టులంటున్న వైసీపి ప్రభుత్వం..

దీని ఆధారంగానే శుక్రవారం ఉదయం అచ్చెన్నని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ నెల 16నుండి జరిగే అసెంబ్లీ సమావేశాలకు అచ్చెన్నని రానివ్వకుండా అడ్డుకునేందుకు జరుగుతున్న కుట్రలో భాగమే ఈ అక్రమ అరెస్టని టీడిపి నేతలు మండిపడుతున్నారు. గత తెలుగు దేశం పార్టీ హయాంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అనేక అక్రమాలు జరిగాయన్నది ప్రస్తుత వైసిపీ ప్రభుత్వ వాదన. అందులో భాగంగానే కార్మిక మంత్రిగా పని చేసినప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు అనేక ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారని వైసీపి ప్రభుత్వం అభియోగం మోపింది.

 ఈఎస్ఐలో కుంభకోణం జరిగింది..ప్రధాన సూత్రదారి అచ్చెన్నాయుడే అంటున్న వైసీపి..

ఈఎస్ఐలో కుంభకోణం జరిగింది..ప్రధాన సూత్రదారి అచ్చెన్నాయుడే అంటున్న వైసీపి..

ఇదిలా ఉండగా టెలి హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి పనులు అప్పగించాలని అప్పటి కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు ఒక లేఖ రాయడంతో అప్పటి ఐఎంఎస్ డైరెక్టర్ రమేశ్ కుమార్ ఆ లేఖ ఆధారంగా వారికి పనులు ఇచ్చేశారని ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలు వచ్చిన తరువాత అచ్చెన్నాయుడు దీనిపై స్పష్టత ఇచ్చారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, తెలంగాణ రాష్ట్రంలో చేసినట్లే ఆంధ్రప్రదేశ్‌లో కూడా చేయాలని మాత్రమే సూచించానని చెప్పారు. రికార్డులన్నీ ప్రభుత్వం వద్దే ఉన్నాయి కాబట్టి పరిశీలించుకునే బాద్యత కూడా ప్రభుత్వం ఉందని మాత్రమే గుర్తు చేసినట్టు అచ్చెన్న చెప్పుకొచ్చారు.

 కొనుగోళ్లలో గోల్ మాల్ చేసిన మంత్రి.. వాస్తవాలు బయటకు వస్తాయంటున్న ఏపీ సర్కార్..

కొనుగోళ్లలో గోల్ మాల్ చేసిన మంత్రి.. వాస్తవాలు బయటకు వస్తాయంటున్న ఏపీ సర్కార్..

అంతే కాకుండా అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐలో కుంభకోణం జరిగిందన్నది వైసీపీ నాయకుల, ప్రభుత్వ ప్రధాన ఆరోపణ. ఆంధ్రప్రదేశ్‌లో ఈఎస్ఐ కింద 4 ఆసుపత్రులు, 3 పరీక్షా కేంద్రాలు, 78 డిస్పెన్సరీలు ఉన్నాయి. వాటికి సంబంధించిన కొనుగోళ్లలో ఈ అక్రమాలు జరిగాయని అందుకు సంబంధించిన ఆధారాలు కూడా తమ ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అందులో భాగంగానే మాజీ మంత్రి అచ్చెన్నాయుణ్ని అరెస్టు చేస్తున్నట్టు ప్రభుత్వం వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా అచ్చెన్నాయుడు అరెస్టు వెనక మరో కోణం ఉన్నట్టు టీడిపి నేతలు ఆరోపిస్తున్నారు.

Recommended Video

AP Assembly : Tammineni Sitaram Tounge Slip In Assembly || Speaker Angry On TDP || Oneindia Telugu
 ఇవి ముమ్మాటికి కక్షసాధింపు రాజకీయాలే.. అచ్చెన్నను అసెంబ్లీకి రానివ్వకుండా చేయడమే అంటున్న టీడిపి..

ఇవి ముమ్మాటికి కక్షసాధింపు రాజకీయాలే.. అచ్చెన్నను అసెంబ్లీకి రానివ్వకుండా చేయడమే అంటున్న టీడిపి..

మొత్తానికి అధికారుల వైపు నుంచి జరిగిన తప్పులను అచ్చెన్నపై నెట్టి ఆయన్ను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా శాసన సభలో వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టే అచ్చెన్నను అరెస్ట్ చేసి మరికొద్ది రోజుల్లో జరగబోయే సమావేశాలకు రాకుండా చేయాలని, అచ్చెన్నాయుడు లాంటి నేత నోరు నొక్కితే ప్రతిపక్షపార్టీలో ఇకెవ్వరూ అంతగా విరుచుకుపడే సాహసం చేయరనేది అధికార పార్టీ పన్నాగమని తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. వ్యవస్థలను చేతుల్లోకి తీసుకుని వ్యక్తిగత కక్షసాధింపులకు వైసీపి ప్రభుత్వం పాల్పడుతోందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ స్పష్టం చేస్తోంది.

English summary
The main allegation of the YCP leaders and the government is that the scandal in the ESI took place when Achennayudu was Labor Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X