వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి టైం బాలేదా!...అఖిలపక్షంతో సహా అన్నీ ఎదురుదెబ్బలేనా?...ఎందుకిలా?

|
Google Oneindia TeluguNews

అమరావతి:ఎపిలో తాజా రాజకీయ పరిణామాలు ఫాలో అవుతున్న వారందరికీ ఒక విషయం అర్థమవుతోంది...అది చంద్రబాబు టైం బాగాలేదని...ఆ ప్రభావం టిడిపి మీదా పడుతోందని...ఎలాగంటే...రాజకీయ వ్యూహాల్లో తనను మించినవారు లేరని చంద్రబాబు నమ్మకం...అది చాలావరకు వాస్తవం కూడా!...

అయితే అంతటి రాజకీయ దురంధరుడు...కలియుగ చాణుక్యుడు కూడా ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాలు వరుసగా బెడిసికొడుతుండటం అందరినీ ఆశ్యర్చానికి గురిచేస్తున్నాయి. దీంతో చంద్రబాబు పాలిటిక్స్ అవుట్ డేటెడ్ అయ్యాయా?...లేక లెక్కకుమించిన స్వయంకృతాపరాధాల పర్యవసానమా...
లేక టైం బాలేదా?...అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.

వ్యూహాల్లో దిట్ట...ప్రత్యర్థుల కంటే రెండడుగుల ముందు...

వ్యూహాల్లో దిట్ట...ప్రత్యర్థుల కంటే రెండడుగుల ముందు...

కారణం అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా రాజకీయ వ్యూహాల పరంగా చంద్రబాబుది ప్రత్యర్థులపై ఎప్పుడూ పైచేయిగానే ఉండేది...కానీ గత కొంతకాలంగా ఎపి రాజకీయాలను పరిశీలిస్తే చంద్రబాబు పన్నుతున్న వ్యూహాలు అన్నీ బూమరాంగ్ ల్లాగా తిరిగిరావడమో...సెల్ఫ్ గోల్స్ కావడమో జరుగుతోంది. అధికారంలో ఉండి...అనుకూలమైన యంత్రాంగం...మంత్రాంగం...మీడియా మద్దతు ఉండి కూడా చంద్రబాబు పన్నుతున్న రాజకీయ వ్యూహాలు ఆయనకు, పార్టీకి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తున్నాయి.

 మంత్రుల రాజీనామాల దగ్గర్నుంచి...అన్నీ రివర్సే...

మంత్రుల రాజీనామాల దగ్గర్నుంచి...అన్నీ రివర్సే...

బిజెపితో తెగతెంపులు చేసుకోవాలనే నిర్ణయం తీసుకునే అంశం నుంచి చంద్రబాబు తీసుకుంటున్న ప్రతి నిర్ణయం బెడిసి కొడుతూనే వస్తోంది. కొన్ని విషయాల్లో మంచి ఎత్తుగడలాగా తాత్కాలికంగా కనిపించినా వ్యవహారం మరికొంత ముదిరేప్పటికి అదే నిర్ణయం ఉరి తాడులా బిగుసుకుంటున్న పరిస్థితుల్లో తప్పనిసరై యూ టర్న్ తీసుకోవాల్సి వస్తోంది. అవిశ్వాసం విషయంలో వైసిపి కి మద్దతు ఇస్తామని ప్రకటించిడం వెనుక ఏ ఎత్తుగడ ఉందో తెలియదు కానీ ఆ ప్రకటనతో చంద్రబాబు తమ పార్టీనే కాదు వైసిపి నేతలను కూడా షాక్ కు గురిచేశారు. అయితే చంద్రబాబు ఏదో అతి పెద్ద ఎత్తుగడ లేకుండా ఇలా ప్రకటించరని భావించిన వారికి మళ్లీ 24 గంటలైనా గడవకముందే యూ టర్న్ తీసుకోవడంతో చంద్రబాబు ఎత్తుగడల మీద సందేహం తలెత్తెంది.

గతంలో యు టర్న్ లు...విధానాల్లో...ఇప్పుడు ఎత్తుగడల్లో

గతంలో యు టర్న్ లు...విధానాల్లో...ఇప్పుడు ఎత్తుగడల్లో

అంతకుముందు చంద్రబాబు చాలా సార్లు యూ టర్న్ లు తీసుకున్నా అవి ఎక్కువగా విధానాల్లో పాలసీల్లో ఉండేవి...అయితే ఎత్తుగడల్లో మాత్రం వెంటవెంటనే యూ టర్న్ లు తీసుకునే పరిస్థితి ఉండేది కాదు...అంతగా అయితే అందుకోసం లీక్ ల టెక్నిక్ లని వాడుకునేవారు. అయితే తాజా పరిస్థితుల్లో చంద్రబాబు అన్ని టెక్నిక్ లు వాడి సర్వశక్తులు సమీకరిస్తున్నా కనీస ఫలితం రాబట్టలేక పోగా వ్యతిరేక ఫలితాలను...ఊహించని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.

 అఖిలపక్ష సమావేశం...ఊహించని దెబ్బే!

అఖిలపక్ష సమావేశం...ఊహించని దెబ్బే!

అఖిలపక్ష సమావేశం వెనుక చంద్రబాబు ఎత్తుగడ వేరు...జరిగింది వేరు...కేంద్రంపై పోరాటం తన నేతృత్వంలో చేయడం ద్వారా తానే బలీయమైన శక్తినని రుజువు చేసుకోవడం, కలసిరానివారిని రాజకీయంగా అప్రతిష్ట పాలుచేసి ఒంటరిని చేయడం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకొని అఖిలపక్షం సమావేశానికి సంసిద్దయ్యారు. తీరా జరిగిందేమంటే వైసిపి,బిజెపి,జనసేన బహిరంగంగానే ఈసడించుకోగా...సమావేశానికి హాజరైన పక్షాలు కూడా వ్యూహాత్మకంగా చంద్రబాబును కడిగేయడానికే లక్ష్యంతో వచ్చాయే తప్ప కేంద్రంపై పోరాటానికి కాదనేది మీటింగ్ తరువాత కాని చంద్రబాబుకు అర్థం కాలేదు. ఈ పరిణామం అసలు ఊహించని ఆయన ఫుల్ డిఫెన్స్ లో పడిపోయారు.

 విజయసాయి విషయంలోనూ...గోటితో పోయే దాన్ని...

విజయసాయి విషయంలోనూ...గోటితో పోయే దాన్ని...

ఇక వైసిపి నేత విజయాసాయిరెడ్డి విషయంలోనూ చంద్రబాబు...అనవసరంగా గోటితో పోయే వ్యవహారాన్ని గొడ్డలి దాకా తెచ్చినట్లు కనిపిస్తోంది. విజయసాయిని టార్గెట్ చేయడం ద్వారా ఆయనికి టిడిపినే అత్యధిక ప్రాధాన్యత కల్పించినట్లవడంతో పాటు ఆయన మీదే దృష్టి నిలపడం ద్వారా వైసిపి, ఇతర రాజకీయ పార్టీలు స్వేచ్చగా తమ వ్యూహాలు పదును పెట్టుకోవడానికి అవకాశం కల్పించినట్లయింది. అంతేకాకుండా విజయసాయిరెడ్డిని ఎక్కువగా టార్గెట్ చేయడం ద్వారా ఆయనంటే బాగా భయపడుతున్నట్లుగా...మరోవైపు జనాల్లో కొంత సింపతీ పెరిగే పరిస్థితీ కల్పించారు. ఇక తాజాగా ప్రధానికి విజయసాయి పాదాభివందనం విషయంలోనూ ఆయన టివి ఫుటేజ్ కోరడంతో అందులో దృశ్యాలు టిడిపి వూహించిన విధంగా కాకుండా ఏ మాత్రం తేడాగా ఉన్నా పార్టీకి పెద్ద దెబ్బే తగిలే అవకాశం ఉంది.

ఈ పరిస్థితికి కారణం...టైమ్ బ్యాడా?...లేక...

ఈ పరిస్థితికి కారణం...టైమ్ బ్యాడా?...లేక...

టిడిపికి లేదా చంద్రబాబుకు ఈ పరిస్థితి రావడానికి కారణం చంద్రబాబు టైమ్ బ్యాడా...లేక స్వయంకృతాపరాధమా అంటే స్వయంకృతాపరాధాల పర్యవసానాలు టైమ్ బ్యాడ్ సమయంలో వరుసగా ప్రభావం చూపిస్తుండటమేనని చెప్పొచ్చు. అమరావతికి శంఖుస్థాపన నాటి నుంచి ఏ విషయంలోనూ టిడిపి ప్రధాన ప్రతి పక్షమే కాదు...ఏ పార్టీని కలుపుకు పోకుండా ఏకపక్షంగా కుటుంబ వ్యవహారం లాగానో...సొంత వ్యవహారంలాగానో చేసుకుంటూ వెళ్లడం...ఎవరినీ లెక్క చేసిన పరిస్థితి లేకపోవడంతో తీరా చంద్రబాబుకు అవసరమైన సమయంలో అందరూ మొహం మీదే తిరస్కారం తెలియజేసిన పరిస్థితి...ప్రత్యర్థులు అంతకంతకూ బలం పుంజుకుంటున్న వేళ క్రమంగా ఒంటరిగా మారుతున్న చంద్రబాబు ముందు ముందు మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులను ఏ విధంగా అధిగమిస్తారో వేచి చూడాలి.

English summary
Is the TDP chief facing time bad period?...Every strategy of chandrababu does not give a positive result and does some damage...that's what looks like the latest political developments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X