వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీతో బాబుకు ప్రమాదం? ఓటుకు నోటు మలుపు సంకేతం అదేనా?: మహేష్ కత్తి అనుమానం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Bjp Conspiracy Behind Cash For Vote Case

అమరావతి: ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానికి, ఏపీ ప్రభుత్వానికి చెడినట్టే కనిపిస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలు టీడీపీపై నిందలు వేయడం.. టీడీపీ బీజేపీని కౌంటర్ చేయడం గత కొద్దిరోజులుగా జరుగుతూనే ఉంది.

సీఎం చంద్రబాబు క్యాంప్ నుంచి మోడీపై జరుగుతున్న ఎటాక్‌ను కేంద్రం సీరియస్ గా తీసుకుందా?.. తీసుకోవడమే కాదు.. బాబును మరో దారిలో దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తోందా?.. విమర్శకుడు కత్తి మహేష్ కు కూడా ఇదే అనుమానం కలిగినట్టుంది.

ఓటుకు నోటు: మత్తయ్య చెప్పిన అసలు నిజాలు?.., తెర వెనుక ఇంత జరిగిందా?ఓటుకు నోటు: మత్తయ్య చెప్పిన అసలు నిజాలు?.., తెర వెనుక ఇంత జరిగిందా?

మోడీతో పెట్టుకుంటే?..:

'ఓటుకు నోటు కేసులో కీలక మలుపు. కేంద్రబాబు/చంద్రబాబుకు ప్రమాదం. మోడీతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చెప్పడానికి బీజేపీ చేస్తున్న కుట్రలో భాగమా!!'అంటూ మహేష్ కత్తి ఓ ట్వీట్ చేశారు.

ఓటుకు నోటు కేసులో జెరూసలెం మత్తయ్య అనూహ్యంగా అప్రూవర్ గా మారేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కత్తి మహేష్ ఈ ట్వీట్ చేశారు. మోడీతో పెట్టుకుంటే.. బాబు చిక్కుల్లో పడక తప్పదనే సంకేతమిచ్చేలా బీజేపీ పరోక్షంగా చేసిన కుట్ర అనేది ఈ ట్వీట్ ఉద్దేశంగా తెలుస్తోంది.

మోడీ నియంత.. బాబు మోసగాడు..:

ఇక ఏపీలో బీజేపీ, టీడీపీల వ్యవహార శైలిపై కూడా కత్తి మరో ట్వీట్ చేశారు. 'ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితి సంబంధించి.మోడీ ఒక నియంత. చంద్రబాబు ఒక మోసగాడు. ప్రత్యేకహోదా బీజేపీ ఇవ్వదు. తెలుగుదేశం ప్రత్యేకహోదా తీసుకుని రాదు. ఇక మిగతా విషయాల గురించి మాట్లాడదాం!' అంటూ.. టీడీపీ, బీజేపీ పాలిటిక్స్ అన్నీ ఓ డ్రామా అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు.

హీరోలకూ చురకలు:

ఏపీ ప్రయోజనాలకు సంబంధించి ఏ హీరో పెద్దగా స్పందించకపోతుండటంతో.. టాలీవుడ్ హీరోలకూ కత్తి మహేష్ చురకలంటించారు.

'కేంద్రబాబు/చంద్రబాబు కూడా మోడీ ప్రభుత్వం అన్యాయం చేసింది. ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్ కావాలి అని డిమాండ్ చేసేసారు. కనీసం ఇకనైనా మన తెలుగు హీరోలు ప్రత్యేక హోదాకోసం ట్వీట్లు చేసి, ఫ్యాన్స్ కి పిలుపు ఇస్తే గౌరవప్రదంగా ఉంటుంది.' అని ట్వీట్ చేశారు.

 కత్తిపై నెటిజెన్స్ సెటైర్స్..:

కత్తిపై నెటిజెన్స్ సెటైర్స్..:

ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబుపై చేసిన ట్వీట్‌కు కత్తి మహేష్‌పై నెటిజెన్స్ నుంచి చాలానే సెటైర్స్ పడ్డాయి. చంద్రబాబు గురించి సరే గానీ జగన్ సంగతేమంటావ్? అంటూ కొంతమంది ట్వీట్ చేశారు. ఇందూ టెక్ కుంభకోణంలో ప్రధాని మోడీకి సైతం నోటీసులు జారీ అయ్యాయి కదా?.. అంటూ జగన్ విషయాన్ని లేవనెత్తి చూపారు.

English summary
Critic Mahesh Kathi raised a doubt through his twitter account. Kathi tweeted like this' is there bjp conspiracy behind vote for cash case taking an unexpected turn
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X